Virat Kohli: కోహ్లీతో గొడవపై మరోమారు క్లారిటీ ఇచ్చిన నవీన్.. తప్పు ఎవరిదో చెప్పేశాడు!

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత ఐపీఎల్​లో ఓ కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మ్యాంగో మ్యాన్ నవీనుల్ హక్​తో విరాట్ గొడవకు దిగడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత ఐపీఎల్​లో ఓ కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మ్యాంగో మ్యాన్ నవీనుల్ హక్​తో విరాట్ గొడవకు దిగడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

ఆఫ్ ది ఫీల్డ్ ఎంతో కూల్​గా ఉంటాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. నవ్వుతూ తనతో ఉన్న వారిని నవ్విస్తూ జోవియల్​గా ఉంటాడు. అయితే బయట ఇంత సరదాగా కనిపించే విరాట్.. గ్రౌండ్​లోకి దిగాడంటే మాత్రం మారిపోతాడు. పూర్తి అగ్రెసివ్ అప్రోచ్​తో ఆడతాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏది చేసినా దూకుడుగానే ముందుకు వెళ్తాడు. తనను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోడు. ఈ క్రమంలో కొన్ని సార్లు ఇతర ఆటగాళ్లతో గొడవకు దిగాడు కూడా. ఐపీఎల్​-2023 టైమ్​లో ఇలాగే ఓ కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచాడు. ఆఫ్ఘానిస్థాన్ పేసర్, మ్యాంగో మ్యాన్ నవీనుల్ హక్​తో విరాట్ గొడవకు దిగడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

లక్నో సూపర్ జియాంట్స్ ఇన్నింగ్స్ సమయంలో నవీన్​ను కోహ్లీ గెలికాడు. మ్యాంగో మ్యాన్​ను ఏదో అంటూ టీజ్ చేశాడు. అతడు కూడా విరాట్​తో ఢీ అంటే ఢీ అంటూ రెచ్చిపోయాడు. దీంతో కోహ్లీ మరింత రెచ్చిపోయాడు. అయితే మ్యాచ్ తర్వాత కోహ్లీ వద్దకు లక్నో మెంటార్ గౌతం గంభీర్ రావడంతో ఫైట్ మరింత ముదిరింది. విరాట్-గౌతీ ఇద్దరూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లడంతో కొట్టుకుంటారేమోనని అనిపించింది. కేఎల్ రాహుల్ ఆపడంతో గొడవ సద్దుమణిగింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ టైమ్​లో గంభీర్-కోహ్లీ ఒకర్నొకరు హగ్ చేసుకున్నారు. నవీన్​తో కూడా విరాట్ కలసిపోవడంతో ఈ గొడవకు ఫుల్​స్టాప్ పడింది. కానీ సీనియర్ స్పిన్నర్ అమితా మిశ్రా కామెంట్స్​తో మళ్లీ ఈ వివాదం తెర మీదకు వచ్చిది.

కోహ్లీనే లక్నో ప్లేయర్లను తిట్టాడని, అతడి వల్లే గొడవ మొదలైందని మిశ్రా అన్నాడు. విరాట్ దుర్భాషలాడటంతోనే నవీన్, గౌతీ అలా బిహేవ్ చేశారని చెప్పాడు. దీంతో ఈ కాంట్రవర్సీ గురించి సోషల్ మీడియాలో నెటిజన్స్ మళ్లీ డిస్కస్ చేస్తున్నారు. ఈ విషయంపై తాజాగా నవీనుల్ హక్ రియాక్ట్ అయ్యాడు. కోహ్లీతో ఫైట్​పై క్లారిటీ ఇచ్చాడు. ఆ ఘనటలో ఎవరిదీ తప్పు లేదని.. ఆ క్షణంలో అలా జరిగిపోయిందన్నాడు. ‘అది మ్యాచ్ టైమ్​లో అనుకోకుండా జరిగిపోయింది. అందులో పర్సనల్​గా అనుకోవడానికి ఏమీ లేదు. నేను, కోహ్లీ ఆ విషయాన్ని మర్చిపోయాం. వన్డే వరల్డ్ కప్ సమయంలో మేం కలసిపోయాం. ఇద్దరూ కౌలిగించుకొని ఆ కాంట్రవర్సీకి ఫుల్​స్టాప్ పెట్టాం. కానీ సోషల్ మీడియా మాత్రం మమ్మల్ని వదలడం లేదు’ అని నవీన్ చెప్పుకొచ్చాడు.

Show comments