Somesekhar
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో రూ. 1.5 కోట్లకు ఓ ప్లేయర్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన కొన్ని గంటల్లోనే సదరు ఆటగాడు నిషేధం ఎదుర్కోవడం షాకింగ్ గా మారింది.
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో రూ. 1.5 కోట్లకు ఓ ప్లేయర్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన కొన్ని గంటల్లోనే సదరు ఆటగాడు నిషేధం ఎదుర్కోవడం షాకింగ్ గా మారింది.
Somesekhar
సాధారణంగా ఏ ఆటలోనైనా ఆటగాళ్లు అనుచితంగా ప్రవర్తిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాయి అందుకు సంబంధించిన యాజమాన్యాలు. ఇక క్రికెట్ లో అయితే ప్లేయర్లు హద్దులు దాటి ప్రవర్తిస్తే.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వారిపై కొరఢాఝుళిపిస్తుంది. మ్యాచ్ ఫీజులో కోత విధించడమో లేదా.. కొన్ని మ్యాచ్ ల నిషేధం విధించడమో చేస్తుంది. తాజాగా ఓ స్టార్ ఆల్ రౌండర్ నిషేధం ఎదుర్కొన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో రూ. 1.5 కోట్లకు ఆ ప్లేయర్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన కొన్ని గంటల్లోనే సదరు ప్లేయర్ నిషేధం ఎదుర్కోవడం షాకింగ్ గా మారింది. మరి నిషేధం ఎదుర్కొన్న ఆ ప్లేయర్ ఎవరు? ఎందుకు ఆ శిక్ష పడిందో ఇప్పుడు తెలుసుకుందాం.
టామ్ కర్రన్.. ఇంగ్లాండ్ కు చెందిన స్టార్ ఆల్ రౌండర్. ఇక ఇతడి సోదరుడు సామ్ కర్రన్ మెున్నటి వరకు ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడిన రికార్డుల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రికార్డును ఆసీస్ ప్లేయర్లు అయిన మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ ను బద్దదలు కొట్టి.. 2024 ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. కాగా.. ఈ వేలంలో టామ్ కర్రన్ ను రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది ఆర్సీబీ. ఇది జరిగిన గంటల్లోనే టామ్ కర్రన్ పై బిగ్ బాష్ లీగ్ లో 4 మ్యాచ్ లు ఆడకుండా నిషేధం విధించారు టోర్నీ నిర్వాహకులు. అసలు విషయం ఏంటంటే? బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ఇటీవల హోబర్డ్ హరికేన్స్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో టామ్ కర్రన్ టీమ్ అయిన సిడ్నీ సిక్సర్స్ విజయం సాధించింది.
ఇక ఈ మ్యాచ్ కు ముందు అంపైర్ పై దురుసు ప్రవర్తన కారణంగా ఆస్ట్రేలియా కోడ్ ఆఫ్ కండక్ట్ 2.7 కింద అతడిపై 4 మ్యాచ్ ల నిషేధం విధించారు. దీంతో అతడు ఈ టోర్నీలో తర్వాత జరగబోయే 4 మ్యాచ్ లకు దూరం కానున్నాడు. అయితే ఈ విషయంపై సిడ్నీ సిక్సర్స్ జట్టు అప్పీల్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. అంపైర్ ను పిచ్ కు దూరంగా వెళ్లమని కర్రన్ సైగ చేసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఇక వీడియోలో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ లో భాగంగా టామ్ కర్రన్ పిచ్ మధ్యలో నుంచి బౌలింగ్ చేస్తూ కనిపించాడు. దీంతో సదరు అంపైరు పిచ్ మధ్యలో కాకుండా, పక్కన బౌలింగ్ ప్రాక్టీస్ చేయాలని సూచించాడు. ఇది వినకుండా కర్రన్ అంపైర్ పైకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా జరిగిన వేలంలో ఆర్సీబీ టామ్ కర్రన్ ను రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వేలం జరిగిన కొన్ని గంటల్లోనే అతడిపై నిషేధం విధించబడటం ఆర్సీబీ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Tom Curran banned for 4 games in Big Bash.
– The reason in the video. 👇pic.twitter.com/RHzI96YQXR
— Johns. (@CricCrazyJohns) December 21, 2023
Tom Curran will be serving a four-game suspension in the BBL as a penalty under Article 2.7 of the code of conduct (intimidation of an umpire during a game.)
He tried to practice his run-up pre-match and ran straight toward the umpire who stood in the bowling crease to stop him.… pic.twitter.com/xznmm6ByZt
— CricTracker (@Cricketracker) December 21, 2023