ఒక్కసారి రుచి చూస్తే అంతే.. 5 IPL కప్పులు గెలవడానికి అదే కారణం: రోహిత్‌

Rohit Sharma, IPL: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. తన ఐదు ఐపీఎల్‌ ట్రోఫీల విజయానికి ఉన్న కారణం ఏంటో ఇన్నేళ్లకు బయటపెట్టాడు. మరి అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Rohit Sharma, IPL: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. తన ఐదు ఐపీఎల్‌ ట్రోఫీల విజయానికి ఉన్న కారణం ఏంటో ఇన్నేళ్లకు బయటపెట్టాడు. మరి అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీమిండియా వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు.. ఐపీఎల్‌లో కూడా మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఏకంగా ఐదు ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. అత్యధిక ఐపీఎల్‌ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్‌గా.. ధోనితో సమంగా ఉన్నాడు. నిజానికి ధోని కొంటే ముందు రోహిత్‌ శర్మనే ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలు నెగ్గాడు. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్స్‌లో ముంబై ఇండియన్స్‌ రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ఛాంపియన్‌గా నిలిచింది.

ముంబై ఇండియన్స్‌ కంటే ముందు.. రోహిత్‌ శర్మ డెక్కన్‌ ఛార్జర్స్‌ జట్టుకు ఆడేవాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌ అతన్ని తీసుకుంది. చాలా కాలం పాటు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్‌.. తన హయాంలో ఐదు కప్పులు అందించాడు. అలాంటి కెప్టెన్‌ను ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌.. ఐపీఎల్‌ 2024 సీజన్‌కి ముందు కెప్టెన్‌గా తప్పించింది. కానీ, అదే ఏడాది రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ గెలవడం విశేషం. ఈ నేపథ్యంలో తాను ఐపీఎల్‌లో ఏకంగా 5 కప్పులు గెలవడానికి ఒక కారణం ఉందంటూ.. రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఒక్కసారి కప్పు గెలిస్తే.. ప్రతిసారి గెలవాలనే కసి పెరుగుతుందని, కప్పు రుచి చూస్తే.. దాని కోసమే ఆడతారంటూ రోహిత్ పేర్కొన్నాడు. తాను ఐపీఎల్‌లో 5 కప్పులు గెలవడానికి అదే కారణమని వివరించాడు. టీమిండియా తరఫున టీ20 వరల్డ్‌ కప్‌ గెలవడంతో మొదలైన వేట.. రానున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ కొనసాగుతుందంటూ రోహిత్‌ శర్మ స్పష్టం చేశాడు. ఒకరకంగా.. మిగతా అన్ని అంతర్జాతీయ టీమ్స్‌కు రోహిత్‌ శర్మ ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్‌ ఇచ్చినట్లే అని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి రోహిత్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments