iDreamPost
android-app
ios-app

రూ.20 లక్షలు పెడితే.. రూ.కోటి 70 లక్షలొచ్చాయి! కన్నీళ్లు ఆగలేదు..

  • Published Jul 19, 2023 | 8:47 AMUpdated Jul 19, 2023 | 8:47 AM
  • Published Jul 19, 2023 | 8:47 AMUpdated Jul 19, 2023 | 8:47 AM
రూ.20 లక్షలు పెడితే.. రూ.కోటి 70 లక్షలొచ్చాయి! కన్నీళ్లు ఆగలేదు..

టీమిండియా యువ క్రికెటర్‌, తెలుగు తేజం తిలక్‌ వర్మ ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబర్చడంతో పాటు.. ఐపీఎల్‌లో గత రెండు సీజన్లలో అద్భుతంగా రాణిస్తుండటంతో అతనికి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. ఈ సందర్భంగా తిలక్‌ వర్మ తల్లిదండ్రులు తమ కుమారుడి సక్సెస్‌ గురించి మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యారు. తన కొడుకు దేశం తరఫున ఆడుబోతున్నాడనే విషయం తమకెంతో సంతోషాన్ని ఇస్తుందని అంటున్నారు. టీమిండియాకు ఎంపిక కావడం ఆషామాషీ విషయం కాదని, దాని కోసం ఎంతో శ్రమించాలని, అది తిలక్‌ చేశాడని తెలిపారు.

తిలక్‌ తండ్రి నంబూరి నాగరాజు మాట్లాడుతూ.. ‘వాడికి 11 ఏళ్ల వయసున్నప్పుడు, నా దగ్గరికి వచ్చి నాన్న నేను క్రికెటర్‌ అవుతా అన్నాడు. మనం మిడిల్‌క్లాస్‌ కదా.. ఎలా అని ఖర్చు గురించి ఆలోచించా. సరేలే చూద్దామని, మాకు దగ్గర్లో ఉన్న లీగల్‌ అకాడమీకి పంపా.. అక్కడ సలాం భయాశ్‌ దగ్గర శిక్షణ తీసుకున్నాడు. అలా ఒక్కొ మెట్టు ఎక్కుతూ అండర్‌-14 కెప్టెన్‌ అయ్యాడు. అప్పుడు మాకు వాడిపై పూర్తి నమ్మకం వచ్చింది. తిలక్‌కు అండర్‌-16లో ఆడే అవకాశం వచ్చినప్పుడు మాకు బ్యాట్స్‌ కూడా కోనలేని పరిస్థితి ఉండేది. ఆ సమయంలో కోచ్‌ మాకు అండగా నిలిచారు. టాలెంట్‌ ఉంది కదా నేను చూసుకుంటాను అన్నారు. ఆయన తోడ్పాటుతో తిలక్‌ అండర్‌-19 వరల్డ్‌కప్‌ టీమ్‌కు ఎంపికయ్యాడు.

ఇక ఐపీఎల్‌ వేలం తిలక్‌ పేరు వచ్చినప్పుడు చాలా కంగారు పడ్డాం. అప్పుడు మా వాడికి బేస్‌ప్రైజ్‌గా రూ.20 లక్షలు పెట్టారు. ఫస్ట్‌ హైదరాబాద్‌ వాళ్లు రేటు పెంచారు. ఆ తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌ కూడా పోటీ పడింది. మధ్యలో రాజస్థాన్‌ రాయల్స్‌ సైతం రేటు పెంచింది. చివరికి ముంబై ఇండియన్స్‌ రంగంలోకి దిగింది. తొలుతు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రేటు పెరిగితేనే మేము ఆశ్చర్యపోయాం. నిజం చెప్పాలంటే గూస్‌బంప్స్‌ వచ్చాయి. ఆ తర్వాత రూ.70.. కోటి.. అలా ముంబై రూ.కోటి 70 లక్షలతో తిలక్‌ను తీసుకుంది. రూ.20 లక్షలు పెడితే.. కోటి 70 లక్షలు రావడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.. కళెంట నీళ్లు వచ్చాయి.’ అంటూ తిలక్‌ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. మరి తిలక్‌ ఐపీఎల్‌లో రాణించిన తీరు, టీమిండియాలో అతనికి చోటు దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: తండ్రైన టీమిండియా క్రికెటర్‌! ధోని బర్త్‌డే కూడా అదేరోజు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి