iDreamPost

Shubman Gill: మా నాన్న సెంచరీ చేసినా తిడతాడు, ఎందుకంటే? గిల్ షాకింగ్ కామెంట్స్!

సెంచరీ చేసినా.. మా నాన్న హోటల్ కు వెళ్లగానే తిడతాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు యంగ్ బ్యాటర్ శుబ్ మన్ గిల్. మరి వాళ్ల నాన్న ఎందుకు తిడతాడో ఇప్పుడు తెలుసుకుందాం.

సెంచరీ చేసినా.. మా నాన్న హోటల్ కు వెళ్లగానే తిడతాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు యంగ్ బ్యాటర్ శుబ్ మన్ గిల్. మరి వాళ్ల నాన్న ఎందుకు తిడతాడో ఇప్పుడు తెలుసుకుందాం.

Shubman Gill: మా నాన్న సెంచరీ చేసినా తిడతాడు, ఎందుకంటే? గిల్ షాకింగ్ కామెంట్స్!

శుబ్ మన్ గిల్.. గత కొంతకాలంగా దారుణంగా విఫలం అవుతూ, జట్టుకు భారంగా మారాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు. అయితే వారి విమర్శలకు తాజా సెంచరీతో కౌంటర్ ఇచ్చాడు. 12 ఇన్నింగ్స్ ల తర్వాత కీలక సమయంలో శతకం సాధించి.. భారత్ కు మంచి ఆధిక్యాన్ని సాధించిపెట్టాడు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన గిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నేను ఈ సెంచరీ సాధించినా.. హోటల్ కు వెళ్లగానే మా నాన్న తిడతాడు అంటూ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అదేంటి కొడుకు సెంచరీ చేస్తే.. సంతోష పడాలిగానీ తిట్టడం దేనికి? అన్న అనుమానం మీకు రావొచ్చు. అయితే అలా తిట్టడానికి రీజన్ చెప్పాడు ఈ యంగ్ బ్యాటర్.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో కీలకమైన సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతమైన సెంచరీ చేశాడు యంగ్ బ్యాటర్ శుబ్ మన్ గిల్. ఓవైపు వికెట్లు పడుతున్నా.. ఒత్తిడిని అధిగమిస్తూ.. శతకంతో కదంతొక్కాడు. 147 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 2 సిక్సు లతో 104 పరుగులు చేశాడు. ఇక ఇది గిల్ టెస్ట్ కెరీర్ లో మూడో సెంచరీ కావడం విశేషం. కీలక టైమ్ లో శతకం బాది.. జట్టుకు అండగా నిలవడమే కాకుండా తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. ఇదిలా ఉండగా.. మ్యాచ్ అనంతరం మాట్లాడిన గిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నేను సెంచరీ చేసినా మా నాన్న హోటల్ కు వెళ్లగానే తిడతాడు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అయోమయంలో పడ్డారు ఫ్యాన్స్. అదేంటి.. సెంచరీ చేస్తే తండ్రి ఆనందపడాలి కానీ తిట్టడం దేనికి? అంటూ అర్ధం కాక తలపట్టుకుంటున్నారు. అయితే తన తండ్రి దేనికి తిడతాడో చెప్పుకొచ్చాడు గిల్.

Even if he scores a century, dad scolds him

“మా నాన్నా నేను హోటల్ కు వెళ్లగానే తిడతాడు. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే? నేను ఔట్ అయిన విధానం ఆయనకు నచ్చదు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతంగా ఆడుతున్నాను. ఇలాంటి టైమ్ అలాంటి షాట్ ఎందుకు ఆడావు? అని కచ్చితంగా తిడతాడు. అయితే ఫీల్డర్ మూవ్ అవ్వడం చూసే నేను ఆ షాట్ ఆడాను. కానీ దురదృష్టవశాత్తు ఔట్ అయ్యాను. ఇక ఇలాంటి పిచ్ లపై ఆడటం అంత ఈజీకాదు” అంటూ చెప్పుకొచ్చాడు శుబ్ మన్ గిల్. ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ డెబ్యూ బౌలర్ షోయబ్ బషీర్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ఆడుతూ.. కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు గిల్.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 67 రన్స్ చేసింది. విజయానికి ఇంకా 332 పరుగుల దూరంలో ఉంది. భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రసవత్తరంగా మారిన ఈ మ్యాచ్ లో విజయం ఏ జట్టును వరిస్తుందో చూడాలి. మరి సెంచరీ చేసినా.. మా నాన్న తిడతాడని చెప్పిన గిల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IND vs ENG: మెక్ కల్లమ్ రాత్రి మాకు ఒకే మాట చెప్పాడు.. దాంతోనే ఇండియాను ఓడిస్తాం: అండర్సన్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి