SNP
Sachin Tendulkar, Hardik Pandya: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఇంత వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. ఆ జట్టులో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
Sachin Tendulkar, Hardik Pandya: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఇంత వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. ఆ జట్టులో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏం బాగా లేదు. రోహిత్ శర్మ ప్లేస్‌లో హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేయడంతో మొదలైన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. అదీ కాక ఆ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో కూడా కొన్ని ఘోర ఓటములు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే ప్రత్యర్థి జట్టుకు అత్యధిక పరుగులు సమర్పించుకున్న టీమ్‌గా ముంబై ఇండియన్స్ అపఖ్యాతిని మూటగట్టుకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆ జట్టు కెప్టెన్ పాండ్యాను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. స్టేడియానికి వచ్చే ప్రేక్షకులు సైతం.. పాండ్యా పేరు వినపడినా బో అని మొత్తుకుంటున్నారు. ఈ క్రమంలోనే అసలు ముంబై టీమ్‌లో రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా పొజిషన్ ఏంటో తేల్చి చెప్పే వీడియో ఒకటి బయటికి వచ్చింది.
ఈ వీడియో ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో జరిగిన ఘటనకు సంబంధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఏప్రిల్ 1న వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే.. ఆ మ్యాచ్‌కి ముందు ఆటగాళ్లంతా గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో.. ముంబై ఇండియన్స్‌కు మెంటర్‌గా ఉన్న దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పిచ్ ఎలా ఉందో చూసేందుకు గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక దిగ్గజ క్రికెటర్, తమకు మెంటర్‌గా ఉన్న సచిన్ అంతటి వ్యక్తి పిచ్ పరిశీలించేందుకు వస్తే.. టీమ్ కెప్టెన్‌గా సచిన్ వెంట ఉండి.. పిచ్ ఎలా ఉందో పరిశీలించాలి. కానీ, పాండ్యా అలా చేయలేదు. కనీసం సచిన్‌ను పట్టించుకోలేదు.
అదే సమయంలో ఎక్కడో దూరంగా ఉన్న రోహిత్ శర్మ మాత్రం వెంటనే సచిన్ దగ్గరికి వచ్చి, పిచ్ ఎలా ఉందో సచిన్‌తో కలిసి పరిశీలించి.. ఆయన సలహాలు సూచనలు తీసుకున్నాడు. తర్వాత అయినా పాండ్యా అక్కడికి వస్తాడేమో అని రోహిత్ అతని వైపు చూశాడు, కానీ పాండ్యా పట్టించుకోలేదు. చివరికి సచినే పాండ్యా వద్దకు వచ్చి.. పిచ్ ఎలా ఉందో ఏంటో వివరించాడు. ఇంత ఈగో ఎందుకు పాండ్యా, ఇందుకే కదా నిన్ను అంతా తిట్టేది అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. సచిన్ లాంటి వ్యక్తి వచ్చి పిచ్‌ను పరిశీలిస్తుంటే కెప్టెన్‌గా పాండ్యా పక్కనుండాలని, రోహిత్‌ను చూసి పాండ్యా నేర్చుకోవాల్సింది ఇదే అని అంటున్నారు. ఇదే పాండ్యాకు, రోహిత్‌కు ఉన తేడా అంటూ పేర్కొన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“Hardik Pandya ignored Sachin Tendulkar”.pic.twitter.com/dtyjj4rV2A
— 🐐 (@ItsHitmanERA) April 2, 2024