iDreamPost
android-app
ios-app

Virat Kohli: విరాట్ కోహ్లీ ఏడాదికి కట్టే ట్యాక్స్ ఎంతో తెలుసా? నంబర్ తెలిస్తే మైండ్​బ్లాంక్!

  • Published Sep 04, 2024 | 10:15 PM Updated Updated Sep 04, 2024 | 10:58 PM

Virat Kohli, MS Dhoni: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంపాదనలో దూసుకెళ్తున్నాడు. భారత జట్టుకు ఆడటంతో పాటు ఐపీఎల్​లో ఆడటం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకుంటున్నాడు. యాడ్స్ రూపంలోనూ భారీ మొత్తాన్ని వెనకేసుకుంటున్నాడు.

Virat Kohli, MS Dhoni: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంపాదనలో దూసుకెళ్తున్నాడు. భారత జట్టుకు ఆడటంతో పాటు ఐపీఎల్​లో ఆడటం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకుంటున్నాడు. యాడ్స్ రూపంలోనూ భారీ మొత్తాన్ని వెనకేసుకుంటున్నాడు.

  • Published Sep 04, 2024 | 10:15 PMUpdated Sep 04, 2024 | 10:58 PM
Virat Kohli: విరాట్ కోహ్లీ ఏడాదికి కట్టే ట్యాక్స్ ఎంతో తెలుసా? నంబర్ తెలిస్తే మైండ్​బ్లాంక్!

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంపాదనలో దూసుకెళ్తున్నాడు. ఏటికేడు ఆర్జనలో పరుగులు పెడుతున్నాడు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో ఆడటం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకుంటున్నాడు కింగ్. ఇంక అడ్వర్టయిజ్​మెంట్స్ ద్వారా వచ్చే డబ్బులు దీనికి అదనం. రెస్టారెంట్స్, క్లోతింగ్ స్టోర్స్ బిజినెస్ కూడా రన్ చేస్తున్న కోహ్లీ వాటి ద్వారా కూడా భారీగా ధనాన్ని వెనకేసుకుంటున్నాడు. ఇలా ఎన్నో మార్గాల ద్వారా సంపాదనలో దూసుకెళ్తున్న కోహ్లీ ఏడాదికి ఎంత ట్యాక్స్ కడతాడో చాలా మందికి తెలియదు. అయితే తాజాగా దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఏడాది కోహ్లీ ఎంత పన్ను చెల్లించాడో తెలిస్తే మైండ్​బ్లాంక్ అవడం ఖాయం.

దేశంలో అత్యధిక పన్ను చెల్లించే క్రీడాకారుడిగా కోహ్లీ నిలిచాడు. ఇండియా ఫార్చూన్ నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ భారత స్టార్ ఏకంగా రూ.66 కోట్లు ట్యాక్స్ చెల్లించాడు. ట్యాక్స్ పేయర్స్ స్పోర్ట్స్​పర్సన్ లిస్ట్​లో టాప్​లో ఉన్న విరాట్.. సెలెబ్రిటీస్ జాబితాలో ఓవరాల్​గా 5వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్​లో బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ ఫస్ట్ ప్లేస్​లో ఉన్నాడు. అతడు ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.92 కోట్ల ట్యాక్స్ చెల్లించాడు. అత్యధిక పన్ను చెల్లించిన క్రీడాకారుల జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానంలో లెజెండ్ మహేంద్ర సింగ్‌ ఉన్నాడు. అతడు రూ.38 కోట్ల ట్యాక్స్ కట్టాడు. బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ రూ.28 కోట్లు, దాదా సౌరవ్ గంగూలీ రూ.23 కోట్లు పన్ను రూపంలో చెల్లించారు. వీళ్ల తర్వాతి స్థానాల్లో స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉన్నారు.

పాండ్యా రూ.13 కోట్ల ట్యాక్స్ కట్టగా.. పంత్ రూ.10 కోట్లు పన్ను రూపంలో చెల్లించాడు. ఇక, అత్యధిక పన్ను చెల్లించే సెలెబ్రిటీల జాబితాను చూసుకుంటే షారుక్ తర్వాతి ప్లేస్​లో దళపతి విజయ్ (80 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.75 కోట్లు) నిలిచారు. వీళ్ల తర్వాతి స్థానాల్లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (రూ.71 కోట్లు), విరాట్ కోహ్లీ (రూ.66 కోట్లు), అజయ్ దేవగణ్ (రూ.42 కోట్లు), ఎంఎస్ ధోని (రూ.38 కోట్లు), రణ్​బీర్ కపూర్ (రూ.36 కోట్లు) ఉన్నారు. ఇక, కోహ్లీ కడుతున్న ట్యాక్స్ గురించి తెలిసి సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇది మామూలు నంబర్ కాదని.. సంపాదనలో అతడు ఏ రేంజ్​లో ఉన్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలని అంటున్నారు. కెరీర్ పీక్​లో ఉన్న కింగ్ ఇదే రీతిలో ఉంటే వచ్చే ఏడాది హయ్యెస్ట్ ట్యాక్స్ పెయిడ్ సెలెబ్రిటీస్ లిస్ట్​లోనూ టాప్​లోకి దూసుకొచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.