iDreamPost
android-app
ios-app

రోహిత్ శర్మ భార్య రితిక గొప్పతనం చెప్పిన తిలక్ వర్మ తండ్రి! ఇంత మంచిదా?

  • Published Feb 05, 2024 | 10:32 AM Updated Updated Feb 05, 2024 | 10:32 AM

Rohit Sharma-Ritika Sajdeh: రోహిత్ శర్మ భార్య రితిక సజ్దే ఎంత గొప్పదో చెప్పుకొచ్చాడు టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ తండ్రి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rohit Sharma-Ritika Sajdeh: రోహిత్ శర్మ భార్య రితిక సజ్దే ఎంత గొప్పదో చెప్పుకొచ్చాడు టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ తండ్రి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Feb 05, 2024 | 10:32 AMUpdated Feb 05, 2024 | 10:32 AM
రోహిత్ శర్మ భార్య రితిక గొప్పతనం చెప్పిన తిలక్ వర్మ తండ్రి! ఇంత మంచిదా?

సాధారణంగా క్రికెటర్లు పర్యటనల నిమిత్తం పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉంటారు. అలా వెళ్లిన సమయంలో మ్యాచ్ ముగిసిన తర్వాత దగ్గరలో ఉన్న ఆటగాళ్ల ఇళ్లకు వెళ్లడం సర్వసాధారణమే. అదీకాక తమ సహచర ఆటగాళ్లను కుటుంబ సభ్యులకు పరిచయం చేయడానికి లోకల్ ప్లేయర్లు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ కు ఆడుతున్న క్రమంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. ముంబై జట్టు సభ్యులను తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇక ఈ సమయంలో టీమిండియా కెప్టెన్, అప్పటి ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య రితిక సజ్దే తో కలిసి తిలక్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా రితిక తిలక్ వర్మ తండ్రితో ఓ మాట చెప్పింది. ఒక్క మాటతో ఆమె ఎంత మంచిదో అర్ధమైందని తిలక్ తండ్రి నాగార్జున అన్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

తిలక్ వర్మ.. టీమిండియాలోకి అడుగుపెట్టిన తెలుగు తేజం. గతేడాది జరిగిన ఐపీఎల్ లో దుమ్మురేపే ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ టీమ్ కు ప్రాతినిథ్యం వహించాడు తిలక్. 11 మ్యాచ్ లు ఆడి 343 పరుగులు చేశాడు. ఇక అతడు టీమిండియాకు ఎంపిక అవ్వడంలో తండ్రి నాగార్జున పాత్ర ఎంతో కీలకమైనది. ఎంతటి కష్టాలు వచ్చినా.. వాటిని ఎదుర్కొంటూ తన కొడుకు అనుకున్నట్లుగానే టీమిండియాకు ఎంపిక అయ్యేలా కృషి చేశాడు. ఇక ఐపీఎల్ ఆడే క్రమంలో ముంబై ఇండియన్స్ టీమ్ జట్టు సభ్యులు తిలక్ ఇంటికి వచ్చారు. ఈ సమయంలో రోహిత్ భార్య రితిక అన్న ఓ మాటను తాను ఎప్పటికీ మర్చిపోలేనని, ఆమె మంచి తనానికి అది నిదర్శనమని తిలక్ తండ్రి నాగార్జున చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఆ వీడియోలో తిలక్ తండ్రి మాట్లాడుతూ..”ఒక రోజు తిలక్ నాన్న మా టీమ్ ను ఇంటికి తీసుకొస్తానని చెప్పాడు. అప్పుడు నేను అంత పెద్ద వారు మన ఇంటికి వస్తారా? అని అడిగాను. నేను తీసుకొస్తానని చెప్పాడు. అయితే సడెన్ గా ఒకరోజు ముంబై టీమ్ లో కొంతమందిని ఇంటికి తీసుకొచ్చాడు. అందులో క్రికెట్ గాడ్ సచిన్, రోహిత్ శర్మ దంపతులు, ఇషాంత్ శర్మతో పాటుగా చాలా మంది వచ్చారు. మా ఇంట్లో దాదాపు 3 గంటలు గడిపారు. వారిందరికి ప్రత్యేక వంటకాలు చేసి పెట్టాం. వారందరూ చాలా సరదాగా, సాధారణంగా ఉన్నారు. ఎంతో సింపుల్ గా కింద కూడా కూర్చుకున్నారు. అది నాకు ఆశ్చర్యం కలిగించింది” అని ఆయన తెపారు.

“ఇక ఈ సమయంలో రోహిత్ భార్య రితక మా ట్రిగ్గర్(కుక్కపేరు)తో ఆడుకుంటూ ఉంది. అప్పుడు నేను కింద ఎందుకు కూర్చున్నావమ్మ.. పైన కూర్చో అన్నాను. ఆ మాటకు ఆమె ఇచ్చిన సమాధానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. పైన కూర్చుంటే మీ ఇల్లు అవుతుంది.. కింద కూర్చుంటే మా ఇల్లు అవుతుందని అన్నది. ఆ మాటలు నాకు డైమాండ్ వర్డ్స్ లాగా అనిపించాయి. రితిక ఇంత మంచిదా అనిపించింది” అంటూ తిలక్ తండ్రి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పాత వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో రితిక ఇంత మంచి అమ్మాయా? అంటూ నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఎంతైనా తెలుగు మూలాలు ఎక్కడిపోతాయి అంటూ కితాబిస్తున్నారు. మరి రితిక సింప్లీ సిటిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

ఇదికూడా చదవండి: Shubman Gill: మా నాన్న సెంచరీ చేసినా తిడతాడు, ఎందుకంటే? గిల్ షాకింగ్ కామెంట్స్!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetpark girişgrandpashabet