SNP
Tilak Varma, Rohit Sharma, Mumbai, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటి వద్ద తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tilak Varma, Rohit Sharma, Mumbai, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటి వద్ద తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SNP
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జూన్ 29 నుంచి ఫుల్ ఖుషీగా ఉన్నాడు. దాని కారణం ఏంటో చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా.. ఎందకంటే కెప్టెన్‌గా భారత్‌కు టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా గత వారం నుంచి రోహిత్ శర్మ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత నాలుగు రోజులు వెస్టిండీస్‌లోనే ఉండిపోయిన టీమిండియా.. గురువారం ఉదయం భారత్‌కు చేరుకుంది. అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీతో మీటింగ్.. ఆ తర్వాత ముంబైలో విక్టరీ పరేడ్‌తో బిజీబిజీగా నడిపింది.
ఇలా అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఫైనల్‌గా ముంబైలోని తన ఇంటికి చేరుకున్నాడు రోహిత్ శర్మ. అయితే.. దేశానికి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌కు ఇంటి వద్ద కూడా అదిరిపోయే ఘన స్వాగతం లభించింది. రోహిత్ కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, చిన్ననాటి స్నేహితులతో పాటు తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ.. రోహిత్‌కు సూపర్ వెల్‌కమ్ చెప్పారు. ముందుగా రోహిత్‌కు సెల్యూట్ చేస్తూ.. ఆ తర్వాత.. కప్పు అందుకునేటప్పుడు రోహిత్ వాకింగ్ స్టైల్‌ను కాపీ చేస్తూ.. రోహిత్‌కు వెల్‌కమ్ చెప్పారు.
అంతా కలిసి రోహిత్‌ను ఎత్తుకుని.. పూల దండతో సత్కారించారు. అలాగే రోహిత్ ఇంట్లోకి వెళ్లే దారిలో అంతా పూలు పరిచేశారు. తనకు లభించిన వెల్‌కమ్‌పై రోహిత్ సైతం ఆశ్చర్యపోయాడు. అయితే.. రోహిత్ ఇంటి వద్ద ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి తిలక్ వర్మ ఉండటంపై ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌కు, టీమిండియాకు ఆడటంతో రోహిత్ ఫ్యామిలీతో తిలక్‌కు మంచి బాండింగ్ ఏర్పడింది. ముఖ్యంగా రోహిత్ కూతురి సమైరాతో తిలక్‌కు మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఆ చనువుతోనే రోహిత్‌కు ఇంటి వద్ద వెల్‌కమ్ చెప్పేందుకు తిలక్ వెళ్లి ఉంటాడని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. మరి రోహిత్ శర్మకు ఇంటి వద్ద వెల్ కమ్ చెబుతూ.. తిలక్ వర్మ చేసిన సందడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
HERO WELCOME FOR CAPTAIN ROHIT. 🐐
– Family, Childhood friends, Tilak giving a memorable welcome for Ro as he returns to home. ❤️🥺pic.twitter.com/dQz4dc8x0p
— Johns. (@CricCrazyJohns) July 5, 2024