Vinay Kola
Tim Southee: మంచి బౌలర్.. బ్యాట్స్ మెన్ గా రాణించిన న్యూజీలాండ్ స్టార్ ప్లేయర్ టిం సౌథీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ కి గుడ్ బై చెప్పనున్నాడు.
Tim Southee: మంచి బౌలర్.. బ్యాట్స్ మెన్ గా రాణించిన న్యూజీలాండ్ స్టార్ ప్లేయర్ టిం సౌథీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ కి గుడ్ బై చెప్పనున్నాడు.
Vinay Kola
క్రికెట్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్. న్యూజిలాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడు. నవంబర్ 28 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే 3 మ్యాచ్‌ల హోమ్ టెస్ట్ సిరీస్ మాత్రమే ఆడనున్నాడు. ఇక ఆ తర్వాత అతను తన టెస్ట్ కెరీర్‌ను క్లోజ్ చేయనున్నాడు. సౌథీ డిసెంబర్ 14 – 18 మధ్య హామిల్టన్‌లో తన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. ప్రస్తుతం సౌదీ వయసు 35 ఏళ్లు. ఇప్పటి దాకా న్యూజిలాండ్ తరపున మొత్తం 104 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. న్యూజిలాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతను ఇప్పటిదాకా ఏకంగా 385 బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. అంటే 385 వికెట్లు తీసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఇక 161 వన్డేలు ఆడి 221 వికెట్లు, 125 టీ20ల్లో 164 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 2011 నుంచి ఐపీఎల్లో పలు ఫ్రాంచైజీలకు ఆడిన సౌథీ, 54 మ్యాచ్‌ల్లో మొత్తం 47 వికెట్లు తీశాడు. ఇక గతనెల సౌథీ టెస్టు ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలని వదులుకున్నాడు.
టిమ్ సౌధీ 19 ఏళ్ళకి క్రికెట్ లో అడుగుపెట్టాడు. 2008లో నేపియర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు ఫస్ట్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అదే జట్టుతో తన లాస్ట్ మ్యాచ్ ని ఆడనున్నాడు. అంటే దాదాపు 16ఏళ్లు న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.అయితే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్ టీం ఫైనల్‌కు అర్హత సాధిస్తే, జూన్ నెలలో లార్డ్స్‌లో జరిగే మ్యాచ్‌కు ఆడతానని అతను చెప్పుకొచ్చాడు. ఇక టిం కేవలం బాల్ తోనే కాదు, బ్యాట్‌తో కూడా ఝుళిపించాడు. బ్యాట్స్ మెన్ గా టిమ్ 2185 పరుగులు చేశాడు. టిం బ్యాటింగ్ కి సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది. మ్యాచ్ లాస్ట్ లో భారీ హిట్స్ బాడడంలో బాగా ఫేమస్ అయ్యాడు. బ్రెండన్ మెకల్లమ్ తర్వాత టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సౌధీ రికార్డు క్రియేట్ చేశాడు. తన టెస్టు కెరీర్‌లో ఏకంగా మొత్తం 93 సిక్సర్లు బాదాడు.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో టిమ్ సౌథీ ఏకంగా 55 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ నుంచి భారత్‌పై అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఇటీవల ఇక 36 ఏళ్ల తర్వాత భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడంలో సౌధీ కీలక పాత్ర పోషించాడు. బెంగళూరు టెస్టులో 65 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన తర్వాత రచిన్ రవీంద్రతో కలిసి ఏకంగా 137 పరుగుల పార్ట్నర్ షిప్ నెలకొల్పాడు. ఈ విధంగా క్రికెట్ లో తన కంటూ ప్రత్యేక ముద్రని వేసుకున్నాడు టిమ్ సౌధీ. ఇక టిమ్ సౌధీ టెస్ట్ రిటైర్మెంట్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.