SNP
ట్రావిస్ హెడ్.. టీమిండియాకు వరల్డ్ కప్ దూరం చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు. ఫైనల్లో అతను ఆడిన ఇన్నింగ్స్ ఇండియన్ క్రికెట్ అభిమానులను బాధించినా.. ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లకు మాత్రం తానో డిమాండ్ ఉన్న ఆటగాడిని అనే విషయాన్ని చెప్పాడు. అయితే.. ట్రావిస్ హెడ్ సన్‌రైజర్స్‌కు..
ట్రావిస్ హెడ్.. టీమిండియాకు వరల్డ్ కప్ దూరం చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు. ఫైనల్లో అతను ఆడిన ఇన్నింగ్స్ ఇండియన్ క్రికెట్ అభిమానులను బాధించినా.. ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లకు మాత్రం తానో డిమాండ్ ఉన్న ఆటగాడిని అనే విషయాన్ని చెప్పాడు. అయితే.. ట్రావిస్ హెడ్ సన్‌రైజర్స్‌కు..
SNP
ఐపీఎల్ 2024 సీజన్‌కు ఇంకా చాలా సమయంలో ఉన్నా.. ఆటగాళ్లు జట్లు మారుతుండటంతో ఒక్కసారిగా ఐపీఎల్ గురించి చర్చనడుస్తోంది. ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో.. ఐపీఎల్ టీమ్స్, ఆటగాళ్ల గురించే టాపిక్. ఆటగాళ్ల రిలీజ్, రిటేన్, క్యాష్ ట్రేడింగ్‌తో పాటు ఇంటర్నల్ ట్రేడింగ్‌తో ఐపీఎల్ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌కు రెండేళ్ల పాటు కెప్టెన్‌గా చేసి, 2022లో తొలి సీజన్‌లోనే ఆ జట్టుకు టైటిల్ అందించిన కెప్టెన్ హార్థిక్ పాండ్యా, గుజరాత్‌ను వదిలేసి.. తన పాత ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు మారిపోవడం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. పాండ్యా ఇంత అనూహ్య నిర్ణయం తీసుకున్నాడని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. పాండ్యా విషయం పక్కనపెడితే.. ఐపీఎల్ 2024 కోసం నిర్వహించే మినీ వేలంలో కొంతమంది ఆటగాళ్లపై కనకవర్షం కురవనుంది.
అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ గురించి. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో ఈ ఆటగాడు ఎలాంటి విధ్వంస సృష్టించాడో మనం చూశాడు. టీమిండియాకు ఒక్క మ్యాచ్‌తో వరల్డ్ కప్ దూరమవ్వడానికి కారణం ఈ ట్రావిస్ ఒక్కడే. మనకు వరల్డ్ కప్ మిస్ అయినా బాధ ఉన్నా.. ఒక ఆటగాడిగా ట్రావిస్ హెడ్ ఆడిన ఇన్నింగ్స్‌ను మెచ్చుకోక తప్పదు. ఎంతో అద్భుతంగా ఆడి.. ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అందించాడు. ఈ ఆటగాడిపై ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు కన్నేశాయి. ఎలాగైనా ఐపీఎల్ 2024 మినీ వేలంలో దక్కించుకుని టీమ్‌ను స్ట్రాంగ్ చేసుకోవాలని భావిస్తున్నాయి.
Travis Head to Sunrisers Hyderabadpic.twitter.com/i9OYk8uFxe https://t.co/eN5Tv1c1mi
— SIR Weevan✨ (@JeevanSRH) November 25, 2023
అన్ని టీమ్స్ కంటే ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ట్రావిస్ హెడ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే హెడ్‌తో ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ట్రావిస్ హెడ్‌ను తీసుకోవడంతో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనింగ్‌కు మంచి ప్లేయర్ దొరికినట్లు అవుతుంది. పైగా ఐపీఎల్ 2022 వేలంలో భారీ ధర పెట్టి కొన్న హ్యారీ బ్రూక్‌ను ఎస్‌ఆర్‌హెచ్ వదిలేసిన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్‌ను తీసుకోవడం కోసమే.. సన్‌రైజర్స్ ఓనర్ బ్రూక్‌ను రిలీజ్ చేసినట్లు సమాచారం. మరి కావ్య మాస్టర్ ప్లాన్‌తో ట్రావిస్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌లోకి తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.