iDreamPost
android-app
ios-app

వీడియో: ఒక్క సిక్స్‌తో IPLలోకి ఇంట్రీ ఇవ్వనున్న ‘ఆరోన్ జోన్స్’!

  • Published Jun 22, 2024 | 3:59 PM Updated Updated Jun 22, 2024 | 3:59 PM

Aaron Jones, USA vs WI, T20 World Cup 2024: అమెరికా చిచ్చరపిడుత ఆరోన్‌ జోన్స్‌ ఒక అద్భుతమైన సిక్స్‌ కొట్టాడు. ఆ ఒక్క సిక్స్‌ చాలు అతనికి ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ దక్కడానికి.. ఆ సిక్స్‌ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Aaron Jones, USA vs WI, T20 World Cup 2024: అమెరికా చిచ్చరపిడుత ఆరోన్‌ జోన్స్‌ ఒక అద్భుతమైన సిక్స్‌ కొట్టాడు. ఆ ఒక్క సిక్స్‌ చాలు అతనికి ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ దక్కడానికి.. ఆ సిక్స్‌ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 22, 2024 | 3:59 PMUpdated Jun 22, 2024 | 3:59 PM
వీడియో: ఒక్క సిక్స్‌తో IPLలోకి ఇంట్రీ ఇవ్వనున్న ‘ఆరోన్ జోన్స్’!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో పెను సంచలనం సృష్టించిన టీమ్‌ ఏందంటే.. యూఎస్‌ఏ అనే చెప్పాలి. పాకిస్థాన్‌ లాంటి బలమైన జట్టును గ్రూప్‌ స్టేజ్‌లోనే ఓడించి.. తొలి సారి టీ20 వరల్డ్‌ కప్‌ ఆడుతున్నా.. ఏకంగా సూపర్‌ 8కి అర్హత సాధించింది. సూపర్‌ 8లో కూడా పసికూనలా కాకుండా కాస్త మెరుగైన ప్రదర్శన చేస్తోంది. అయితే.. అమెరికా టీమ్‌ ఓపెనర్‌ ఆరోన్‌ జోన్స్‌ గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆ యువ క్రికెటర్‌ అద్భుతమైన షాట్లతో, మంచి ఇన్నింగ్స్‌లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కొంతమంది క్రికెట్‌ అభిమానులు అతన్ని అమెరికా కోహ్లీ, యూఎస్‌ఏ కోహ్లీ అని కూడా పిలుచుకుంటున్నారు. తాజాగా అతను ఆడిన ఓ షాట్‌ అయితే సూపర్‌గా ఉంది.

సూపర్‌ 8లో భాగంగా వెస్టిండీస్‌, యూఎస్‌ఏ మధ్య శుక్రవారం మ్యాచ్‌ జరిగింది ఆ మ్యాచ్‌లో ఆరోన్‌ జోన్స్‌ కొట్టిన ఒక భారీ సిక్స్‌ క్రికెట్‌ లోకాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఎందుకంటే ఆ సిక్స్‌ ఏకంగా 101 మీటర్ల దూరం వెళ్లి పడింది. స్టేడియం రూఫ్‌పై పడిన బాల్‌.. అటు నుంచి అటు బయటి పడిపోయింది. ఆ సిక్స్‌ చూసి.. మరో ఎండ్‌లో ఉన్న కోరీ ఆండర్సన్‌ కూడా ఫిదా అయిపోయాడు. వెస్టిండీస్‌ స్టార​ బౌలర్‌ అల్జారీ జోసెఫ్‌ 145 కేఎంపీహెచ్‌తో వేసిన షార్ట్‌ బాల్‌ను ఆరోన్‌ అద్భుతంగా సిక్స్‌ కొట్టాడు. ఈ సిక్స్‌తో మనోడికి ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ గ్యారెంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సరిగ్గా వాడుకుంటే.. ఏదో ఒక టీమ్ ఐపీఎల్‌ 2025లో ఆరోన్‌ జోన్స్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్‌ నిపుణులు కూడా అభిప్రాయ పడుతున్నారు. మరి జోన్స్‌ ఏ టీమ్‌కి ఆడితే బాగుంటుంది? ఏ టీమ్‌ తీసుకునే ఛాన్స్‌ ఉందో అని అప్పుడే క్రికెట్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అమెరికా 19.5 ఓవర్లలో 128 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ ఆండ్రీస్ గౌస్ 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 29 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఎన్‌ఆర్‌ కుమార్‌ 20, మిలింద్‌ కుమార్‌ 19, ఆరోన్‌ జోన్స్‌ 11 పరుగులు చేశారు. వెస్టిండీస్‌ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్‌ 3, రోస్టన్‌ ఛేస్‌ 3 వికెట్లు పడగొట్టారు. ఇక 129 పరుగుల ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. టార్గెట్‌ను ఊదిపారేసింది. కేవలం 10.5 ఓవర్లలో ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 130 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ షై హోప్‌ 39 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సులతో 82 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మరి ఈ మ్యాచ్‌లో 101 మీటర్ల సిక్స్‌ అదరగొట్టిన ఆరోన్‌ జోన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.