iDreamPost
android-app
ios-app

Hardik Pandya: హార్దిక్​కు గంభీర్ బిగ్ టార్గెట్.. ప్రూవ్ చేస్తేనే టీమ్​లో పర్మినెంట్ ప్లేస్!

  • Published Jul 20, 2024 | 9:11 PMUpdated Jul 20, 2024 | 10:18 PM

Gautam Gambhir: టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు నిరాశలో కూరుకుపోయాడు. దానికి ఒకటి కాదు.. రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పర్సనల్ లైఫ్​కు సంబంధించినది అయితే.. మరొకటి ప్రొఫెషన్ ప్రాబ్లమ్.

Gautam Gambhir: టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు నిరాశలో కూరుకుపోయాడు. దానికి ఒకటి కాదు.. రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పర్సనల్ లైఫ్​కు సంబంధించినది అయితే.. మరొకటి ప్రొఫెషన్ ప్రాబ్లమ్.

  • Published Jul 20, 2024 | 9:11 PMUpdated Jul 20, 2024 | 10:18 PM
Hardik Pandya: హార్దిక్​కు గంభీర్ బిగ్ టార్గెట్.. ప్రూవ్ చేస్తేనే టీమ్​లో పర్మినెంట్ ప్లేస్!

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు నిరాశలో ఉన్నాడు. అదేంటి.. భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించి నయా హీరోగా అవతరించిన క్రికెటర్​కు అంతలో ఏమైందని అనుకోవచ్చు. కానీ హార్దిక్ హ్యాపీగా లేడనేది వాస్తవం. దానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి భార్య నటాషా స్టాంకోవిచ్​తో విడాకులు తీసుకోవడం, రెండోది టీమిండియా కెప్టెన్సీ దక్కకపోవడం. డివోర్స్ సంగతి కాసేపు పక్కనబెడితే.. హార్దిక్​కు భారత జట్టు సారథ్య పగ్గాలు దక్కకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వరల్డ్ కప్ హీరోను కాదని మరో సీనియర్​ సూర్యకుమార్ యాదవ్​కు టీ20 టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. కనీసం వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వలేదు.

శ్రీలంక టూర్​లో పాల్గొనబోయే టీమిండియా స్క్వాడ్స్​ను రీసెంట్​గా అనౌన్స్ చేసింది బీసీసీఐ. వన్డేల్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మే టీమ్​ను లీడ్ చేయనున్నాడు. టీ20లకు నూతన సారథిగా సూర్యకుమార్​ను ప్రకటించింది. ఈ రెండు ఫార్మాట్లలో వైస్ కెప్టెన్సీ పోస్ట్​కు యంగ్​స్టర్ శుబ్​మన్ గిల్​ను ఎంపిక చేసింది బోర్డు. టీ20 ప్రపంచ కప్​లో జట్టుకు వైస్ కెప్టెన్​గా ఉన్న పాండ్యాకు కెప్టెన్సీ దక్కుతుందని అనుకుంటే కనీసం వైస్ కెప్టెన్సీ పోస్ట్ కూడా దక్కలేదు. అతడు తరచూ గాయాలతో సావాసం చేయడం, ముంబై ఇండియన్స్​ సారథిగా ఉన్నప్పుడు ఓవరాక్షన్ చేయడమే దీనికి కారణమని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. అసలే బోర్డు నిర్ణయంతో బాధలో ఉన్న హార్దిక్​కు కొత్త కోచ్ గౌతం గంభీర్ నయా టార్గెట్ పెట్టాడని తెలుస్తోంది.

టీ20ల్లో పాండ్యా స్థానానికి ఢోకా లేదట. కానీ వన్డేల్లో మాత్రం అతడి ప్లేస్​కు గంభీర్ ఎర్త్ పెడుతున్నాడని రూమర్స్ వస్తున్నాయి. ఈ ఫార్మాట్​లో కొనసాగాలంటే అతడికి గౌతీ కొన్ని రూల్స్ పెట్టాడట. బౌలింగ్ ఫిట్​నెస్​ను నిరూపించుకోవాలని టార్గెట్ పెట్టాడట. అందులో భాగంగా విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని చెప్పాడట. ఆ టోర్నమెంట్​లో ఆడి అతడు తన బౌలింగ్ ఫిట్​నెస్​​ను ప్రూవ్ చేసుకుంటే వన్డేల్లో పర్మినెంట్ ప్లేస్ ఖాయమని హామీ ఇచ్చాడట. ఒకవేళ ఫెయిలైతే మాత్రం ప్రత్యామ్నాయాలను చూసుకుంటామని వార్నింగ్ ఇచ్చాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. వన్డేల్లో హార్దిక్ ఫుల్ కోటా బౌలింగ్ చేయాల్సిందేనని గంభీర్ పట్టుబడుతున్నాడట. అయితే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ వేస్తే గాయం తిరగబెట్టే ప్రమాదం ఉండటంతో గౌతీ కొత్త టార్గెట్​ను పాండ్యా ఎంతమేరకు అధిగమిస్తాడో చూడాలి. మరి.. హార్దిక్ కొత్త లక్ష్యాన్ని చేరుకుంటాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి