SNP
SNP
దేశాన్ని ఇండియాగా పిలవడాన్ని శాశ్వతంగా స్వస్తి చెప్పి.. ఇక నుంచి కేవలం భారత్‌గా మాత్రమే పిలిచేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న ప్రచారం జరుగుతుంది. స్వదేశంలో జరుగుతున్న జీ20 సదస్సుకు సంబంధించిన పలు పత్రాల్లో కూడా ఇండియాకి బదులు భారత్ అనే పేరును వాడారు. దీంతో ఇక నుంచి ఇండియా అనే పేరు ఉండది, భారత్ మాత్రమే అంటూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ సైతం టీమ్ ఇండియా కాదని.. టీమ్ భారత్ అంటూ బీసీసీఐ సెక్రటరీ జైషాకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.
ఇండియా అనేది బ్రిటీష్ వాళ్లు పెట్టిన పేరని, భారత్ అనేదే మన దేశానికి సరైన పేరని సెహ్వాగ్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సైతం ‘భారత్ మాతాకీ జై’ అంటూ భారత్ పేరుకు తన మద్దతు తెలుపుతున్నట్లుగా ఒక ట్వీట్ చేశారు. వీరిద్దరు చేసిన ట్వీట్లు బాగా వైరల్ అయ్యాయి. చాలా మంది కూడా భారత్ పేరును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ, అదే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆల్రెడీ దేశానికి భారత్ అనే పేరు ఉందని, రాజ్యాంగంలో ఇండియా అంటే భారత్ అని స్పష్టంగా పేర్కొని ఉందని కొత్తగా మీరు భారత్ అని పేరుపెట్టినట్లు అనవసరపు హడావిడి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ అనే పేరు పెట్టుకోవడంతోనే బీజేపీ ప్రభుత్వం ఈ వివాదం రేపిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ వివాదంపై భారత బాక్సర్, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌లో కాంస్య పతకం నెగ్గి, బాక్సింగ్‌లో దేశానికి తొలి ఒలింపిక్ పతకం అందించిన విజేందర్ సింగ్ స్పందించాడు. ‘రైతుల ఉద్యమం గురించి, మణిపూర్ అల్లర్ల గురించి, రెజ్లర్ల పోరాటంపై ఏనాడు ఒక్క ట్వీట్ కూడా చేయని వారంతా.. ఇప్పుడు భారత్ పేరు బాగుందని పేర్కొంటున్నారు’ అంటూ పరోక్షంగా వీరేందర్ సెహ్వాగ్, అమితాబ్ బచ్చన్‌కు చురకలు అంటించాడు. నిజానికి దేశాన్ని కుదిపేసిన సమస్యలపై సెహ్వాగ్ కానీ, బచ్చన్ కానీ స్పందించిన దఖాలు లేవు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
कई लोग मणिपुर पर किसानों पर पहलवानो पर एक भी ट्वीट नहीं करते अब कहते है भारत नाम अच्छा है 🙄
— Vijender Singh (@boxervijender) September 6, 2023
Vijender Singh 🔥 pic.twitter.com/PMG33M8eHh
— Gabbar (@Gabbar0099) September 7, 2023
ఇదీ చదవండి: ధోని క్రేజ్ కు ఫిదా అయిన WWE సూపర్ స్టార్!