iDreamPost

Team India: ఆ టీమిండియా స్టార్ లేకపోతే టెస్టు క్రికెట్​ లేదు.. అతడి వల్లే ఆడియెన్స్..!

  • Published Feb 11, 2024 | 6:12 PMUpdated Feb 11, 2024 | 6:12 PM

భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియాలోని ఆ స్టార్ లేకపోతే టెస్టు క్రికెట్​కు మనుగడ లేదన్నాడు. అతడి వల్లే ఆడియెన్స్, ఫ్యాన్స్​లో టెస్టులపై ఇంట్రెస్ట్ పెరిగిందన్నాడు.

భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియాలోని ఆ స్టార్ లేకపోతే టెస్టు క్రికెట్​కు మనుగడ లేదన్నాడు. అతడి వల్లే ఆడియెన్స్, ఫ్యాన్స్​లో టెస్టులపై ఇంట్రెస్ట్ పెరిగిందన్నాడు.

  • Published Feb 11, 2024 | 6:12 PMUpdated Feb 11, 2024 | 6:12 PM
Team India: ఆ టీమిండియా స్టార్ లేకపోతే టెస్టు క్రికెట్​ లేదు.. అతడి వల్లే ఆడియెన్స్..!

క్రికెట్​లో సంప్రదాయ ఫార్మాట్ అయిన టెస్టులకు ఉండే ప్రాముఖ్యత వేరు అనే చెప్పాలి. ఒక బ్యాటర్, బౌలర్ గొప్పతనం గురించి చెప్పాలంటే అతడి టెస్టు రికార్డుల గురించే మాట్లాడుకోవాలి. లాంగ్ ఫార్మాట్​లో చేసిన పెర్ఫార్మెన్స్​ను బట్టే అతడ్ని ప్రేక్షకులు, అభిమానులు గుర్తుపెట్టుకుంటారు. అందుకే ఇంటర్నేషనల్ క్రికెట్​లోకి అడుగుపెట్టిన ప్రతి క్రికెటర్ ఒక్కసారైనా టెస్టు జెర్సీని వేసుకోవాలని కోరుకుంటాడు. టెస్టుల్లో చేసిన పరుగులు, తీసిన వికెట్లు, సాధించిన విజయాలు ఎప్పటికీ నిలిచిపోతాయని భావిస్తారు. అందుకే బడా బడా ప్లేయర్లు కూడా ఈ ఫార్మాట్​కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే టీ20ల రాకతో టెస్టులు పూర్వ వైభవం కోల్పోయాయి. ఈ మ్యాచులు చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఉన్నట్లుండి టెస్టులకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ టెస్టులు ఆడటం చాలా కీలకమన్నాడు హర్భజన్ సింగ్. లాంగ్ ఫార్మాట్ మనుగడను కాపాడాలంటే కోహ్లీని రెగ్యులర్​గా ఆడించాల్సిందేనని స్పష్టం చేశాడు. కోహ్లీ లేకపోతే అసలు టెస్టులే లేవన్నాడు. పర్సనల్ రీజన్స్ వల్ల జట్టుకు దూరమైన కింగ్ త్వరలో రీఎంట్రీ ఇవ్వాలని తాను కోరుకుంటున్నానని భజ్జీ తెలిపాడు. ‘టెస్టు క్రికెట్​కు విరాట్ కోహ్లీ సిసలైన బ్రాండ్ అంబాసిడర్. టెస్టులను అతడు కొత్త ఎత్తులకు చేర్చాడు. కోహ్లీ లేని టెస్టు క్రికెట్​ను ఊహించడం కూడా కష్టమే. అతడు లేని లాంగ్ ఫార్మాట్ అసంపూర్ణంగా కనిపిస్తోంది. అతి త్వరలో మళ్లీ అతడు క్రికెట్ గ్రౌండ్​లోకి అడుగు పెడతాడని ఆశిస్తున్నా’ అని హర్భజన్ చెప్పుకొచ్చాడు. కింగ్ కోహ్లీపై భజ్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హర్భజన్ కామెంట్స్​పై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. అతడు చెప్పింది అక్షరాలా సత్యమని అంటున్నారు. కోహ్లీ లేని టెస్టు క్రికెట్ నిజంగానే అసంపూర్తిగా కనిపిస్తోందని చెబుతున్నారు. విరాట్ టీమ్​లో ఉంటే బ్యాటింగ్​లో, ఫీల్డింగ్​లో ఫుల్ జోష్ వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఫీల్డింగ్ సమయంలో అతడు చూపించే అగ్రెషన్.. బ్యాటింగ్ సమయంలో ప్రత్యర్థులను బ్యాటుతో, మాటలతో అతడు ఎదుర్కొనే తీరు సూపర్బ్ అని మెచ్చుకుంటున్నారు. కింగ్ త్వరగా కమ్​బ్యాక్ ఇవ్వాలని.. అతడు లేని ఆటను ఊహించుకోవడం చాలా కష్టంగా ఉందని నెటిజన్స్ చెబుతున్నారు. ఇక, ఇంగ్లండ్​తో తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ.. పర్సనల్ రీజన్స్ వల్ల సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మరి.. కోహ్లీ లేకపోతే టెస్టు క్రికెట్ లేదంటూ భజ్జీ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: కోహ్లీ ఆడకపోతే భారత్​కు పోయేదేమీ లేదు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి