Nidhan
భారత జట్టుకు మళ్లీ నిరాశే మిగిలింది. ఇంకో వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుందామనుకున్న టీమిండియాను ఆస్ట్రేలియా అడ్డుకుంది.
భారత జట్టుకు మళ్లీ నిరాశే మిగిలింది. ఇంకో వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుందామనుకున్న టీమిండియాను ఆస్ట్రేలియా అడ్డుకుంది.
Nidhan
ఓటమి అనేదే లేకుండా ఫైనల్ వరకు దూసుకొచ్చిన టీమ్. ఇంకా ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు.. వరల్డ్ కప్ మనదే. వరుసగా రెండోమారు ప్రపంచ కప్ నెగ్గి రికార్డు సృష్టిద్దామని అనుకున్నారు. కానీ కల చెదిరింది.. కప్పు చేజారింది. వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ ఓటమిని గుర్తుచేశారు భారత కుర్రాళ్లు. అండర్-19 ప్రపంచ కప్-2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ ఫైట్‌లో ఓడి కప్పును చేజార్చుకున్నారు. ఈజీగా నెగ్గాల్సిన మ్యాచ్‌ను అనవసర తప్పిదాలతో ఆసీస్‌కు సమర్పించుకున్నారు. సీనియర్ వరల్డ్ కప్ తుదిపోరులో ఓటమి ఇంకా బాధిస్తుండగానే.. జూనియ్ ప్రపంచ కప్‌లోనూ ఓటమే పలకరించింది. అపోజిషన్ టీమ్‌లో నలుగురు డేంజరస్ పేసర్లు.. కానీ స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న యంగ్ ఇండియా అద్భుతం చేస్తుందని అందరూ ఆశించారు. కానీ నిరాశే మిగిలింది.
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా 79 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓడింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్ (55) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ హ్యూ వీబ్జెన్ (48), ఒలీవర్ పీక్ (46 నాటౌట్), హ్యారీ డిక్సన్ (42) కూడా రాణించడంతో ఆసీస్ మంచి టార్గెట్‌ను భారత్ ముందు ఉంచింది. మన బౌలర్లలో రాజ్ లింబానీకి 3 వికెట్లు, నమన్ తివారీకి 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన టీమిండియా కంగారూ పేసర్ల ముందు నిలబడలేకపోయింది. 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఆదర్శ్ సింగ్ (47), హైదరాబాద్ కుర్రాడు మురుగన్ అభిషేక్ (42) మినహా మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తేశారు. కంగారూ బౌలర్లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న బియర్డ్‌మన్ 3 వికెట్లు తీశాడు. మిగతావాళ్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు.
ఛేజింగ్‌కు దిగిన భారత్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. భారీ భాగస్వామ్యాలు నమోదైతే బాగుండేది. కానీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం, క్రీజులో బ్యాటర్లను సెటిల్ అవడానికి ఆసీస్ ఛాన్స్ ఇవ్వకపోవడంతో మన ఇన్నింగ్స్ ముందుకు వెళ్లలేదు. పేసర్లు బియర్డ్‌మన్, విడ్లర్తో పాటు స్పిన్నర్ మెక్‌మిలన్ కూడా విజృంభించడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. టోర్నీలో సూపర్బ్‌గా ఆడుతూ వచ్చిన కెప్టెన్ ఉదయ్ (8), ముషీర్ ఖాన్ (22), సచిన్ దాస్ (9)లో ఒక్కరు కూడా ఛేజింగ్‌లో నిలబడలేకపోయారు. ముఖ్యంగా సారథి ఉదయ్ ఔట్ అవడం భారత్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. బ్యాటింగ్‌లో ఫెయిలైన భారత్.. అంతకుముందు ఆసీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసే ఛాన్స్‌నూ మిస్సయింది. 187/6తో ఉన్న కంగారూలు ఆఖర్లో ఒలీవర్ పోరాడటంతో స్కోరు 250 దాటింది. ఆ టైమ్‌లో గనుక మనోళ్లు పట్టు విడవకపోతే ఈజీ టార్గెట్ ముందుండేది. మరి.. భారత కుర్రాళ్లు ఫైనల్లో ఓటమి పాలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Team India: ఆ టీమిండియా స్టార్ లేకపోతే టెస్టు క్రికెట్ లేదు.. అతడి వల్లే ఆడియెన్స్..!
AUSTRALIA DEFEATED INDIA IN THE FINAL OF U19 WORLD CUP…!!!! 💔 pic.twitter.com/0qBsjVKAc3
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 11, 2024