iDreamPost
android-app
ios-app

Aaron Jones: మ్యాచ్‌కి ముందు టీమిండియాకు USA ప్లేయర్‌ వార్నింగ్‌! ఏమన్నాడో తెలుసా?

  • Published Jun 12, 2024 | 11:28 AM Updated Updated Jun 12, 2024 | 2:43 PM

Aaron Jones, USA, India vs USA, T20 World Cup 2024: పాకిస్థాన్‌ను ఓడించిన ఉత్సాహంలో ఉన్న అమెరికా.. ఇప్పుడు టీమిండియాతో మ్యాచ్‌కు రెడీ అవుతుంది. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు యూఎస్‌ఏ ఓపెనర్‌ టీమిండియాకు వార్నింగ్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Aaron Jones, USA, India vs USA, T20 World Cup 2024: పాకిస్థాన్‌ను ఓడించిన ఉత్సాహంలో ఉన్న అమెరికా.. ఇప్పుడు టీమిండియాతో మ్యాచ్‌కు రెడీ అవుతుంది. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు యూఎస్‌ఏ ఓపెనర్‌ టీమిండియాకు వార్నింగ్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 12, 2024 | 11:28 AMUpdated Jun 12, 2024 | 2:43 PM
Aaron Jones: మ్యాచ్‌కి ముందు టీమిండియాకు USA ప్లేయర్‌ వార్నింగ్‌! ఏమన్నాడో తెలుసా?

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా టీమిండియా నేడు(బుధవారం) యూఎస్‌ఏతో మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ గ్రౌండ్‌లో ఇప్పటికే టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడిన విషయం తెలిసిందే. ఐర్లాండ్‌, పాకిస్థాన్‌పై రోహిత్‌ సేన.. ఈ గ్రౌండ్‌లో ఆడి గెలిచింది. అయితే.. ఈ పిచ్‌పై బ్యాటర్లు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. మరో వైపు యూఎస్‌ఏ టీమ్‌ కూడా రెండు మ్యాచ్‌లు గెలిచి వస్తోంది. కెనడా, పాకిస్థాన్‌ జట్లను ఓడించి.. ఇప్పుడు ఇండియాతో పోటీకి సిద్ధం అవుతోంది. భారత్‌ వర్సెస్‌ యూఎస్‌ఏ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్‌కి ముందు యూఎస్‌ఏ ఓపెనర్‌ టీమిండియా గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు.

టీమిండియాతో మ్యాచ్‌కి ముందు అమెరికా ఓపెనర్‌ ఆరోన్‌ జోన్స్‌ మాట్లాడుతూ.. మేం గత కొన్ని వారాలుగా చాలా కష్టపడుతున్నాం. అది మ్యాచ్‌లో కూడా కనిపిస్తోంది. ఇండియతో తమకు గట్టి పోటీ ఉంటుందని తెలుసు.. అయితే.. ఇన్ని రోజులుగా పడుతున్న కష్టం ఇండియాపై కూడా చూపిస్తాం.. ఇంతకుముందు(పాక్‌పై విజయం) ఏం చేశామో.. ఇప్పుడు ఇండియాపై కూడా అదే రిపీట్‌ చేస్తాం అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడు. అలాగే అమెరికాకు టీమిండియాలోని ఏ ప్లేయర్‌ నుంచి ముప్పు పొంచి ఉంది అని ఎదురైన ప్రశ్నకు… మేము దాని గురించి ఆలోచించడం లేదు.. న్యూయార్క్‌ వికెట్‌ను బట్టి చూస్తే.. జస్ప్రీత్‌ బుమ్రాను ఎదుర్కొవడం సవాల్‌గా భావిస్తాం, అతని నుంచి మాకు ఇబ్బంది ఎదురుకావొచ్చు అని జోన్స్‌ వెల్లడించాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. నేరుగా సూపర్‌ 8కు క్వాలిఫై అయిపోతుంది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఇండియా సూపర్‌ 8కు వెళ్తుంది. ఒక వేళ యూఎస్‌ఏ గెలిచినా అంతే. కానీ, ఇక్కడ టీమిండియా గెలవడమే పాకిస్థాన్‌కు ముఖ్యం. భారత్‌ గెలవాలనే పాక్‌ జట్టు కోరుకుంటుంది. ఎందుకంటే.. ఇండియా గెలిస్తే.. ఒక స్పాట్‌ ఖాయమైపోతుంది. అప్పుడు అమెరికా ఐర్లాండ్‌పై కచ్చితంగా గెలిచి తీరాలి. ఒక వేళ ఐర్లాండ్‌పై యూఎస్‌ఏ ఓడిపోతే.. పాకిస్థాన్‌కు సూపర్‌ 8కి వెళ్లేందుకు ఛాన్స్‌ ఉంటుంది. పాక్‌ విజయం పక్కనపెడితే.. ఇండియా కూడా యూఎస్‌ఏను లైట్‌ తీసుకోవద్దు అంటూ క్రికెట్‌ అభిమానులు సైతం హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.