SNP
Virat Kohli, Rohit Sharma, Duleep Trophy 2024: క్రికెట్ అభిమానులు కొన్నేళ్లుగా మిస్ అయిన విరాట్ కోహ్లీ వర్సెస్ రోహిత్ శర్మ ఫైట్‌ను మరోసారి చూసే అవకాశం కనిపిస్తోంది. ఆ ఫైట్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Virat Kohli, Rohit Sharma, Duleep Trophy 2024: క్రికెట్ అభిమానులు కొన్నేళ్లుగా మిస్ అయిన విరాట్ కోహ్లీ వర్సెస్ రోహిత్ శర్మ ఫైట్‌ను మరోసారి చూసే అవకాశం కనిపిస్తోంది. ఆ ఫైట్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
క్రికెట్ అభిమానులకు పండుగలాంటి వార్త ఏంటంటే.. విరాట్ కోహ్లీ మళ్లీ కెప్టెన్సీ చేయనున్నాడు. అది కూడా తాను ఏలిన టెస్ట్ క్రికెట్‌లో కెప్టెన్సీ చేయనున్నాడు. చాలా కాలం తర్వాత.. కోహ్లీని కెప్టెన్‌గా చూసే అవకాశం దక్కనుంది క్రికెట్ ఫ్యాన్స్‌కు. అయితే.. కోహ్లీ కెప్టెన్సీ చేయనుండటంతో పాటు రోహిత్ శర్మ టీమ్‌తో తలపడనుండటం మరో విశేషం. ఎప్పుడో ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్లుగా ఉన్నప్పుడు పోటీ పడ్డారు. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరూ కెప్టెన్లుగా తలపడే సీన్స్ చూడొచ్చు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కొన్నేళ్లపాటు పోటీ పడ్డారు. ఐపీఎల్ 2021 తర్వాత కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకున్న విషయం తెలిసిందే. అలాగే ఐపీఎల్ 2024 సీజన్‌కి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో హార్ధిక్ పాండ్యాను నియమించింది.
అయితే.. మళ్లీ చాలా కాలం తర్వాత.. కోహ్లీ వర్సెస్ రోహిత్ పోరును క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేయనున్నారు. ఇంతకీ ఏ టోర్నీలో వీరిద్దరు కెప్టెన్లుగా ఉంటారు? మ్యాచ్‌లు ఎప్పుడు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం టీమిండియాకు అంతర్జాతీయ మ్యాచ్‌లు లేవు. ఈ గ్యాప్‌లో దేశవాళి క్రికెట్ ఆడాలని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అలాగే శుబ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడజా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లను దులీప్ ట్రోఫీ ఆడాలని ఆదేశించింది బీసీసీఐ. వీరితో పాటు ఇషాన్ కిషన్ కూడా దులీప్ ట్రోఫీ ఆడనున్నాడు. ఇలా టీమిండియా స్టార్లంతా డొమెస్టిక్ క్రికెట్‌లో సందడి చేయనున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న సమయంలో ప్రాక్టీస్ కోసం భారత క్రికెటర్లు దేశవాళి క్రికెట్ ఆడాలని బీసీసీఐ సూచించింది.
అందులో భాగంగా.. సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో భారత స్టార్ క్రికెటర్లు ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లను బీసీసీఐ ఇండియా ఏ, బీ, సీ, డీ టీమ్స్‌గా విభజించి ఆడించనున్నట్లు సమాచారం. అయితే.. ఈ నాలుగు జట్లలో ఒక టీమ్‌కు రోహిత్ శర్మ, ఒక టీమ్‌కు విరాట్ కోహ్లీ కెప్టెన్లుగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లు కూడా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. వైస్ మూడు ఫార్మాట్లలో వైస్ కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్‌కు కూడా ఒక టీమ్ కెప్టెన్సీ అప్పటించే ఛాన్స్ ఉంది. కాగా.. దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లన్నీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించేందుకు బీసీసీఐ ఆలోచిస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో గల రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం, ఏసీఏ డీసీఏ క్రికెట్ స్టేడియంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కానీ, ఇప్పుడు టీమిండియా స్టార్లు బరిలోకి దిగుతుండటంతో బెంగళూరు వేదికగా మ్యాచ్‌లు నిర్వహించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. మరి దులీప్ ట్రోఫీలో కోహ్లీ వర్సెస్ రోహిత్ టీమ్స్ పోటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Who should be the Captains of India A, B, C, D in Duleep Trophy 2024? ⭐ pic.twitter.com/0NT9LTAoIP
— Johns. (@CricCrazyJohns) August 12, 2024