iDreamPost
android-app
ios-app

Virat Kohli Retirement: టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచి ఊహించని షాకిచ్చిన కోహ్లీ! రిటైర్మెంట్‌ ప్రకటన

  • Published Jun 30, 2024 | 12:42 AM Updated Updated Jun 30, 2024 | 8:08 AM

Virat Kohli, Retirement, T20 World Cup 2024, IND vs SA: టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ గెలిచిన తర్వాత అతను ఈ ప్రకటన చేశాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Virat Kohli, Retirement, T20 World Cup 2024, IND vs SA: టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ గెలిచిన తర్వాత అతను ఈ ప్రకటన చేశాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Jun 30, 2024 | 12:42 AMUpdated Jun 30, 2024 | 8:08 AM
Virat Kohli Retirement: టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచి ఊహించని షాకిచ్చిన కోహ్లీ! రిటైర్మెంట్‌ ప్రకటన

17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచింది. ఎప్పుడో 2007లో మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత.. మళ్లీ ఇన్నేళ్లుకు ఆ పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. భారత జట్టు వరల్డ్‌ కప్‌ గెలిచిందని సంతోష పడుతున్న అభిమానులకు వెంటనే షాకిచ్చాడు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ. టీ20ల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు తాను టీ20ల నుంచి తప్పుకుంటున్నాని, ఇదే చివరి టీ20 వరల్డ్‌ కప్‌ అంటూ మ్యాచ్‌ అనంతరం ప్రకటించాడు. కోహ్లీ నుంచి వచ్చిన ఈ ఊహించని ప్రకటనతో అంతా షాక్‌ తిన్నారు.

అయితే.. ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో పెద్దగా రాణించలేకపోయిన కోహ్లీ.. ఫైనల్‌ మ్యాచ్‌లో తన సత్తా చూపించాడు. తనను ఎందుకు అంతా బిగ్‌ మ్యాచ్‌ ప్లేయర్‌ అంటారో మరోసారి నిరూపించారు. ఆరంభంలోనే టీమిండియా రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సమయంలో జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకుని.. అక్షర్‌ పటేల్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించి.. మ్యాచ్‌లో టీమిండియాను నిలబెట్టాడు. ఇన్నింగ్స్‌ బిల్డ్‌ చేయడానికి కాస్త స్లోగా ఆడినా.. ఆ సమయంలో జట్టుకు అదే అవసరం అయింది. 19వ ఓవర్‌ వరకు క్రీజ్‌లో పాతుకుపోయిన కోహ్లీ.. 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 76 పరుగులు చేసి టీమిండియా తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ టీమిండియాకు ఎంతో కీలకంగా మారింది. ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంత గొప్ప ఇన్నింగ్స్‌ ఆడి.. కప్పు కొట్టిన తర్వాత టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు కోహ్లీ. కుర్రాళ్లుకు అవకాశం ఇచ్చేందుకే తాను తప్పుకుంటున్నాని ప్రకటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. టీ20లకు దూరమైనా.. వన్డే, టెస్టుల్లో కోహ్లీ కొనసాగనున్నాడు. కాగా.. తన టీ20 కెరీర్‌లో ఇప్పటి వరకు 125 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 117 ఇన్నింగ్స్‌ల్లో 48.7 యూవరేజ్‌, 137.04 స్ట్రైక్‌రేట్‌తో 4188 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 38 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్‌ 122గా ఉంది. టీ20ల్లో కోహ్లీ బౌలింగ్‌ చేసి నాలుగు వికెట్లు కూడా పడగొట్టాడు. మరి కోహ్లీ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.