ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు అండర్-19 టీమ్స్ నుంచి వచ్చారు. తమ టాలెంట్‌ను నిరూపించుకొని ఏకంగా నేషనల్ టీమ్స్‌కు కూడా ఆడారు. తాజాగా మరో అండర్-19 ప్లేయర్ తన సత్తా చాటాడు.
ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు అండర్-19 టీమ్స్ నుంచి వచ్చారు. తమ టాలెంట్‌ను నిరూపించుకొని ఏకంగా నేషనల్ టీమ్స్‌కు కూడా ఆడారు. తాజాగా మరో అండర్-19 ప్లేయర్ తన సత్తా చాటాడు.
నేషనల్ టీమ్స్‌కు ప్లేయర్లను అందించడంలో ఈ మధ్య లీగ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. టీ20ల్లో దుమ్మురేపిన యంగ్‌స్టర్స్‌ను పిలిచి మరీ జాతీయ జట్టులోకి తీసుకుంటున్నారు. ఆ దేశం, ఈ దేశం అని కాదు.. చాలా దేశాల క్రికెట్ బోర్డులు ఈ పద్ధతిని ఫాలో అవుతున్నాయి. అలాగని పూర్తిగా లీగ్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయని కాదు. డొమెస్టిక్ లెవల్లో రాణిస్తున్న వారిని టెస్టులు, వన్డే ఫార్మాట్లకు సెలక్ట్ చేస్తున్నాయి. లీగ్స్‌లో ఆడిన వారిని ఎక్కువగా టీ20లకు తీసుకుంటున్నాయి. అయితే ఇప్పటికి కూడా దేశవాళీ క్రికెట్‌కు ఉన్న ఇంపార్టెన్స్ తగ్గడం లేదు. అండర్-15, అండర్-19 నుంచి వస్తున్న యంగ్‌స్టర్స్ ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్ ఆడి సత్తా చాటితే నేషనల్ టీమ్స్‌కు ఎంపిక అవుతున్నారు. ముఖ్యంగా అండర్-19లో ఆడిన చాలా మంది క్రికెటర్లు ఇంటర్నేషనల్ స్టార్లుగా ఎదగడం చూస్తూనే ఉన్నాం.
విరాట్ కోహ్లీ నుంచి కేన్ విలియమ్సన్ దాకా చాలా మంది ప్లేయర్లు అండర్-19 ద్వారా వెలుగులోకి వచ్చిన వారే. అండర్-19 వరల్డ్ కప్‌లో సత్తా చాటిన కోహ్లీ, కేన్ మామ తమ దేశాల జట్లకు సెలక్ట్ అయ్యారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని టీమ్స్‌లో సెటిలయ్యారు. ఆ తర్వాత తమ టాలెంట్‌ను మరింత మెరుగుపర్చుకొని స్టార్లుగా మారారు. ప్రస్తుత క్రికెట్లో వాళ్లిద్దరూ సూపర్స్టార్లు అనేది తెలిసిందే. టీమిండియా యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కూడా అండర్-19 వరల్డ్ కప్ ద్వారా వెలుగులోకి వచ్చిన ప్లేయరే. అందుకే భారత సెలక్టర్లు, క్రికెట్ బోర్డు కూడా కుర్రాళ్లపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. అక్కడ రాణించిన వారికి మరిన్ని అవకాశాలు ఇచ్చి సానబెడుతున్నారు. ఇక, ఒక యంగ్ బౌలర్ బంతితో మ్యాజిక్ చేయడంతో ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో టీమిండియా సెమీస్‌కు చేరుకుంది.
నేపాల్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్ సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ను భారత పేసర్ రాజ్ లింబానీ చావుదెబ్బ తీశాడు. అతడి అద్భుత బౌలింగ్‌కు ప్రత్యర్థి బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మొత్తంగా 9.3 ఓవర్లు వేసిన లింబానీ.. 13 రన్స్ ఇచ్చి 7 వికెట్లు తీశాడు. అందులో మూడు మెయిడిన్లు ఉండటం విశేషం. అతడు ఇచ్చిన 13 పరుగుల్లో 2 వైడ్స్ రూపంలో వచ్చినవే కావడం గమనార్హం. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా 7.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విక్టరీతో భారత్ సెమీఫైనల్ బెర్త్ దాదాపుగా ఖాయమైంది. ఫస్ట్ మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్‌ను ఓడించిన యంగ్ ఇండియా.. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో పరాజయం పాలైంది. అయితే దాని నుంచి కోలుకొని మూడో మ్యాచ్‌లో నేపాల్‌ను మట్టికరిపించింది. మరి.. యువ బౌలర్ లింబానీ పెర్ఫార్మెన్స్పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Team India: సూర్య, అయ్యర్ కాదు.. టీమిండియాలో అతడే డేంజర్ అంటున్న కలిస్!
WHAT A INCREDIBLE SPELL BY RAJ LIMBANI…!!!!
– 0,0,0,0,0,0.
– 0,0,WD,0,0,1,0.
– W,0,0,0,0,0.
– 0,W,0,0,1,0.
– 0,0,0,0,W,W.
– 0,WD,0,0,0,0,4.
– 0,0,0,1,W,1.
– 0,0,1,W,0,0.
– 0,0,0,0,0,2.
– W.His bowling figure (9.1-3-13-7) against Nepal in U-19 Asia Cup – Phenomenal by Raj. pic.twitter.com/pJ2QNZVbjC
— CricketMAN2 (@ImTanujSingh) December 12, 2023