iDreamPost
android-app
ios-app

కోహ్లీ 50 సెంచరీల రికార్డును బాబర్‌ బ్రేక్‌ చేస్తాడు! నవ్వకండి సీరియస్‌ మ్యాటర్‌!

  • Author singhj Published - 09:55 PM, Sat - 18 November 23

విరాట్ కోహ్లీ 50 సెంచరీల రికార్డును బాబర్ ఆజం బ్రేక్ చేస్తాడంటూ ఓ సీనియర్ క్రికెటర్ వ్యాఖ్యలు చేశాడు. అయితే అతడి వ్యాఖ్యలు విని క్రికెట్ ఫ్యాన్స్ సార్ ఆపేయండి, కామెడీ చేయకండని అంటున్నారు.

విరాట్ కోహ్లీ 50 సెంచరీల రికార్డును బాబర్ ఆజం బ్రేక్ చేస్తాడంటూ ఓ సీనియర్ క్రికెటర్ వ్యాఖ్యలు చేశాడు. అయితే అతడి వ్యాఖ్యలు విని క్రికెట్ ఫ్యాన్స్ సార్ ఆపేయండి, కామెడీ చేయకండని అంటున్నారు.

  • Author singhj Published - 09:55 PM, Sat - 18 November 23
కోహ్లీ 50 సెంచరీల రికార్డును బాబర్‌ బ్రేక్‌ చేస్తాడు! నవ్వకండి సీరియస్‌ మ్యాటర్‌!

వన్డే క్రికెట్​లో 49 సెంచరీలు చేయడం అనేది మామూలు విషయం కాదు. భారత బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఈ రికార్డును సాధించినప్పుడు మొత్తం క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. అసలు ఒక బ్యాటర్ ఇన్ని సెంచరీలు ఎలా కొట్టగలడని ఆశ్చర్యపోయింది. అయితే తలచుకుంటే ఏదైనా సాధ్యమేనంటూ 49 సెంచరీల రికార్డును సృష్టించాడు మాస్టర్ బ్లాస్టర్. అయితే టీ20ల ఎంట్రీ తర్వాత క్రమంగా వన్డేలు తగ్గిపోవడం మొదలైంది. చాలా జట్లు టెస్టులు, టీ20లు ఆడేందుకు మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ వచ్చాయి. కానీ టీమిండియా మాత్రం వన్డేలకు ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చింది. విదేశాల్లోనే గాక స్వదేశంలో కూడా సిరీస్​లు పెడుతూ వన్డేలకు క్రేజ్ తగ్గకుండా చూసుకుంది.

ఇక, సచిన్ 50 సెంచరీల రికార్డును చూసి ఆశ్చర్యపోయిన ప్రపంచం ఆ ఫీట్​ను ఎవరూ టచ్ చేయలేరని అనుకుంది. కానీ క్రికెట్ గాడ్​కు వారసుడిగా తానున్నానంటూ దూసుకొచ్చాడు కింగ్ కోహ్లీ. కంటిన్యూగా సెంచరీల మీద సెంచరీలు కొడుతూ మాస్టర్ రికార్డుకు చేరువగా వచ్చాడు విరాట్. అయితే గత మూడేళ్లుగా అతడి ఫామ్ సరిగ్గా లేదు. అందరు బ్యాటర్ల మాదిరిగానే అతడు కూడా బ్యాటింగ్​లో బ్యాడ్ సిచ్యువేషన్​ను ఫేస్ చేశాడు. రెండేళ్ల పాటు అతని బ్యాట్ నుంచి కనీసం ఒక్క సెంచరీ కూడా రాలేదు. దీంతో సచిన్ రికార్డు సేఫ్ అని అంతా అనుకున్నారు. కానీ ఈ ఏడాది తిరిగి ఫామ్​ను అందుకున్న కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నాడు. ఈ వరల్డ్ కప్​లో సచిన్ 49 సెంచరీల రికార్డును బ్రేక్ చేసిన విరాట్ 50వ సెంచరీ కూడా కొట్టి కొత్త క్రికెట్ దేవుడిగా అవతరించాడు.

కోహ్లీ ప్రస్తుతం ఫుల్ స్వింగ్​లో ఉన్నాడు. అతడు ఇలాగే మరో మూడ్నాలుగేళ్లు ఆడితే వన్డేల్లో ఇంకెన్ని సెంచరీలు బాదుతాడో చెప్పలేం. అయితే అప్పుడే విరాట్ 50 సెంచరీల రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారనే చర్చలు మొదలయ్యాయి. కోహ్లీ వారసుడు శుబ్​మన్ గిల్ అని.. అతడే ఆ రికార్డును అధిగమిస్తాడని భారత ఫ్యాన్స్ అంటున్నారు. తక్కువ టైమ్​లోనే టీమిండియాలో ప్లేస్​ను పర్మినెంట్ చేసుకున్నాడు గిల్. అన్ని ఫార్మాట్లలోనూ జట్టు తరఫున ఓపెనింగ్ చేస్తూ మంచి స్టార్ట్స్ అందిస్తున్నాడు. ఇటీవల కాలంలో వరుసు సెంచరీలతో ప్రత్యర్థులను బెదరగొడుతున్న గిల్.. వరల్డ్ కప్​లోనూ సూపర్ ఫామ్​లో ఉన్నాడు. గిల్ ఇలాగే మరో పదేళ్లు ఆడితే కోహ్లీ రికార్డులను బ్రేక్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

కోహ్లీ రికార్డును గిల్ బ్రేక్ చేస్తాడని టీమిండియా అభిమానులు అంటుంటే.. ఒక పాకిస్థాన్ క్రికెటర్ మాత్రం కింగ్ రికార్డులను బాబర్ ఆజం బద్దలు కొడతాడని అంటున్నాడు. విరాట్ 50 సెంచరీల రికార్డును బాబర్ బ్రేక్ చేస్తాడని పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ చెప్పాడు. అయితే అక్మల్ కామెంట్స్​పై భారత ఫ్యాన్స్ జోకులు వేసుకుంటున్నారు. వరల్డ్ కప్​లో టీమ్​ను నడిపించలేక కెప్టెన్సీ నుంచి తప్పుకున్న బాబర్​కు ముందు జట్టులో ప్లేస్ ఫిక్స్ చేసుకోమని చెప్పండంటూ సెటైర్స్ వేస్తున్నారు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్​లో ఫెయిలవుతున్న బాబర్​కు అంత సీన్ లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. చిన్న టీమ్స్ మీద బాగా ఆడే బాబర్.. పెద్ద జట్లతో మ్యాచ్ అంటేనే వణికిపోతాడని అలాంటోడు కోహ్లీ రికార్డులను బ్రేక్ చేస్తాడని అనడం పెద్ద జోక్ అని నవ్వుకుంటున్నారు. మరి.. కోహ్లీని దాటేటోడు బాబర్ అంటూ అక్మల్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌.. రోహిత్‌ శర్మ ఎమోషనల్‌ కామెంట్స్‌!