SNP
టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ.. రంజీ ట్రోఫీలో సెంచరీతో చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్‌లో తిలక్ చూపించిన ఇంటెంట్‌తో భారత టెస్ట్ జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. మరి ఆ సెంచరీ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ.. రంజీ ట్రోఫీలో సెంచరీతో చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్‌లో తిలక్ చూపించిన ఇంటెంట్‌తో భారత టెస్ట్ జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. మరి ఆ సెంచరీ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా యువ క్రికెటర్, మన తెలుగు తేజం తిలక్ వర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లు, వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అతని ఫోకస్ టెస్టులపై పడింది. టీ20ల్లో తిలక్ టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్‌గా ఉన్నా.. వన్డేల్లో తన ప్లేస్‌ను సుస్థిరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే.. టెస్టుల్లో కూడా తన అదృష్టం పరీక్షించుకోవడానికి తిలక్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అందుకోసం.. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టుల్లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా తిలక్ వర్మ.. రంజీల్లో సత్తా చాటుతున్నాడు. శుక్రవారం సిక్కింతో ప్రారంభమైన రంజీ మ్యాచ్‌లో తిలక్ సెంచరీతో చెలరేగాడు.
రంజీల్లో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తిలక్ వర్మ.. సిక్కింతో జరుగుతున్న మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. 111 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. ఇక ఇన్నింగ్స్‌తో తిలక్‌కు టీమిండియా టెస్ట్ టీమ్‌లో చోటు దక్కుతుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిక్కిం జట్టు.. 27.4 ఓవర్లలోనే 79 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులోని ఏ బ్యాటర్ కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయాడు. హైదరాబాద్ బౌలర్లలో టీ.త్యాగరాజన్ 6 వికెట్లతో సత్తా చాటాడు. అలాగే మిలింద్ 4 తీసి సత్తా చాటాడు. కార్తీకేయ, టీ.రవితేజ వికెట్లు తీయకపోయినా.. చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు.
ఇక ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగిన హైదరాబాద్ జట్టు.. 78.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 463 పరుగుల భారీ స్కోర్ చేసి.. తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. హైదరాబాద్ ఓపెనర్ తన్మై అగర్వాల్ 125 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో 137 పరుగులు చేసి అదరగొట్టాడు. మరో ఓపెనర్ రాహుల్ సింగ్ 64 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులతో 83 రన్స్ చేసి.. అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రోహిత్ రాయుడు సైతం 75 రన్స్‌తో అదరగొట్టాడు. ఇక కెప్టెన్ తిలక్ వర్మ 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చందన్ సహాని 56 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 54 పరుగులు చేసి రాణించాడు. చివర్లో ప్రజ్ఞాన్ రెడ్డి ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. మరి ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ సెంచరీతో అదరగొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
HUNDRED FOR TILAK VARMA…!!!
– Hundred from 111 balls including 8 fours and 4 sixes against Sikkim, Captain is leading Hyderabad by example with 2 hundreds in 2 innings in Ranji Trophy 2024. 🔥 pic.twitter.com/QFyFgG3Mjw
— Johns. (@CricCrazyJohns) January 20, 2024