Vinesh Phogat: వినేశ్ ఫోగాట్ చనిపోతుందేమో అని భయపడ్డాం.. సంచలన విషయాలు వెల్లడించిన కోచ్!

Vinesh Phogat: వినేశ్ ఫోగాట్ చనిపోతుందేమో అని భయపడ్డాం.. సంచలన విషయాలు వెల్లడించిన కోచ్!

వినేశ్ ఫోగాట్ పర్సనల్ కోచ్ వోలర్ అకోస్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. వినేశ్ బరువు తగ్గించే క్రమంలో ఆమె చనిపోతుందేమో అని భయపడ్డాం అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

వినేశ్ ఫోగాట్ పర్సనల్ కోచ్ వోలర్ అకోస్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. వినేశ్ బరువు తగ్గించే క్రమంలో ఆమె చనిపోతుందేమో అని భయపడ్డాం అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024లో టీమిండియా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో బరిలోకి దిగి, అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ కు చేరుకుంది. అయితే కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందన్న కారణంతో ఆమెపై ఒలింపిక్ నిర్వాహకులు వేటు వేశారు. కాగా.. తాజాగా వినేశ్ పర్సనల్ కోచ్ వోలర్ అకోస్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. వినేశ్ బరువు తగ్గించే క్రమంలో ఆమె చనిపోతుందేమో అని భయపడ్డాం అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

వినేశ్ ఫోగాట్ పర్సనల్ కోచ్ వోలర్ అకోస్ తాజాగా పలు సంచలన విషయాలు వెల్లడించాడు. ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆమె బరువు తగ్గించేందుకు చేసిన వ్యాయామాల గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. “ఫైనల్ మ్యాచ్ కు ముందు వినేశ్ 2.7 కేజీల ఎక్కువ బరువు ఉన్నట్లు గుర్తించాం. ఒక గంటా ఇరవై నిమిషాల వర్కౌట్ తర్వాత కూడా కిలోన్నర బరువు అధికంగా ఉంది. దాంతో మరో 50 నిమిషాల వ్యాయామం చేపించాం. 50 కేజీలకు రావడమే టార్గెట్ గా అర్థరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు జామున 5:30 గంటల వరకు వర్కౌట్స్ చేయించాం. కేవలం రెండు, మూడు నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటూ ఇలా చేశాం. దాంతో ఆమె కుప్పకూలి పోయింది. ఈ సమయంలో ఆమె చనిపోతుందేమో అని భయపడ్డాం” అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు పర్సనల్ కోచ్ వోలర్ అకోస్. కాగా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కనీసం రజత పతకం అయినా ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లో అప్పీల్ చేసింది. కానీ అక్కడ ఆమెకు నిరాశే ఎదురైంది. వినేశ్ అప్పీల్ ను కోర్టు తిరస్కరించింది. ఇక ఒలింపిక్స్ కల చెదరడంతో.. 29 ఏళ్ల వినేశ్ తన రెజ్లింగ్ కెరీర్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

Show comments