CSK vs SRH మ్యాచ్.. CM రేవంత్ రెడ్డితో కలిసి సందడి చేసిన వెంకీ మామ! ఫొటోలు వైరల్..

ఉప్పల్ వేదికగా జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ చూసేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటుగా రాజకీయ ప్రముఖులు హాజరైయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, వెంకీ మామతో పాటుగా ఇంకెవరెవరు వచ్చారో తెలుసుకుందాం.

ఉప్పల్ వేదికగా జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ చూసేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటుగా రాజకీయ ప్రముఖులు హాజరైయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, వెంకీ మామతో పాటుగా ఇంకెవరెవరు వచ్చారో తెలుసుకుందాం.

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ జట్ల మధ్య పోరు జరుగుతోంది. ఇక ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు పొటెత్తారు. ఈ గ్రౌండ్ లో ఏ మ్యాచ్ జరిగినా ఇసుకేస్తే రాలనంత జనం వస్తారు. తాజాగా జరుగుతున్న మ్యాచ్ కు సైతం స్టేడియం మెుత్తం నిండిపోయింది. కాగా.. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కు సినీ, రాజకీయ సెలబ్రిటీల తాకిడి కూడా ఎక్కువైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మ్యాచ్ ను చూశాడు వెంకీ మామ. మరికొంత మంది సెలబ్రిటీలు సైతం ఈ పోరును వీక్షించారు. మరి ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం పదండి.

ఉప్పల్ వేదికగా జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ చూసేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటుగా రాజకీయ ప్రముఖులు హాజరైయ్యారు. ఇందులో ప్రముఖంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తో పాటుగా విక్టరీ వెంకటేష్, బ్రహ్మానందం, మెగాస్టార్ చిరంజీవి, స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా వచ్చారు. రేవంత్ రెడ్డి, వెంకీ మామ పక్కపక్కనే కూర్చుని మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు. ఇక ప్రేక్షకులు సీఎం సీఎం అంటూ అరుపులు పెట్టారు. దాంతో ఒక్కసారిగా స్టేడియం మెుత్తం దద్దరిల్లింది. సీఎం కుటుంబ సభ్యులతో పాటుగా వచ్చారు. వీరితో పాటుగా మరికొంత మంది ఇండస్ట్రీకి సంబంధించిన వారు వచ్చారు.

అయితే సాధారణంగానే వెంకీ మామకు క్రికెట్ అంటే పిచ్చని మనందరికి తెలిసిందే. హైదరాబాద్ లో మ్యాచ్ జరిగితే కచ్చితంగా వస్తాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. జట్టులో శివమ్ దుబే ఒక్కడే 45 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో.. స్కోర్ పరిగెత్తలేదు. అనంతరం 166 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ. అతడు కేవలం 12 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఇదికూడా చదవండి: వార్నర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా? SRH అందుకే తీసేసిందా? దానం ఏది నిజం?

Show comments