iDreamPost
android-app
ios-app

షకీబ్, మాథ్యూస్ ఇద్దరూ దోషులే! ఒక్కసారి ధోనీని చూసి నేర్చుకోండి!

  • Author singhj Published - 02:08 PM, Tue - 7 November 23

లంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్​ను టైమ్డ్ ఔట్​గా ఇవ్వడంపై కాంట్రవర్సీ నడుస్తోంది. అయితే ఈ వివాదం నేపథ్యంలో భారత లెజెండ్ ఎంఎస్ ధోని చేసిన ఒక పనిని అందరూ గుర్తుచేసుకుంటున్నారు.

లంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్​ను టైమ్డ్ ఔట్​గా ఇవ్వడంపై కాంట్రవర్సీ నడుస్తోంది. అయితే ఈ వివాదం నేపథ్యంలో భారత లెజెండ్ ఎంఎస్ ధోని చేసిన ఒక పనిని అందరూ గుర్తుచేసుకుంటున్నారు.

  • Author singhj Published - 02:08 PM, Tue - 7 November 23
షకీబ్, మాథ్యూస్ ఇద్దరూ దోషులే! ఒక్కసారి ధోనీని చూసి నేర్చుకోండి!

అన్ని గేమ్స్​లోలాగే క్రికెట్​లోనూ కాంట్రవర్సీలు కామనే. అయితే కొన్ని వివాదాలు గ్రౌండ్​ లోపలే ముగిసిపోతాయి. కానీ మరికొన్ని మాత్రం స్టేడియం దాటినా కంటిన్యూ అవుతాయి. సోషల్ మీడియాలోనూ కాంట్రవర్సీలపై నెటిజన్స్ చర్చకు తెరలేపడం చూస్తూనే ఉన్నాం. వరల్డ్ కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో శ్రీలంక సీనియర్ ఆల్​రౌండర్ ఏంజెలో మాథ్యూస్​ను ‘టైమ్డ్ ఔట్​’గా ప్రకటించడం పెద్ద వివాదానికి దారితీసింది. బ్యాటింగ్​కు రావాల్సిన మాథ్యూస్ నిర్ణీత గడువైన రెండు నిమిషాల్లోపు క్రీజులోకి చేరుకోలేదు. అతడ్ని ఔట్​గా​ ఇవ్వాలంటూ బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ అప్పీల్ చేశాడు. దీంతో అంపైర్​కు ఔట్​గా ప్రకటించక తప్పలేదు.

టైమ్డ్ ఔట్​గా ప్రకటించడంతో షకీబ్​ దగ్గరకు వచ్చి అప్పీల్​ వెనక్కి తీసుకోవాల్సిందిగా మాథ్యూస్ కోరాడు. కానీ అతడు వినకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు లంక సీనియర్ క్రికెటర్. ఆ తర్వాత బంగ్లా ఇన్నింగ్స్ టైమ్​లో షకీబ్​ను ఔట్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు మాథ్యూస్. ఈ కాంట్రవర్సీ కారణంగా మ్యాచ్ తర్వాత ఇరు టీమ్స్ ప్లేయర్లు ఒకరికొకరు హ్యాండ్ షేక్స్ ఇచ్చుకోలేదు. 15 ఏళ్ల కెరీర్​లో ఇలాంటి టీమ్​ను చూడలేదంటూ బంగ్లాపై విమర్శలకు దిగాడు మాథ్యూస్. అయితే బ్యాట్స్​మన్​ టైమ్​కు రాకపోతే ఔట్ ఇవ్వొచ్చని రూల్స్​లో ఉందంటూ షకీబ్ తన అప్పీల్​ను సమర్థించుకున్నాడు.

ఈ వివాదంలో కొందరు మాథ్యూస్​ను సమర్థిస్తుంటే.. మరికొందరు షకీబ్ చేసిన దాంట్లో తప్పు లేదని అంటున్నారు. మాథ్యూస్ కావాలని హెల్మెట్ స్ట్రిప్ లాగేయలేదని, అతడు రిక్వెస్ట్ చేశాకైనా షకీబ్ వెనక్కి తగ్గాల్సిందని అంటున్నారు. అయితే ఈ వివాదంలో మాథ్యూస్, షకీబ్​లు ఇద్దరూ దోషులని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు. నిజానికి క్రికెట్ స్పిరిట్​కు విరుద్ధంగా మాథ్యూస్​ గతంలో ప్రవర్తించాడు. అదే ఇప్పుడు కర్మ రూపంలో రిటర్న్ అయిందని నెటిజన్స్ చెబుతున్నారు. షకీబ్ కూడా అంపైర్లతో గొడవ పడుతూ వికెట్లు విరగ్గొట్టడం లాంటివి చేసిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు కూడా క్రీడా స్ఫూర్తి గురించి పట్టించుకోకుండా కేవలం తన టీమ్ గెలవాలనే స్వార్థంతో కావాలనే అప్పీల్ చేశాడని అంటున్నారు.

మాథ్యూస్ రిటర్న్ తీసుకోమని చెప్పినా షకీబ్ అస్సలు వినలేదు. గెలుపు కోసం ఇంత స్వార్థంగా ఆలోచించడం, స్పోర్ట్స్ స్పిరిట్​ను తుంగలో తొక్కడం, క్రికెట్ గౌరవానికి భంగం కలిగేలా బిహేవ్ చేయడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అదే టైమ్​లో భారత లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీని చూసి నేర్చుకోవాలంటూ షకీబ్, మాథ్యూస్​కు క్రికెట్ అనలిస్టులు సూచిస్తున్నారు. అందుకు ఓ ఘటనను ఎగ్జాంపుల్​గా చెబుతున్నారు. 2011లో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య నాటింగ్​హామ్​లో టెస్ట్ జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్​లో ఇంగ్లీష్ టీమ్ 3 వికెట్లకు 254 రన్స్​తో ఉంది. లంచ్​కు ముందు ఆఖరి బాల్​ను ఎదుర్కొన్న ఇయాన్ బెల్ (137) మంచి షాట్ కొట్టాడు. అయితే ఆ బంతి బౌండరీకి వెళ్లిందనుకొని క్రీజు మధ్యలోకి వచ్చి ఆగిపోయాడు.

బెల్ కొట్టిన బాల్​ను బౌండరీ వద్ద ప్రవీణ్ కుమార్ అద్భుతమైన డైవ్​తో ఆపాడు. అయితే అతడు కూడా అది ఫోర్ అనుకొని బాల్​ను మెళ్లిగా కీపర్ వైపు వేశాడు. ఇది గమనించని బెల్ బౌలింగ్ ఎండ్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. కానీ నాన్​స్ట్రయికర్ కూడా అక్కడే ఉన్నాడు. బాల్​ను పట్టుకున్న ఫీల్డర్ వికెట్లను గిరాటేశాడు. భారత టీమ్ రనౌట్​కు అప్పీల్ చేసింది. రివ్యూలో థర్డ్ అంపైర్ ఔట్​గా ఇచ్చాడు. దీంతో బెల్ పెవిలియన్​కు చేరుకున్నాడు. అయితే లంచ్ తర్వాత అనూహ్యంగా బెల్ మళ్లీ బ్యాటింగ్​కు వచ్చాడు. అతడు ఔట్ అయినప్పటికీ క్రీడా స్ఫూర్తితో తిరిగి బ్యాటింగ్​కు రావాలని అప్పటి టీమిండియా కెప్టెన్ ధోని ఆహ్వానించాడు. తన అప్పీల్​ను వెనక్కి తీసుకున్నాడు. ఈ ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. ధోనీని చూసి షకీబ్, మాథ్యూస్ నేర్చుకోవాలని ఇండియన్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. మరి.. మాథ్యూస్-షకీబ్ కాంట్రవర్సీ గురించి మీరేం అనుకుంటున్నారు? ధోని నుంచి వీళ్లు నేర్చుకోవాలా అనే దాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: శుబ్​మన్​ గిల్​పై సారా అలీ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అది తాను కాదంటూ..!