iDreamPost
android-app
ios-app

Travis Head: కోహ్లీ, రోహిత్‌ కాదు.. టీమిండియాలో అతనే సూపర్‌ స్టార్‌: ట్రావిస్ హెడ్

  • Published Sep 16, 2024 | 2:00 PM Updated Updated Sep 16, 2024 | 2:00 PM

Travis Head praises Shubman Gill: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ టీమిండియా యంగ్ ప్లేయర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కాదు.. అతడే టీమిండియా సూపర్ స్టార్ అన్న రేంజ్ లో అతడిని ఆకాశానికి ఎత్తేశాడు.

Travis Head praises Shubman Gill: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ టీమిండియా యంగ్ ప్లేయర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కాదు.. అతడే టీమిండియా సూపర్ స్టార్ అన్న రేంజ్ లో అతడిని ఆకాశానికి ఎత్తేశాడు.

Travis Head: కోహ్లీ, రోహిత్‌ కాదు.. టీమిండియాలో అతనే సూపర్‌ స్టార్‌: ట్రావిస్ హెడ్

టీమిండియా దాదాపు నెలన్నర రోజుల తర్వాత తిరిగి గ్రౌండ్ లోకి అడుగుపెట్టింది. బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్, టీ20 సిరీస్ కోసం ప్రాక్టీస్ మెుదలుపెట్టింది. ఇక ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ తో పాటుగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025లో ఇది కీలకమైన సిరీస్. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ టీమిండియా యంగ్ ప్లేయర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కాదు.. అతడే టీమిండియా సూపర్ స్టార్ అన్న రేంజ్ లో అతడిని ఆకాశానికి ఎత్తేశాడు.

టీమిండియా నవంబర్ లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఇక భారత్ సైతం ఈ సిరీస్ ను దృష్టిలో పెట్టుకునే బంగ్లా, న్యూజిలాండ్ లతో మ్యాచ్ లకు సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలో టీమిండియా యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్. స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ.. గిల్ ఆటతీరుపై పొగడ్తలు కురిపించాడు. “శుబ్ మన్ గిల్ క్రికెట్ లో ఓ సూపర్ స్టార్. అతడు తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. పైగా స్పిన్ లో గిల్ గొప్పగా ఆడతాడు. అతడొక క్లాస్ బ్యాటర్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కాదు.. టీమిండియాలో అతడే ఫ్యూచర్ సూపర్ స్టార్” అంటూ ప్రశంసించాడు హెడ్. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముందున్న నేపథ్యంలో లేటెస్ట్ గా టీమిండియాపై కొన్ని కామెంట్స్ చేశాడు ట్రావిస్ హెడ్. ఇండియాపై వరల్డ్ కప్ 2023 ఫైనల్లో, అలాగే గత టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ల్లో సెంచరీలు చేయడంతో అందరూ ఇండియా తన ఫేవరెట్ ప్రత్యర్థి అని అనుకుంటన్నారని, కానీ ఇండియా నా ఫేవరెట్ ఆపోజిట్ టీమ్ కాదని ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చాడు. టీమిండియాతో ఆడటం చాలా కష్టం అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అద్భుత ఫామ్ లో ఉన్నాడు హెడ్. అదే జోరును టీమిండియాపై కూడా చూపించాలని ఆరాటపడుతున్నాడు. టీమిండియాకు ఫైనల్ మ్యాచ్ ల్లో విలన్ గా మారాడు హెడ్. అలాంటి ప్లేయర్ యంగ్ క్రికెటర్ గిల్ పై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి గిల్ పై హెడ్ ప్రశంసలు కురిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.