iDreamPost
android-app
ios-app

సంచలనం.. 15 ఓవర్లలకే కివీస్ ను దంచికొట్టిన పసికూన!

  • Author Soma Sekhar Published - 11:24 AM, Sun - 20 August 23
  • Author Soma Sekhar Published - 11:24 AM, Sun - 20 August 23
సంచలనం.. 15 ఓవర్లలకే కివీస్ ను దంచికొట్టిన పసికూన!

వరల్డ్ క్రికెట్ లో అప్పుడప్పుడు సంచలనాలు నమోదు అవుతూ ఉంటాయి. అయితే అప్పటి సంచలనాలు వేరు.. తాజాగా నమోదైన సంచలనం వేరు. యూఏఈ వేదికగా నూజిల్యాండ్ వర్సెస్ యూఏఈ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ ను కివీస్ గెలుచుకోగా.. రెండో మ్యాచ్ లో పర్యటక జట్టును మట్టికరిపించింది ఆతిథ్య జట్టు. కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం 15 ఓవర్లలోనే దంచికొట్టింది. ఈ మ్యాచ్ 7 వికెట్లతో కివీస్ పై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

గత వరల్డ్ కప్ రన్నరప్ న్యూజిలాండ్ కు బిగ్ షాకిచ్చింది పసికూన యూఏఈ. దుబాయ్ వేదికగా జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో కివీస్ పై సంచలన విజయం సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ను యూఏఈ బౌలర్లు కట్టడి చేశాడు. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి పరుగులు రావడమే కష్టంగా మారింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేసింది. కివీస్ జట్టులో చాప్ మన్ (63) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాటర్లలో ఇద్దరంటే ఇద్దరే రెండంకెల స్కోర్ చేశారు. యూఏఈ బౌలర్లలో ఆయాన్ ఖాన్ అద్భుత బౌలింగ్ తో 4 ఓవర్లలో 20 పరుగుల మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.

అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 15.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. జట్టులో కెప్టెన్ మహ్మద్ వసీం కేవలం 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. మిగతా వారిలో ఆసిఫ్ ఖాన్ (48), అరవింద్ (25) పరుగులతో రాణించారు. వరల్డ్ క్లాస్ బౌలర్లగా పేరుగాంచిన కివీస్ పేసర్లను దంచికొట్టారు యూఏఈ బ్యాటర్లు. దీంతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచారు. ఇక కీలక మ్యాచ్ అయిన మూడో టీ20 దుబాయ్ వేదికగా ఆదివారం జరగనుంది. కాగా.. న్యూజిలాండ్ ను ఓడించిన తొలి అసోసియేట్ జట్టుగా యూఏఈ రికార్డు సృష్టించింది. అదీకాక దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో యూఏఈకి ఇదే తొలి విజయం కావడం విశేషం. పసికూనగా పేరుగాంచిన యూఏఈ ఈ మ్యాచ్ లో సంచలనం నమోదు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: కోహ్లీ రిటైర్ అవ్వాలన్న పాక్ దిగ్గజ బౌలర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన దాదా!