iDreamPost
android-app
ios-app

Travis Head: స్కాట్లాండ్​పై ట్రావిస్ హెడ్ విధ్వంసం! ఇది ఊచకోత కాదు.. అంతకుమించి!

  • Published Sep 04, 2024 | 10:17 PM Updated Updated Sep 04, 2024 | 11:12 PM

Travis Head, AUS vs SCO: బిగ్ టీమ్స్ మీదే చిచ్చరపిడుగులా చెలరేగుతాడు ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్. ఇంక స్కాట్లాండ్ లాంటి పసికూన దొరికితే ఊరుకుంటాడా? వాయించకుండా వదలడు. అదే జరిగింది. ఆ టీమ్​ను అతడు ఊచకోత కోశాడు.

Travis Head, AUS vs SCO: బిగ్ టీమ్స్ మీదే చిచ్చరపిడుగులా చెలరేగుతాడు ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్. ఇంక స్కాట్లాండ్ లాంటి పసికూన దొరికితే ఊరుకుంటాడా? వాయించకుండా వదలడు. అదే జరిగింది. ఆ టీమ్​ను అతడు ఊచకోత కోశాడు.

  • Published Sep 04, 2024 | 10:17 PMUpdated Sep 04, 2024 | 11:12 PM
Travis Head: స్కాట్లాండ్​పై ట్రావిస్ హెడ్ విధ్వంసం! ఇది ఊచకోత కాదు.. అంతకుమించి!

బిగ్ టీమ్స్ మీద వార్ డిక్లేర్ చేస్తుంటాడు ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్. అవతల ఉన్నది ఎంత పెద్ద టీమ్ అయినా అతడు పట్టించుకోడు. చిచ్చరపిడుగులా చెలరేగి విధ్వంసం సృష్టిస్తాడు. ఒంటిచేత్తో చూస్తుండగానే మ్యాచ్​ను లాక్కొని వెళ్లిపోతాడు. అతడు క్రీజులో సెటిలైతే టాప్ బౌలర్లు కూడా చేష్టలుడిగి చూస్తూ ఉండాల్సిందే. అతడు కురిపించే బౌండరీలు, సిక్సుల వర్షంలో తడవడం తప్ప చేసేదేమీ ఉండదు. పెద్ద జట్ల మీదే ఈ రేంజ్​లో చెలరేగే హెడ్.. స్కాట్లాండ్ లాంటి పసికూన జట్టు దొరికితే ఊరుకుంటాడా? వాయించకుండా వదలడు. అదే జరిగింది. ఆ టీమ్​ను అతడు ఊచకోత కోశాడు. 25 బంతుల్లోనే 80 పరుగుల సంచలన ఇన్నింగ్స్​తో చెలరేగాడు.

స్కాట్లాండ్​తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు సంధించిన 156 పరుగుల టార్గెట్​ను 9.4 ఓవర్లలోనే ఛేజ్ చేసేసింది. హెడ్ విధ్వంసం ముందు మంచి టోటల్ కూడా చిన్నబోయింది. తొలి ఓవర్ నుంచే బాదుడు మొదలుపెట్టిన హెడ్.. బౌలర్ ఎవరనేది చూడకుండా నిర్దాక్షిణ్యంగా శిక్షించాడు. 12 బౌండరీలు కొట్టిన ఈ కంగారూ రాక్షసుడు.. 5 భారీ సిక్సులు బాదాడు. ఈ క్రమంలో ఆసీస్ తరఫున హెడ్ (17 బంతుల్లో) జాయింట్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించాడు. అతడితో పాటు మిచెల్ మార్ష్​ (12 బంతుల్లో 39) కూడా పంజా విప్పడంతో స్కాట్లాండ్ బౌలర్లు గుడ్లు తేలేశారు. ఆ తర్వాత వీళ్లు ఔటైనా జోష్ ఇంగ్లిస్ (13 బంతుల్లో 27 నాటౌట్) మిగిలిన పనిని ఫినిష్​ చేశాడు. మరి.. హెడ్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.