iDreamPost
android-app
ios-app

గ్రౌండ్‌లో సౌతాఫ్రికా క్రికెటర్ల కన్నీళ్లు! అప్పుడు సీనియర్లు.. ఇప్పుడు జూనియర్లు!

  • Published Feb 07, 2024 | 12:16 PM Updated Updated Feb 07, 2024 | 12:16 PM

Under 19 South Africa players tears: అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు ఓడిపోయింది. దీంతో ప్లేయర్లు గ్రౌండ్ లోనే కన్నీరు పెట్టుకున్నారు.

Under 19 South Africa players tears: అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు ఓడిపోయింది. దీంతో ప్లేయర్లు గ్రౌండ్ లోనే కన్నీరు పెట్టుకున్నారు.

గ్రౌండ్‌లో సౌతాఫ్రికా క్రికెటర్ల కన్నీళ్లు! అప్పుడు సీనియర్లు.. ఇప్పుడు జూనియర్లు!

ప్రపంచ క్రికెట్ లో అత్యంత దురదృష్టకరమైన జట్టు ఏదంటే? అందరి నోట దాదాపుగా ఒకటే సమాధానం వస్తుంది. ఆ ఆన్సర్ పేరే ‘సౌతాఫ్రికా’. ICC మెగా టోర్నీల్లో సౌతాఫ్రికాకు ఓ బ్యాడ్ సెంటి మెంట్ ఉంది. దాని కారణంగానే క్రికెట్ లో ‘చోకర్స్’ అనే పేరుతో ముద్రవేయించుకుంది ప్రోటీస్ టీమ్. దక్షిణాఫ్రికా టీమ్ మిగతా టోర్నీల్లో అద్భుతంగా రాణించినప్పటికీ.. వరల్డ్ కప్ లాంటి ఈవెంట్లలో సెమీ ఫైనల్లో ఓడిపోవడం సంప్రదాయంగా కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఇదే సెంటిమెంట్ ను రిపీట్ కొనసాగిస్తోంది జూనియర్ల టీమ్. అండర్ 19 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియాపై 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది యువ సౌతాఫ్రికా. దీంతో ఒక్కసారిగా గ్రౌండ్ లోనే కన్నీరు పెట్టుకున్నారు సఫారీ ప్లేయర్లు.

సౌతాఫ్రికా సీనియర్ జట్టును వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్ జూనియర్లను సైతం వదిలిపెట్టడం లేదు. సఫారీ టీమ్ కు ఉన్న సెమీస్ గండాన్ని దాటడం పెద్ద సవాల్ గా మారింది. తాజాగా అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది దక్షిణాఫ్రికా టీమ్. తమ ఆశలు ఆవిరి కావడంతో.. గ్రౌండ్ లోనే కన్నీరు పెట్టుకున్నారు ప్లేయర్లు. దేశానికి వరల్డ్ కప్ అందించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు.. అది నెరవేరకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు.

అయితే సఫారీ టీమ్ సెమీస్ లో ఓడిపోవడం ఇదే తొలిసారి కాదు.. గత కొన్ని సంవత్సరాలుగా సీనియర్లు కూడా ఈ సెమీస్ సవాల్ ను దాటలేకపోతున్నారు. 2015 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పై ఓడిపోవడం, 2023 ప్రపంచ కప్ లో కూడా ఆస్ట్రేలియాపై విజయం సాధించలేకపోయింది దక్షిణాఫ్రికా టీమ్. క్రికెట్ ప్రపంచంలో చోకర్స్ గా ముద్రపడ్డ సీనియర్ సఫారీ టీమ్ బాటలోనే జూనియర్ టీమ్ కూడా కొనసాగడం వారి దురదృష్టంగా చెప్పవచ్చు. క్రికెట్ చరిత్రలో ఇలా బ్యాడ్ సెంటిమెంట్ ఎదుర్కొంటున్న ఏకైక టీమ్ సౌతాఫ్రికానే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్ ప్రిటోరియస్(76), రిచర్డ్ సెలెట్స్ వానే(64) పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో రాజ్ లింబాని 3, ముషీర్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 8 వికెట్లు నష్టపోయి 48.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ ఉదయ్ సహరన్(81), సచిన్ దాస్(96) పరుగులతో జట్టుకు విజయాన్ని అందించారు. ఇక ఈ విజయంతో భారత్ అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మరి సీనియర్ల తరహాలోనే జూనియర్లు కూడా సెమీస్ గండాన్ని ఎదుర్కోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Virender Sehwag: ముంబై టీమ్‌లోకి వీరేందర్‌ సెహ్వాగ్‌! పొజిషన్‌ ఏంటంటే..?