Nidhan
ఛాన్సులు ఇచ్చి పెంచి పోషించిన క్రికెట్ బోర్డును దారుణంగా మోసం చేశాడో పాక్ క్రికెటర్. దెబ్బకు అతడి మీద 5 ఏళ్ల నిషేధం విధించారు. ఎవరా క్రికెటర్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఛాన్సులు ఇచ్చి పెంచి పోషించిన క్రికెట్ బోర్డును దారుణంగా మోసం చేశాడో పాక్ క్రికెటర్. దెబ్బకు అతడి మీద 5 ఏళ్ల నిషేధం విధించారు. ఎవరా క్రికెటర్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
పరాయి దేశం వాడైనా అతడికి ఛాన్సులు ఇచ్చి ఎంకరేజ్ చేసింది. క్రికెటర్‌గా అతడ్ని పెంచి పోషించి మంచి స్టేజ్‌కు తీసుకొచ్చింది. ఆ దేశంతో పాటు ఇతర దేశాల లీగ్స్‌లో ఆడేందుకు కూడా అనుమతి ఇచ్చింది. కానీ రెండు చేతులా సంపాదిస్తున్న ఆ క్రికెటర్ తనను ఈ రేంజ్‌కు తీసుకొచ్చిన క్రికెట్ బోర్డును బురిడీ కొట్టించాడు. మంచి ఆఫర్ రాగానే పుట్టిన దేశానికి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాడు. ఆ క్రికెటర్ పాకిస్థానీ కావడం గమనార్హం. క్రికెట్ బోర్డును దారుణంగా మోసం చేశాడో పాక్ క్రికెటర్. దెబ్బకు అతడి మీద 5 ఏళ్ల నిషేధం విధించింది యూఏఈ బోర్డు. ఆ క్రికెటర్ పేరేంటి? అతడు ఎందుకిలా చేశాడు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
పాకిస్థాన్ బార్న్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాన్ మీద ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. పుట్టిన దేశమైన పాకిస్థాన్ తరఫున ఆడేందుకు అతడు ఆసక్తి చూపించడమే దీనికి కారణం. అంతకుముందు వరకు యూఏఈ తరఫున ఆడుతూ గుర్తింపు తెచ్చుకున్నాడు 28 ఏళ్ల ఉస్మాన్. ఇక మీదట కూడా అదే దేశానికి ఆడతానంటూ వాగ్దానం చేశాడు. కానీ పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఆఫర్ రాగానే అటు వైపునకు వాలిపోయాడు. రీసెంట్గా జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్-2024లో ఓవర్సీస్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఉస్మాన్.. సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు. దీంతో పుట్టిన దేశం తరఫున ఆడేందుకు అవకాశం ఇస్తామంటూ పీసీబీ సెలక్టర్లు ఆఫర్ చేశారు. అంతే మంచి ఛాన్స్ రావడంతో ఉస్మాన్ అంగీకరిచాడు.
పాకిస్థాన్ టీమ్‌తో జాయిన్ అయ్యాడు ఉస్మాన్. ప్రస్తుతం ఆ దేశ మిలటరీ క్యాంప్‌లో ఇతర ఆటగాళ్లతో కలసి ట్రెయినింగ్ తీసుకుంటున్నాడు. అయితే తమ దేశం తరఫున ఆడతానని మాట ఇచ్చి పాక్‌కు వెళ్లిపోవడంతో అతడి మీద యూఏఈ క్రికెట్ బోర్డు సీరియస్ అయింది. 2029 వరకు ఈసీబీ నిర్వహించే ఏ ఇతర కార్యక్రమంలోనూ అతడు పాల్గొనకుండా బ్యాన్ వేశారు. యూఏఈలో జరిగే ఐఎల్ టీ20, అబుదాబి టీ10తో పాటు ఆ దేశ బోర్డు అనుబంధ పోటీల్లో ఎక్కడా ఉస్మాన్ ఆడటానికి లేదు. తన ఉద్దేశాలను ఉస్మాన్ తప్పుగా చూపించాడని ఈసీబీ ఆరోపిచింది. యూఏఈకి ఆడాలనే తన డెసిషన్ గురించి బోర్డుకు ఉస్మాన్ తప్పుడు సమాచారం ఇచ్చాడని సీరియస్ అయింది. తాము ఇచ్చిన ఛాన్సులను ఉపయోగించుకొని బాధ్యతల్ని ఉల్లంఘించాడని ఈసీబీ పేర్కొంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి అతడి బ్యాన్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఆ బ్యాటర్‌కు బౌలింగ్ చేయాలంటే భయమేస్తోంది.. కమిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
🚨NEWS 🚨
Usman Khan has been banned from participating in ECB events for five years.
He has been found guilty to have breached his obligations owed to the Emirates Cricket Board.#UsmanKhan pic.twitter.com/h5BOOtTwkk
— Sportskeeda (@Sportskeeda) April 6, 2024