Tilak Varma: తిలక్ వర్మ సూపర్ సెంచరీ.. ఇన్నాళ్ల ఆకలి తీర్చాడు!

Tilak Varma Super Century In Duleep Trophy: టీమిండియా డాషింగ్ బ్యాటర్ తిలక్ వర్మ కమ్​బ్యాక్​ను ఘనంగా చాటుకున్నాడు. ఇంజ్యురీ నుంచి కోలుకొని వచ్చిన ఈ లెఫ్టాండర్.. దులీప్ ట్రోఫీలో సూపర్ సెంచరీతో మెరిశాడు.

Tilak Varma Super Century In Duleep Trophy: టీమిండియా డాషింగ్ బ్యాటర్ తిలక్ వర్మ కమ్​బ్యాక్​ను ఘనంగా చాటుకున్నాడు. ఇంజ్యురీ నుంచి కోలుకొని వచ్చిన ఈ లెఫ్టాండర్.. దులీప్ ట్రోఫీలో సూపర్ సెంచరీతో మెరిశాడు.

టీమిండియా డాషింగ్ బ్యాటర్ తిలక్ వర్మ కమ్​బ్యాక్​ను ఘనంగా చాటుకున్నాడు. ఇంజ్యురీ నుంచి కోలుకొని వచ్చిన ఈ లెఫ్టాండర్.. దులీప్ ట్రోఫీలో సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇండియా-డీతో జరుగుతున్న రెండో రౌండ్ మ్యాచ్​లో క్లాస్ బ్యాటింగ్​తో అలరించాడు. 184 బంతులు ఎదుర్కొన్న తిలక్ 9 బౌండరీల సాయంతో 104 పరుగులు చేశాడు. తన న్యాచురల్ బ్యాటింగ్​ను పక్కనబెట్టి టెస్టులకు తగ్గట్లు ఆడాడు. క్రీజులో కుదురుకోవడం, స్ట్రైక్ రొటేషన్ మీదే ఫోకస్ పెట్టి ఆడాడు. అడ్డగోలు షాట్లకు వెళ్లకుండా మంచి బంతుల్ని గౌరవిస్తూ.. చెత్త డెలివరీస్​ను మాత్రమే బౌండరీ లైన్ దాటించాడు. అవసరమైనప్పుడు సాలిడ్ డిఫెన్స్​తో ప్రత్యర్థి బౌలర్లను విసిగించాడు.

ఇటీవల కాలంలో తిలక్ అంతగా రాణించడం లేదు. గాయం వల్ల కూడా అతడు ఎంతో ఇబ్బంది పడ్డాడు. టీమిండియాలో వస్తూ పోతూ ఉన్న తిలక్.. కన్​సిస్టెంట్​గా రన్స్ చేస్తేనే తన ప్లేస్​ను ఫిక్స్ చేసుకోగలడు. ఈ నేపథ్యంలో ఇంజ్యురీ తర్వాత అతడు సెంచరీతో ఘనంగా కమ్​బ్యాక్ ఇవ్వడం మంచి విషయమే. ఈ ఇన్నింగ్స్ చూసిన నెటిజన్స్.. తిలక్ ఇన్నాళ్ల ఆకలి తీర్చేశాడని మెచ్చుకుంటున్నారు. అతడి నుంచి ఇదే అందరూ కోరుకున్నదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఇండియా-ఏలో తిలక్​తో పాటు ప్రతామ్ సింగ్ కూడా సెంచరీతో మెరిశాడు. అతడు 189 బంతుల్లో 122 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్స్​తో పాటు 12 బౌండరీలు ఉన్నాయి. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (87 బంతుల్లో 56) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే అంతా బాగానే ఆడినా యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ (31 బంతుల్లో 20) మాత్రం ఫెయిల్ అయ్యాడు.

2 భారీ సిక్సులు బాదిన పరాగ్ అదే ఊపులో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. మంచి స్టార్ట్ దొరికినా దాన్ని బిగ్ స్కోర్​గా కన్వర్ట్ చేయలేకపోయాడు. తిలక్​తో పాటు శాశ్వత్ రావత్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 88 బంతుల్లో 64 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. ఇండియా-ఏ ఆధిక్యం 488 పరుగులకు చేరాక ఆ టీమ్ ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఇండియా-డీ ఇప్పుడు వికెట్ నష్టపోకుండా 2 పరుగులతో ఉంది. యష్ దూబె (1 నాటౌట్), అధర్వ టైడే (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు ముందు భారీ టార్గెట్ ఉంది. కొండంత స్కోరును అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్​లో దేవ్​దత్ పడిక్కల్ తప్ప ఎవరూ రాణించలేదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫామ్ అంతంతే. స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్​ది కూడా ఇదే పరిస్థితి. వీళ్లంతా రాణించి పడిక్కల్​కు అండగా నిలిస్తేనే ఇండియా-డీ మ్యాచ్​లో ఉంటుంది. బ్యాటర్లు మళ్లీ విఫలమైతే ఆ టీమ్​కు ఘోర ఓటమి తప్పదు. మరి.. తిలక్ బ్యాటింగ్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments