ప్రపంచ క్రికెట్ లో ప్రతి రోజు ఏదో ఒక రికార్డు నమోదు అవుతూనే ఉంటుంది. అందుకే రికార్డులకు ఆయుష్షు తక్కువ అంటారు. తాజాగా క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు ఒకటి నమోదు అయ్యింది. కేవలం ఒకే ఒక్క బంతికి 18 పరుగులు సమర్పించుకున్నాడు ఓ బౌలర్. ఆ బౌలర్ ఆ జట్టుకు సారథి కావడం గమనార్హం.ఇది జరిగింది ఏ విదేశీ లీగ్ లోనో అనుకుంటే పొరపాటే. ఈ చెత్త రికార్డు ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో నమోదు అయ్యింది.
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా.. మంగళవారం రాత్రి సలేమ్ స్పార్టాన్స్ వర్సెస్ చెపాక్ సూపర్ గల్లీస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో స్పార్టాన్స్ కెప్టెన్ ఓ చెత్త రికార్డ్ ను మూటగట్టుకున్నాడు. లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చిన కెప్టెన్ అభిషేక్ తన్వర్ ఈ ఓవర్లో మెుత్తం 26 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ఒక్క బాల్ కే 18 రన్స్ ఇవ్వడం గమనార్హం. ఈ ఓవర్లో తొలి ఐదు బంతులకు ఎనిమిది పరుగులు ఇచ్చిన తన్వర్.. చివరి బంతికి మాత్రం ఏకంగా 18 పరుగులు సమర్పించాడు. లాస్ట్ బాల్ వేయడానికి నానా కష్టాలు పడ్డాడు. ఆఖరి బంతికి మూడు నోబాల్స్, ఒక వైడ్ సహా రెండు సిక్సర్లు, రెండు రన్స్ రావడంతో.. మెుత్తంగా ఈ ఓవర్ లో 18 పరుగులు పిండుకున్నాడు చెపాక్ బ్యాటర్ సంజయ్ యాదవ్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గల్లీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 218 పరుగుల భారీ స్కోర్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన స్పార్టాన్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేయగలిగింది. దాంతో 52 పరుగుల తేడాతో చెపాక్ జట్టు విజయం సాధించింది.
One ball
18 runs 🤑#TNPL2023 pic.twitter.com/GcN9E8XyoP— Cricket Insider (@theDcricket) June 13, 2023