Virat Kohli: విరాట్ అలాంటోడు కాదు.. ఎంత మంచోడో మాకు తెలుసు: RCB స్టార్

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోపల ఎలా ఉంటాడో తెలిసిందే. అగ్రెసివ్​గా ఉంటూ అపోజిషన్ టీమ్స్​ను వణికిస్తుంటాడు. అతడితో పెట్టుకోవాలంటేనే అందరూ భయపడతారు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోపల ఎలా ఉంటాడో తెలిసిందే. అగ్రెసివ్​గా ఉంటూ అపోజిషన్ టీమ్స్​ను వణికిస్తుంటాడు. అతడితో పెట్టుకోవాలంటేనే అందరూ భయపడతారు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోపల ఎలా ఉంటాడో తెలిసిందే. అగ్రెసివ్​గా ఉంటూ అపోజిషన్ టీమ్స్​ను వణికిస్తుంటాడు. అతడితో పెట్టుకోవాలంటేనే అందరూ భయపడతారు. మైదానం బయట సరదాగా ఉండే కింగ్.. యాక్షన్​లోకి దిగితే మాత్రం మారిపోతాడు. ప్రత్యర్థుల కళ్లలోకి కళ్లు పెట్టి చూసి సవాల్ విసురుతాడు. ఎవరైనా గెలికితే వాళ్ల పని పట్టకుండా వదలడు. అందుకే కోహ్లీ అంటే ప్రత్యర్థి జట్లు భయపడుతుంటాయి. ఈ యాటిట్యూడ్ సూపర్బ్ అని చాలా మంది మెచ్చుకుంటూ ఉంటారు. అయితే కొందరు మాత్రం కోహ్లీ గురించి లేనిపోనివి చెబుతూ అతడు చెడ్డోడు అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే కింగ్ అలాంటోడు కాదంటున్నాడో ఆర్సీబీ స్టార్.

విరాట్ ఎంత మంచోడో తమకు తెలుసునని ఆర్సీబీ పేసర్ యష్ దయాల్ అంటున్నాడు. అతడో డైమండ్ అని మెచ్చుకున్నాడు. సీనియర్లతో పాటు జూనియర్లతోనూ అతడు ఈజీగా కలసిపోతాడని ప్రశంసించాడు. ఈ ఐపీఎల్ సీజన్​లో తన సక్సెస్ వెనుక విరాట్ భాయ్ ఉన్నాడని.. అతడి సపోర్ట్ వల్లే తాను రాణించగలిగానని తెలిపాడు. ‘ఈ సీజన్ మొత్తం నిన్ను ఆడిస్తామని కోహ్లీ హామీ ఇచ్చాడు. ఇదో కొత్త ప్రదేశంలా భావించొద్దన్నాడు. నాకు ఫుల్ సపోర్ట్​గా నిలిచాడు. నాకు అనే కాదు.. టీమ్​లోని యంగ్​స్టర్స్ అందరికీ అతడు అండగా ఉన్నాడు. టీవీల్లో కొందరు చెప్పినట్లు మాత్రం అతడు లేడు. అతడు చాలా మంచోడు’ అని దయాల్ చెప్పుకొచ్చాడు. గత ఐపీఎల్ సీజన్​లో గుజరాత్ తరఫున ఆడిన ఈ యంగ్ పేసర్​ను కేకేఆర్ పించ్ హిట్టర్ రింకూ సింగ్ ఊచకోత కోశాడు.

యష్ దయాల్ వేసిన ఒకే ఓవర్​లో రింకూ వరుసగా 5 సిక్సులు కొట్టాడు. ఆ ఓవర్ దెబ్బకు యష్ డిప్రెషన్​లోకి వెళ్లిపోయాడు. బరువు కూడా తగ్గి క్రికెట్​కు దూరమయ్యాడు. కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన యష్.. బౌలింగ్​లో వేరియేషన్స్ తీసుకొచ్చాడు. కట్టర్స్, స్లో బాల్స్, యార్కర్స్ వేయడం నేర్చుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్​లో రాణించడంతో ఐపీఎల్-2024కు ముందు జరిగిన మినీ ఆక్షన్​లో అతడ్ని ఆర్సీబీ దక్కించుకుంది. టీమ్​లోకి వచ్చిన యష్​ను కెప్టెన్ డుప్లెసిస్, సీనియర్ ప్లేయర్ కోహ్లీ దగ్గరుండి ఆడించారు. నువ్వు రాణించగలవనే నమ్మకాన్ని ఇచ్చి సత్ఫలితాలు రాబట్టారు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ గురించి యష్ పైవిధంగా రియాక్ట్ అయ్యాడు. ఇక, ఐపీఎల్-2024లో 14 మ్యాచుల్లో కలిపి 15 వికెట్లు పడగొట్టాడు యష్. బెంగళూరు ప్లేఆఫ్స్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు.

Show comments