Nidhan
Vikram Rathour: టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాథోడ్ కోసం కొత్త కోచ్ గంభీర్ మాటను కూడా బోర్డు లెక్కచేయలేదని వినికిడి.
Vikram Rathour: టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాథోడ్ కోసం కొత్త కోచ్ గంభీర్ మాటను కూడా బోర్డు లెక్కచేయలేదని వినికిడి.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 తర్వాత భారత క్రికెట్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొత్త కోచ్‌తో పాటు నయా కెప్టెన్, వైస్ కెప్టెన్ కూడా వచ్చేశారు. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆయన స్థానంలో కొత్త కోచ్‌గా మరో దిగ్గజం గౌతం గంభీర్‌ను నియమించింది భారత క్రికెట్ బోర్డు. వన్డేలు, టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. అయితే టీ20లకు మాత్రం సారథిని మార్చింది. పొట్టి ఫార్మాట్ నయా కెప్టెన్‌గా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌ను నియమించింది. అలాగే వన్డేలు, టీ20లకు వైస్ కెప్టెన్‌గా కుర్ర క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసింది.
ఇన్ని మార్పులు చేసిన బీసీసీఐ.. త్వరలో సపోర్ట్ స్టాఫ్ విషయంలోనూ ఛేంజెస్ చేయనుంది. పాత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, పాత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్థానంలో కొత్తవాళ్లు ఆ బాధ్యతలు తీసుకోనున్నారు. ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ జట్టుతోనే కంటిన్యూ కానున్నాడని.. అతడ్ని మరింత కాలం సీనియర్ టీమ్‌తో ఉంచాలని బోర్డు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు కొత్త కోచ్ గంభీర్ కూడా ఓకే చెప్పాడని వినిపిస్తోంది. అయితే ఫీల్డింగ్ కోచ్‌కు ఓకే చెప్పిన గంభీర్.. ఓ విషయంలో పాత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌కు అడ్డుపుల్ల వేశాడని సమాచారం. కానీ బీసీసీఐ మాత్రం అదేదీ పట్టించుకోకుండా రాథోడ్ సేవల్ని మరో విధంగా వాడుకోవాలని యోచిస్తోందట.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ నయా హెడ్‌గా విక్రమ్ రాథోడ్‌ను నియమించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. ప్రస్తుతం ఈ పోస్ట్‌లో ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం ఈ సెప్టెంబర్‌తో ముగుస్తుంది. ఆయన కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఈ పదవిలో కంటిన్యూ అయ్యేందుకు లక్ష్మణ్ ఆసక్తిగా లేకపోవడంతో రాథోడ్‌కు కీలక పోస్ట్ ఇచ్చేందుకు బోర్డు సిద్ధమైనట్లు వినికిడి. ఐసీసీ యానువల్ మీటింగ్ కోసం లంకకు వెళ్లిన బీసీసీఐ సెక్రెటరీ జైషా భారత్‌కు తిరిగొచ్చిన వెంటనే ఈ నియామకంపై తేల్చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే రాథోడ్‌ను ఆ పదవిలోకి తీసుకురావడం గంభీర్‌కు ఇష్టం లేదనే రూమర్స్ వస్తున్నాయి. కానీ బోర్డు వర్గాలు మాత్రం అలాంటిదేమీ లేదని.. ఇదంతా ట్రాష్ అని అంటున్నాయి. మరి.. విక్రమ్ రాథోడ్ ఎన్సీఏ బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.