iDreamPost
android-app
ios-app

Virat Kohli: ఇండియాకు గుడ్​బై చెప్పనున్న కోహ్లీ? ఆ దేశంలో పర్మినెంట్​గా సెటిల్!

  • Published Jul 08, 2024 | 8:38 PM Updated Updated Jul 08, 2024 | 8:38 PM

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫుల్ జోష్​లో ఉన్నాడు. ప్రపంచ కప్​ను ఒడిసిపట్టాలనే చిరకాల కోరిక నెరవేరడంతో అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫుల్ జోష్​లో ఉన్నాడు. ప్రపంచ కప్​ను ఒడిసిపట్టాలనే చిరకాల కోరిక నెరవేరడంతో అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

  • Published Jul 08, 2024 | 8:38 PMUpdated Jul 08, 2024 | 8:38 PM
Virat Kohli: ఇండియాకు గుడ్​బై చెప్పనున్న కోహ్లీ? ఆ దేశంలో పర్మినెంట్​గా సెటిల్!

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫుల్ జోష్​లో ఉన్నాడు. ప్రపంచ కప్​ను ఒడిసిపట్టాలనే చిరకాల కోరిక నెరవేరడంతో అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దశాబ్దంన్నరకు పైగా కెరీర్​లో ఎన్నో ఘనతలు అందుకున్న కింగ్ వరల్డ్ కప్ కోసం ఎంతో ఎదురు చూశాడు. అతడి కెరీర్ మొదట్లోనే వన్డే ప్రపంచ కప్-2011 గెలిచిన జట్టులో భాగమయ్యాడు కోహ్లీ. కానీ అప్పట్లో అతడు జట్టులో యంగ్​స్టర్. ఆ తర్వాత బ్యాటింగ్​ను మరింత మెరుగుపర్చుకొని సచిన్ టెండూల్కర్ వారసుడిగా ఎదిగాడు. రన్ మెషీన్ అనే బిరుదుకు సార్థకం చేస్తూ పరుగుల వరద పారించాడు. సీనియర్ ప్లేయర్​గా టీమ్ బ్యాటింగ్ భారాన్ని భుజాలపై మోశాడు. కెప్టెన్​గా ఎన్నో అపూర్వ విజయాలు అందించాడు. అయితే సీనియర్ అయ్యాక మాత్రం వరల్డ్ కప్​ను గెలుచుకోలేదు.

ప్రపంచ కప్ కోసం చాన్నాళ్లుగా ఎదురు చూసిన కోహ్లీ పొట్టి వరల్డ్ కప్-2024ను చేతబట్టి ఆ కోరికను నెరవేర్చుకున్నాడు. మెగాటోర్నీ ఫైనల్​తో టీ20లకు గుడ్​బై చెప్పిన కోహ్లీ.. ఇక మీదట వన్డేలు, టెస్టులకే పరిమితం కానున్నాడు. ఇదిలా ఉంటే.. విరాట్​కు సంబంధించిన ఓ విషయం చర్చనీయాంశంగా మారింది. అతడు త్వరలో భారత్​ను పూర్తిగా వదిలేసి వెళ్లిపోనున్నాడని సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. ఇండియాను వదిలేసి లండన్​కు వెళ్లి పర్మినెంట్​గా సెటిల్ అవ్వాలని కోహ్లీ-అనుష్క శర్మ డిసైడ్ అయ్యారని వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేశారని తెలుస్తోంది. లండన్​లో తమ టేస్ట్​కు తగ్గట్లు ఓ ఇంటిని కొని అక్కడికి షిఫ్ట్ అవ్వాలని విరుష్క భావిస్తున్నారని సమాచారం.

కోహ్లీ-అనుష్కకు రెండో సంతానంగా కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. అతడికి అకాయ్ అనే పేరు పెట్టాడు. కుమారుడు జన్మించడానికి ముందు నుంచే అనుష్క లండన్​లో చాన్నాళ్లు ఉంది. డెలివరీ తర్వాత కూడా అక్కడే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసింది. తాజాగా వరల్డ్ కప్​ ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చిన విరాట్.. ప్రధాని మోడీని కలిశాక, విక్టరీ పరేడ్ ముగించుకొని లండన్​కు వెళ్లిపోయాడు. ఇలా కోహ్లీ-అనుష్క ఈ మధ్య అక్కడే ఎక్కువగా ఉండటంతో దేశాన్ని విడిచి వెళ్లిపోతారనే వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. మీడియా, స్పాట్​లైట్​కు దూరంగా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతోనే భారత్​ను వీడి లండన్​కు వెళ్లిపోవాలని విరుష్క అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది కోహ్లీ స్పందిస్తే గానీ చెప్పలేం. మరి.. కోహ్లీ భారత్​ను వీడనున్నాడనే రూమర్స్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by CricFit | Cricket News Update (@cricfit)