SNP
ఇండియా-ఆఫ్ఘాన్ మధ్య ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించింది. అయితే.. కేవలం మ్యాచ్ మాత్రమే కాదు.. మ్యాచ్‌కు సంబంధం లేకుండా జరిగిన కొన్ని సీన్స్ అయితే క్రికెట్ అభిమానులకు ఐ ఫీస్ట్‌గా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఇండియా-ఆఫ్ఘాన్ మధ్య ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించింది. అయితే.. కేవలం మ్యాచ్ మాత్రమే కాదు.. మ్యాచ్‌కు సంబంధం లేకుండా జరిగిన కొన్ని సీన్స్ అయితే క్రికెట్ అభిమానులకు ఐ ఫీస్ట్‌గా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఇండోర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో ఇప్పటికే కైవసం చేసుకుంది. ఇక మిగిలిన ఆ ఒక్క మ్యాచ్ కూడా గెలిస్తే.. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయవచ్చు. రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఆఫ్ఘాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆఫ్ఘాన్ వన్‌డౌన్ బ్యాటర్ గుల్బద్దీన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 57 పరుగులు చేసి రాణించడతో ఆఫ్ఘాన్‌కు మంచి స్కోర్ దక్కింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అర్హదీప్ సింగ్ 3, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శివమ్ దూబే ఒక వికెట్ తీసుకున్నాడు.
ఇక 173 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. డేంజరస్ బ్యాటర్, కెప్టెన్ రోహిత్ శర్మ గోల్డెన్ డక్ అయ్యాడు. కానీ, తర్వాత వచ్చిన కోహ్లీ.. జైస్వాల్‌తో కలిసి చాలా ఏకంగా ఆడి.. పవర్ ప్లేలో పరుగులు వదర పారించారు. కోహ్లీ అవుటైనా.. జైస్వాల్, శివమ్ దూబే సిక్సులతో విరుచుకుపడ్డారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని మ్యాచ్‌ను టీమిండియా చేతుల్లో పెట్టేశారు. మొత్తంగా 15.4 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి టీమిండియా టార్గెట్‌ను ఛేదించింది. జైస్వాల్ 68, దూబే 63(నాటౌట్), కోహ్లీ 29 రాణించారు. చివర్లో రింకూ 9 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్ ఇలా అద్భుతంగా సాగి.. క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందిస్తే.. మరో వైపు మ్యాచ్‌లో, మ్యాచ్ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు క్రికెట్ ఫ్యాన్స్‌ను మరింత సంతోషానికి గురిచేస్తున్నాయి.
అయితే.. చాలా మంది వాటిని నోటీస్ చేసి ఉండరు. అవేంటంటే.. టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ వద్ద ఉన్న సమయంలో ఒక అభిమాని సడెన్‌గా పరిగెత్తుకుంటూ వచ్చి కోహ్లీ కాళ్లమీద పడిపోయాడు. అతన్ని లేపి హగ్ చేసుకుని కోహ్లీ తన హుందాతనాన్ని చాటుకున్నాడు. అయితే ఆ కుర్రాడ్ని అక్కడున్న సెక్యూరిటీ వాళ్లు పట్టుకుని వెళ్తుంటే.. కాస్త జాగ్రత్త అంటూ కోహ్లీ వారికి సూచించడం మరింత హైలెట్‌గా మారింది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత.. విజయానికి ఒక్క రన్ అవసరమైన దశలో వైడ్‌తో టీమిండియాకు విజయం దక్కడంతో డకౌట్‌లో కూర్చున్న కోహ్లీ, శుబ్‌మన్ గిల్ షాక్ అయ్యారు. అయితే.. ఆ టైమ్‌లో స్ట్రైక్‌లో ఉన్న దూబే సిక్స్‌తో మ్యాచ్ ముగిస్తాడని వారు భావించి ఉంటారు. కానీ, వైడ్‌తో మ్యాచ్ ముగిసిపోవడంతో అలా షాక్ అయ్యారని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక ఈ మ్యాచ్ తర్వాత శివమ్ దూబే గురించి మాట్లాడుకుంటూ.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంతో సరదాగా నవ్వుకోవడం మాత్రం మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. కోహ్లీ వచ్చి దూబే గురించి రోహిత్‌కి ఏదో చెప్పడం దానికి రోహిత్ పగలబడి నవ్వుడం చూసేందుక ఐ ఫీస్ట్‌గా ఉంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఆఫ్ఘాన్‌తో రెండో మ్యాచ్‌లో టీమిండియా గెలుపుకంటే.. ఈ బిహైండ్ ది సీన్స్ భారత క్రికెట్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. మరి ఈ సీన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
My wish of hugging Virat Kohli got fulfilled today ❤️pic.twitter.com/r0B8ZjE0Ui https://t.co/vjCWSPyY9e
— Aarav (@sigma__male_) January 14, 2024
Rohit Sharma and Virat kohli funny chat with Shivam dube😜#RohitSharma #ViratKohli pic.twitter.com/212IjEtTA5
— Ravi Sharma (@RaviSharma2845) January 14, 2024
The Moment India won the T20I series against Afghanistan.
– Virat Kohli and Shubman Gill’s reactions and happiness is priceless..!!!pic.twitter.com/yR4vpavr2Q
— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 15, 2024