iDreamPost
android-app
ios-app

IND vs BAN: బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్!

  • Published Sep 25, 2024 | 9:43 AM Updated Updated Sep 25, 2024 | 9:43 AM

IND vs BAN, Kanpur: సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ వేదికగా బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్ ఆడనుంది టీమిండియా. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. ఆ వివరాల్లోకి వెళితే..

IND vs BAN, Kanpur: సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ వేదికగా బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్ ఆడనుంది టీమిండియా. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. ఆ వివరాల్లోకి వెళితే..

IND vs BAN: బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్!

బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. ఫస్ట్ టెస్ట్ లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. ఇక ఇదే జోరును కాన్పూర్ వేదికగా జరగబోయే సెకండ్ మ్యాచ్ లో కూడా చూపించాలని భావిస్తోంది. మరోవైపు బంగ్లా ఓటమికి  ప్రతీకారం కోసం వేచి చూస్తోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ అందింది. ఆ వివరాల్లోకి వెళితే..

బంగ్లాదేశ్ తో ప్రారంభం అయిన టెస్ట్ సిరీస్ ను భారత్ ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్ లోనే ప్రత్యర్థిని కంగుతినిపించింది. అన్ని విభాగాల్లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపారు. దాంతో రెండు టెస్ట్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది భారత జట్టు. ఇక చివరి పోరులో కూడా నెగ్గి.. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. రెండో టెస్ట్ జరగనున్న క్రమంలో క్రికెట్ లవర్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ అందింది. రెండో టెస్ట్ జరగాల్సిన కాన్పూర్ లో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ ప్రారంభం అయిన తొలి రెండు రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ లు ఉన్నట్లు అక్కడి వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది.

కాగా.. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్లు కాన్పూర్ చేరుకున్నాయి. ఇక కాన్పూర్ పిచ్ విషయానికి వస్తే.. పూర్తిగా నల్లమట్టితో స్లో వికెట్ ను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఫ్లాట్ గా ఉండే ఈ పిచ్ పై మెుదట్లో పరుగులు ఈజీగా చేయెుచ్చని, ఆ తర్వాత నెమ్మదిగా స్పిన్ బౌలర్లకు పిచ్ అనుకూలిస్తుందని సమాచారం. దీన్ని దృష్టిలో  ఉంచుకునే టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవడంతో పాటుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. తద్వారా ముచ్చటగా మూడోసారి WTC ఫైనల్లోకి ప్రవేశించాలని ఆరాటపడుతోంది. ఈసారి ఎలాగైనా టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ ను సాధించాలని పట్టుదలగా ఉంది.