iDreamPost
android-app
ios-app

Vinod Kambli: నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ! వీడియో చూస్తే గుండెతరుక్కుపోతుంది..

  • Published Aug 05, 2024 | 6:48 PM Updated Updated Aug 05, 2024 | 6:48 PM

టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం నడవలేని దీనస్థితిలో అతడు ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ మారింది. ఆ వీడియో చూస్తే.. గుండె బరువెక్కడం ఖాయం.

టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం నడవలేని దీనస్థితిలో అతడు ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ మారింది. ఆ వీడియో చూస్తే.. గుండె బరువెక్కడం ఖాయం.

Vinod Kambli: నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ! వీడియో చూస్తే గుండెతరుక్కుపోతుంది..

టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చాలా సార్లు తన ఆరోగ్యం బాలేదని, రోజు రోజుకు తన పరిస్థితి దిగజారిపోతుందని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు వినోద్ కాంబ్లీ అసలు నడవడానికే కష్టపడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అడుగులు తడబడుతున్న వేళ.. ఇతరు సాయం అందించడంతో నడిచే దీనస్థితికి వచ్చాడు. ఈ వీడియో చూస్తే.. సగటు అభిమానుల గుండె తరుక్కుపోవడం ఖాయం.

వినోద్ కాంబ్లీ.. ముంబై క్రికెటర్ గానే కాకుండా.. సచిన్ టీమ్మెట్ గా అందరికి సుపరిచితుడే. సచిన్ అంత పేరు రావాల్సిన ఈ క్రికెటర్ కు అంత పేరు రాలేదు. అయితే ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. అందులో అతడి తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ప్రస్తుతం అతడు దీనస్థితిలో ఉన్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో కాలం వెళ్లదీస్తూ వస్తున్నాడు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇంకా కోలుకోలేదని ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. ఓ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిలర్ వినోద్ కాంబ్లీకి చెందిన వీడియోను షేర్ చేస్తూ.. ఈ విధంగా రాసుకొచ్చాడు. “వినోద్ కాంబ్లీ గుండె సంబంధిత వ్యాధితో పాటుగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. త్వరలోనే అతడు కోలుకోవాలని, అవసరమైన సాయం అతడికి అందించాలని కోరుకుంటున్నాను” అంటూ వీడియోను షేర్ చేశాడు.

Vinod Kambli

కాగా.. వినోద్ కాంబ్లీ 1993-2000 మధ్య టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. 17 టెస్టుల్లో 1084, 104 వన్డేల్లో 2477 పరుగులు చేశాడు. చివరిగా టీమిండియా తరఫున 2000లో ఆడాడు. ముంబై తరఫున 2004లో ఆఖరి మ్యాచ్ ఆడాడు. ఇదిలా ఉండగా.. 2013లో వినోద్ కాంబ్లీకి గుండెపోటు వచ్చింది. కారులో ప్రయాణిస్తున్న సమయంలో గుండెపోటు రాగా.. ఓ పోలీస్ అధికారి సకాలంలో గుర్తించి, అతడి ఆస్పత్రిలో చేర్పించాడు. దాంతో వినోద్ కాంబ్లీ ప్రాణాలు దక్కాయి. అనారోగ్య సమస్యలతో పాటుగా తాను చేసిన కొన్ని తప్పుల కారణంగా ఆర్థికంగా చితికిపోయాడు. ప్రస్తుతం నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఇక ఈ వీడియో చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని కొందరు క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచిన్ టెండుల్కర్ స్థాయికి రావాల్సిన ఆటగాడు ఇలా దీనస్థితిలో కనిపించడం నిజంగా బాధాకరం. అతడు ఆర్థికంగా, ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Narendra Gupta (@narendra.g333)