iDreamPost
android-app
ios-app

క్రికెట్​లో ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేని 10 రికార్డ్స్! టచ్ చేసే మగాళ్లు ఈ జనరేషన్​లో లేరు!

  • Author singhj Updated - 12:39 PM, Thu - 14 December 23

క్రికెట్​లో కొన్ని అరుదైన రికార్డ్స్ ఉన్నాయి. వాటిని బ్రేక్ చేయడం పక్కనబెడితే కనీసం దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేని పరిస్థితి. ఆ రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్​లో కొన్ని అరుదైన రికార్డ్స్ ఉన్నాయి. వాటిని బ్రేక్ చేయడం పక్కనబెడితే కనీసం దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేని పరిస్థితి. ఆ రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Author singhj Updated - 12:39 PM, Thu - 14 December 23
క్రికెట్​లో ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేని 10 రికార్డ్స్! టచ్ చేసే మగాళ్లు ఈ జనరేషన్​లో లేరు!

ఏ గేమ్​లోనైనా రికార్డులకు ఎంత వ్యాల్యూ ఇస్తారో తెలిసిందే. ఒక ఆటగాడు లేదా టీమ్ ఘనతల గురించి చెప్పాలంటే ముందు సాధించిన ట్రోఫీలు, ఆ తర్వాత రికార్డుల గురించే అందరూ మాట్లాడుకుంటారు. క్రికెట్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. జెంటిల్మన్ గేమ్​లో ఎందరో గ్రేట్ ప్లేయర్స్ వచ్చారు. వాళ్లు ఎన్నో రికార్డులను సృష్టించారు. ఆ రికార్డుల్ని కొత్త ప్లేయర్స్ అందుకునేందుకు, కుదిరితే వాటిని బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్నింటిని మాత్రం ఎవరూ అందుకోలేరనే చెప్పాలి. బ్రేక్ చేయడం పక్కనపెడితే కనీసం వాటి దరిదాపుల్లోకి కూడా రాలేరు. అలాంటివి చాలానే ఉన్నా.. అందులోని టాప్-10 రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టాప్-10 రికార్డుల్లో ముందు వరుసలో ఉండేది భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డు. ఓవరాల్​గా తన 23 ఏళ్ల కెరీర్​లో 664 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ అన్ని ఫార్మాట్లలోనూ కలిపి ఏకంగా 100 సెంచరీలు బాదాడు. అందులో వన్డేల్లో 49 సెంచరీలు ఉండగా.. టెస్టుల్లో 51 సెంచరీలు ఉన్నాయి. సచిన్ రికార్డుకు దరిదాపుల్లోనూ ఏ ప్లేయర్ లేడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (79 సెంచరీలు) ఒక్కడే రేసులో ఉన్నాడు. అయితే మాస్టర్ రికార్డును బ్రేక్ చేయాలంటే మరో నాలుగైదేళ్లు అతడు నిలకడగా రాణించాల్సి ఉంటుంది. టాప్-10 రికార్డుల్లో తర్వాత చెప్పుకోవాల్సింది లంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లు. టెస్టు క్రికెట్​లో 500 వికెట్లే గొప్ప అనుకునే రోజుల్లో ఏకంగా ఎనిమిది వందల క్లబ్​లో చేరి అందర్నీ ఆశ్చర్యపరిచాడు మురళీధరన్.

కరెంట్ జనరేషన్ క్రికెటర్లలో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (690) ఒక్కడికే మురళీధరన్ రికార్డును అధిగమించే ఛాన్స్ ఉంది. అయితే 41 ఏళ్ల ఈ పేసర్ ఇంకా ఎక్కువ రోజులు క్రికెట్ ఆడే పరిస్థితులు కనిపించడం లేదు. టాప్-10 క్రికెట్ రికార్డుల్లో వెస్టిండీస్ బ్యాటింగ్ గ్రేట్ బ్రియాన్ లారా 400 నాటౌట్ కూడా ఒకటి. ఎందరో ప్లేయర్లు దీన్ని బీట్ చేయాలని అనుకున్నారు. కానీ ఎవరికీ సాధ్యపడలేదు. అయితే లారా మాత్రం టీమిండియా యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్​ మాత్రమే తన రికార్డును బ్రేక్ చేస్తాడని అంటున్నారు. ఇక, అరుదైన రికార్డుల్లో మరొకటిగా లంక మాజీ పేసర్ లసిత్ మలింగ 5 హ్యాట్రిక్స్​ను చెప్పొచ్చు. ఒక హ్యాట్రిక్ తీయడమే గగనం అనుకుంటే.. ఇంటర్నేషనల్ క్రికెట్​లో ఏకంగా 5 సార్లు హ్యాట్రిక్​లు తీశాడు మలింగ. టాప్-10 రికార్డుల్లో జిమ్ లేకర్ 19 వికెట్లు కూడా ఒకటి. ఓ టెస్ట్ మ్యాచ్​లో రెండు ఇన్నింగ్స్​ల్లోనూ కలిపి లేకర్ పందొమ్మిది వికెట్లు తీశాడు. దాన్ని అందుకోవడం ఇప్పటి తరం క్రికెటర్లకు అంత ఈజీ కాదు.

టెస్టుల్లో సచిన్ 51 సెంచరీల రికార్డు కూడా ఈ కోవలోకే వస్తుంది. కరెంట్ జనరేషన్ క్రికెటర్లలో ఒక్కరు కూడా దీనికి దగ్గర్లో లేరు. ఆసీస్ గ్రేట్ డాన్ బ్రాడ్​మన్ టెస్టుల్లో 99.94 యావరేజ్ కూడా బెస్ట్ రికార్డ్స్​లో ఒకటి. ఒకరకంగా చెప్పాలంటే ఈ తరం క్రికెటర్లలో పైరెండు రికార్డులను కొట్టే మగాడే లేడు. మాస్టర్ బ్లాస్టర్ మోస్ట్ ఇంటర్నేషనల్ రన్స్ (34,357)ను అధిగమించడం కూడా చాలా కష్టమనే చెప్పొచ్చు. ఈ లిస్టులో వచ్చే మరో రికార్డు జేసన్ గిలెస్పీ 201. నైట్​వాచ్​మన్​గా వచ్చి 50 రన్స్ కొడితే గొప్ప అనుకుంటే.. ఏకంగా డబుల్ సెంచరీ బాదాడు గిలెస్పీ. పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఫాస్టెస్ట్ బాల్ (161.3 కిలోమీటర్లు) రికార్డు కూడా ఇంకా చెక్కుచెదరలేదు. ఈ రికార్డులను బ్రేక్ చేయడం పక్కనబెడితే.. యంగ్ క్రికెటర్లలో ఇవి నింపుతున్న స్ఫూర్తి అంతా ఇంతా కాదు. వీటిని బ్రేక్ చేయాలని, లెజెండరీ క్రికెటర్స్ సరసన తామూ చోటు దక్కించుకోవాలని చాలా మంది కరెంట్ ప్లేయర్స్ మరింత కష్టపడుతున్నారు. మరి.. టాప్-10 క్రికెట్ రికార్డుల్లో చేర్చదగ్గ పెర్ఫార్మెన్స్ ఇంకేదైనా ఉందని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Shubman Gill: బాబర్‌ అజమ్‌ కాదు.. పాకిస్థాన్‌లోనూ భారత క్రికెటర్‌దే హవా!