SNP
SNP
వన్డే ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర లిఖించింది ఓ అండర్-19 జట్టు. తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 515 పరుగుల భారీ స్కోర్ చేయడమే కాకుండా.. ప్రత్యర్థి స్వల్ప స్కోర్‌కే అవుట్ చేసి ఏకంగా 450 పరుగులు భారీ తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ రికార్డు విజయం ఐసీసీ అండర్ -19 పురుషుల వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో నమోదైంది. అర్జెంటీనా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా అండర్-19 టీమ్ ఈ సంచలన విజయాన్ని నమోదు చేసింది. అండర్-19 వన్డే చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. గతంలో ఏ టీమ్ కూడా ఇంత భారీ స్కోర్‌ను నమోదు చేయలేదు. అలాగే ఇంత భారీ తేడాతో విజయం సాధించలేదు.
అండర్-19 క్రికెట్‌లో ఆస్డ్రేలియా టీమ్ 2002లో కెన్యా అండర్-19 టీమ్‌పై 480 పరుగులు చేసింది. నిన్నటి వరకు అదే అత్యధిక స్కోర్ కాగా.. ఆ రికార్డును ఇప్పుడు అమెరికా అండర్-19 టీమ్ బద్దలు కొట్టి.. కొత్త చరిత్ర లిఖించింది. అయితే.. ఈ మ్యాచ్ ముందు వరకు లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒక్క ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా తమిళనాడు నిలిచింది. 2022లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో తమిళనాడు టీమ్ 506 పరుగులు చేసిన ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు అమెరికా-అర్జెంటీనా మ్యాచ్‌తో ఆ రికార్డు కూడా గల్లంతైంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ 515 పరుగులు భారీ స్కోర్ చేసింది. అమెరికా బ్యాటర్లలో భవ్య మెహతా(136), రిషి రమేష్(100) సెంచరీలో కదంతొక్కారు. అలాగే ప్రణవ్ చట్టిపలాయమ్(61), అర్జున్ మహేశ్(67) పరుగులతో రాణించారు. ఇక 516 పరుగులు కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన అర్జెంటీనా జట్టును అమెరికా పేసర్ ఆరిన్ నాదకర్ణి కుప్పకూల్చాడు. 6 ఓవర్లలో 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి.. అర్జెంటీనా ఓటమిని శాసించాడు. నాదకర్ణి దెబ్బకు అర్జెంటీనా కేవలం 65 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అర్జెంటీనా ఇన్నింగ్స్‌లో థియో 18 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం అయ్యారు. దీంతో.. అమెరికా చరిత్ర సృష్టిస్తూ.. అండర్-19 వన్డే ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మరి ఈ మ్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A quite incredible day in Toronto for our U19 Men’s team today.
– Total of 515/8
– Victory by 450 runs
– 2 individual centuries
– 211 run partnership
– Individual 6 wicket haulWell done to the whole squad and the support staff.
Photos: ICC/Peter Della Penna pic.twitter.com/idsgteEhsE
— USA Cricket (@usacricket) August 15, 2023
ఇదీ చదవండి: టీమిండియాకి దొరికిన టాప్-5 చెత్త కెప్టెన్స్ వీరే! పరువు తీశారు!