iDreamPost
android-app
ios-app

Rishabh Pant: పంత్​పై ప్రేమను మరోమారు బయటపెట్టిన ఊర్వశి రౌటేలా.. ఒక్క పనితో ఫుల్ క్లారిటీ!

  • Published Aug 10, 2024 | 10:26 PM Updated Updated Aug 10, 2024 | 10:26 PM

Urvashi Rautela: టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్​కు బాలీవుడ్ హీరోయిన్​ ఊర్వశి రౌటేలాకు మధ్య ఏదో ఉందని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని చాలా గాసిప్స్ వచ్చాయి.

Urvashi Rautela: టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్​కు బాలీవుడ్ హీరోయిన్​ ఊర్వశి రౌటేలాకు మధ్య ఏదో ఉందని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని చాలా గాసిప్స్ వచ్చాయి.

  • Published Aug 10, 2024 | 10:26 PMUpdated Aug 10, 2024 | 10:26 PM
Rishabh Pant: పంత్​పై ప్రేమను మరోమారు బయటపెట్టిన ఊర్వశి రౌటేలా.. ఒక్క పనితో ఫుల్ క్లారిటీ!

టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ పర్సనల్ లైఫ్​కు సంబంధించి చాలా రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. ఫలానా అమ్మాయితో పంత్ ప్రేమాయణం నడిపిస్తున్నాడని.. ఆమె కాదు, స్టార్ క్రికెటర్ లవర్ ఈమె అంటూ ఎన్నో పుకార్లు వస్తుంటాయి. అయితే ఎక్కువగా వినపడేది మాత్రం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలా పేరు అనే చెప్పాలి. వీళ్లిద్దరూ రిలేషన్​లో ఉన్నారని ఐదారేళ్లుగా వార్తలు వస్తున్నాయి. 2018లో ముంబైలోని ఓ రెస్టారెంట్​లో కలసి డిన్నర్ చేయడంతో పంత్-ఊర్వశి డేటింగ్ చేస్తున్నారనే న్యూస్ గుప్పుమంది. అది మొదలు ఎన్నోసార్లు వీళ్ల ఎఫైర్ గురించి ఏదో ఒక రూమర్ రావడం కామన్ అయిపోయింది. అయితే ఇషా నేగీ అనే మరో అమ్మాయితో పంత్ కలసి కనిపించడంతో వీటికి ఫుల్​స్టాప్ పడింది.

రోడ్డు ప్రమాదం తర్వాత పంత్ ఆస్పత్రికి పరిమితమవడం, ఆ తర్వాత కమ్​బ్యాక్​లో బిజీ అయిపోవడంతో ఊర్వశితో అతడి ప్రేమాయణం అంశాన్ని అంతా పక్కనబెట్టేశారు. ఎక్కడైనా కనిపించినా ఈ మ్యాటర్​పై పెద్దగా రియాక్ట్ కాకపోవడంతో పంత్​కు ఆమెకు మధ్య ఏమీ లేదని అంతా డిసైడ్ అయ్యారు. ఈ తరుణంలో ఒక్క పోస్ట్​తో ఆ స్టార్ క్రికెటర్​ మీద తనకు ఉన్న ప్రేమను మరోమారు బయటపెట్టింది ఊర్వశి. ఇన్​స్టాగ్రామ్ వేదికగా ఆమె ఓ ఇంట్రెస్టింగ్ వీడియో క్లిప్​ను షేర్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించిన ఈ వీడియోలో ఊర్వశి ఆరెంజ్ కలర్ బట్టల్లో చేతిలో బ్యాట్ పట్టుకొని కనిపించింది. టీ20 వరల్డ్ కప్-2024లో ఐర్లాండ్​తో మ్యాచ్​లో బేరీ మెక్​కార్తీ బౌలింగ్​లో ర్యాంప్ షాట్ ఆడాడు పంత్. అదే షాట్​ను తాను బాదినట్లు ఏఐ సాయంతో వీడియోను తయారు చేసి షేర్ చేసింది ఊర్వశి.

సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ఊర్వశి ఇలా ఫన్నీ వీడియో చేసిందని కొందరు అంటున్నారు. అయితే ఇది చూసిన నెటిజన్స్ మాత్రం పంత్ మీద ఆమెకు ప్రేమ తగ్గలేదని, అందుకే అతడ్ని వదలడం లేదని అంటున్నారు. స్టార్ క్రికెటర్​పై ఇంత లవ్​ను దాచుకుందా అని చెబుతున్నారు. ఒక్క పనితో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా అంటున్నారు. ఇదిలా ఉంటే.. రిషబ్ పంత్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్, వరల్డ్ కప్​లో ఆడి అలసిపోయాడు. దీంతో ఆ తర్వాత జరిగిన జింబాబ్వే సిరీస్​కు అతడికి విశ్రాంతిని ఇచ్చారు. విరామం తర్వాత శ్రీలంక టూర్​లో పాల్గొన్న పంత్.. ఇప్పుడు ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ తరుణంలో ఊర్వశి పోస్ట్​తో మరోమారు వార్తల్లో నిలిచాడు. మరి.. ఊర్వశి రౌటేలా పోస్ట్​ను చూశాక మీకేం అనిపించిందో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ai fun Verse (@aifunverse)