iDreamPost

Team India: సూర్య, అయ్యర్ కాదు.. టీమిండియాలో అతడే డేంజర్ అంటున్న కలిస్!

  • Author singhj Published - 05:48 PM, Tue - 12 December 23

ప్రస్తుత టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. జట్టు మొత్తం స్టార్లతో నిండి ఉంది. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే భారీ షాట్లు ఆడే బ్యాటర్లకు ఏమాత్రం కొదవ లేదు. అయితే భారత జట్టులో మాత్రం ఒక ప్లేయర్ మాత్రం చాలా డేంజరస్ అని సౌతాఫ్రికా లెజెండ్ జాక్వస్ కలిస్ అన్నాడు.

ప్రస్తుత టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. జట్టు మొత్తం స్టార్లతో నిండి ఉంది. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే భారీ షాట్లు ఆడే బ్యాటర్లకు ఏమాత్రం కొదవ లేదు. అయితే భారత జట్టులో మాత్రం ఒక ప్లేయర్ మాత్రం చాలా డేంజరస్ అని సౌతాఫ్రికా లెజెండ్ జాక్వస్ కలిస్ అన్నాడు.

  • Author singhj Published - 05:48 PM, Tue - 12 December 23
Team India: సూర్య, అయ్యర్ కాదు.. టీమిండియాలో అతడే డేంజర్ అంటున్న కలిస్!

టీ20 వరల్డ్ కప్​కు ఇంకా చాలా టైమ్ ఉంది. వచ్చే ఏడాది జూన్​లో పొట్టి ఫార్మాట్​లో ప్రపంచ కప్ కోసం టీమ్స్ అన్నీ పోటీపడనున్నాయి. అయితే ఈలోపు తమ టీమ్ కాంబినేషన్​ను సెట్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఏ పొజిషన్​లో ఎవర్ని ఆడిస్తే బాగుంటుంది? ఏయే స్థానాలకు ఎవరు సెట్ అవుతారు? అనేది చెక్ చేసుకుంటున్నాయి. టీమిండియా కూడా ఇదే పనిలో బిజీగా ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్​తో చాలా మంది యంగ్​స్టర్స్ తమ సత్తా ఏంటో మరోమారు ప్రూవ్ చేసుకున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్​ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్లు లేకుండా ఆసీస్​తో సిరీస్​లో బరిలోకి దిగిన యంగ్ ఇండియా.. 4-1 తేడాతో సిరీస్​ను కైవసం చేసుకుంది.

కంగారూలతో టీ20 సిరీస్​లో సీనియర్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ సహా యంగ్​స్టర్స్ రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, రింకూ సింగ్, ముకేష్ కుమార్, రవి బిష్ణోయ్ లాంటి యువకులు అద్భుతంగా రాణించారు. సౌతాఫ్రికా సిరీస్​లోనూ బాగా పెర్ఫార్మ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ప్రొటీస్​తో జరగాల్సిన తొలి టీ20 రద్దయింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ జరగకపోవడంతో రెండో టీ20 మీద అందరి ఫోకస్ షిఫ్ట్ అయింది. కానీ ఆ మ్యాచ్​కూ వాన గండం ఉంది. వరుణుడు కరుణిస్తేనే ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్​ సాధ్యమైతే అందులో ఏ టీమ్ కాంబినేషన్​ను భారత టీమ్ మేనేజ్​మెంట్ సెలక్ట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్​కు 17 మందితో కూడిన టీమ్​ను సెలక్ట్ ఎంపిక చేశారు. దీంతో టీమ్ మేనేజ్​మెంట్ ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయి.

ఆసీస్​తో సిరీస్​లో సత్తా చాటిన కొత్త కుర్రాడు జితేష్ శర్మకు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. కంగారూలతో సిరీస్​లో మెరుపు సెంచరీతో సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్​కూ ప్లేస్ అనుమానంగానే ఉంది. స్టార్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ రీఎంట్రీ నేపథ్యంలో రుతురాజ్​ను పక్కనబెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది. యశస్వి జైస్వాల్​తో కలసి శుబ్​మన్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నంబర్ 6లో వచ్చి దుమ్మురేపుతున్న రింకూ సింగ్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. టీమిండియాకు మరో ఫినిషర్ దొరికాడని పొగుడుతున్నారు. దీనిపై సౌతాఫ్రికా లెజెండ్ జాక్వస్ కలిస్ స్పందించాడు. రింకూ ఓ క్లాసిక్ ప్లేయర్ అని.. చాలా ప్రమాదకర ఆటగాడని అన్నాడు. ‘రింకూను చాన్నాళ్లుగా చూస్తున్నా. అతడు ఆఖర్లో వచ్చి మ్యాచులు ఫినిష్ చేస్తూ టీమిండియాను గెలిపిస్తున్నాడు. ఇదంత ఈజీ కాదు. అవసరమైనప్పుడు మంచి క్రికెటింగ్ షాట్స్ ఆడుతున్నాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో అటాక్ చేస్తూ భారీ షాట్లు బాదుతున్నాడు. నంబర్ 6లో ఆడటానికి అతడు పర్ఫెక్ట్ బ్యాటర్. టీ20 వరల్డ్ కప్​లోనూ అతడ్ని అదే పొజిషన్​లో ఆడించాలి’ అని కలిస్ చెప్పుకొచ్చాడు. మరి.. రింకూపై కలిస్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rohit Sharma: అలా చేస్తే హిట్ మ్యాన్ హిస్టరీలో చిరస్థాయిగా నిలిచిపోతాడు: భారత క్రికెటర్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి