టీ20 టీమ్‌లో విరాట్‌ కోహ్లీ స్థానం అతనికి ఫిక్స్‌ చేసిన కెప్టెన్‌ గిల్‌!

Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli: భారత దిగ్గజ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ టీ20 ఫార్మాట్‌లో వదిలేసిన స్థానంలో.. ఆడేది ఎవరో కొత్త కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తేల్చేశాడు. మరి ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli: భారత దిగ్గజ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ టీ20 ఫార్మాట్‌లో వదిలేసిన స్థానంలో.. ఆడేది ఎవరో కొత్త కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తేల్చేశాడు. మరి ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత భారత క్రికెట్‌ అభిమానులు ఎంత సంతోషంగా ఉన్నారో.. ఏదో తెలియని బాధ కూడా వారిలో ఉంది. అదేంటంటే.. రాబోయే టీ20 మ్యాచ్‌ల్లో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మను చూడలేమని. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ గెలిచిన తర్వాత.. కోహ్లీ, రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. వీరి బాటలోనే మరో సీనియర్‌ ప్లేయర్‌ రవీంద్ర జడేజా సైతం టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే.. ఇంత కాలం జట్టులో పాతుకొనిపోయిన వీరి స్థానాల్లో ఎవరు ఆడుతారనే విషయంపై క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. తాజాగా కోహ్లీ స్థానంపై కొంత క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. అది ఎలాగంటే..

వరల్డ్‌ కప్‌ ఆడిన ఆటగాళ్లకు రెస్ట్‌ ఇస్తూ.. యంగ్‌ టీమిండియాను జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌ ఆడేందుకు పంపింది బీసీసీఐ. ఈ టీమ్‌కు శుబ్‌మన్‌ గిల్‌ను కెప్టెన్‌గా నియమించింది. శనవారం జింబాబ్వేతో యంగ్‌ టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌కి ముందు జట్టులోని కొన్ని ప్లేసులపై క్లారిటీ ఇచ్చాడు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌. తాను.. యువ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాడు. వీరితో పాటు జట్టులో మరో ఓపెనర్‌ ఉన్న విషయం తెలిసిందే. అతనే రుతురాజ్‌ గైక్వాడ్‌.

అతన్ని వన్‌డౌన్‌లో ఆడిస్తామని కెప్టెన్‌ గిల్‌ స్పష్టత ఇచ్చాడు. గైక్వాడ్‌ అద్భుతమైన ప్లేయర్‌.. ఎటాకింగ్‌తో పాటు నిదానంగా ఆడే టాలెంట్‌ ఉన్న ప్లేయర్‌. అందుకే అతన్ని వన్‌డౌన్‌లో ఆడించాలని ప్రస్తుత టీమ్‌ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. దీంతో.. ఇకపై విరాట్‌ కోహ్లీ స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ ఆడతాడని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. రుతురాజ్‌ ఆటతీరు విరాట్‌ కోహ్లీకి చాలా దగ్గరగా ఉంటుంది. కాస్త టైమ్‌ తీసుకుని ఆడతాడు, లాంగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడగలడు, వికెట్లు పడినా.. ఒత్తిడిని తట్టుకుని ఇన్నింగ్స్‌ను బిల్డ్‌ చేస్తాడు ఇలా అన్ని క్వాలిటీస్‌ కూడా కోహ్లీకి దగ్గరగా ఉండటంతో గైక్వాడ్‌ను వన్‌డౌన్‌లోనే ఆడించడమే కరెక్ట్‌ అంటున్నారు క్రికెట్ నిపుణులు. అయితే.. టీ20 వరల్డ్ కప్‌ 2024లో కోహ్లీ ఓపెనర్‌గా ఆడినా.. వన్‌డౌన్‌లోనే ఎక్కువ కాలం ఆడి, ఎక్కువ సక్సెస్‌ అయ్యాడు. గైక్వాడ్‌ కూడా తనకు వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటే.. కోహ్లీ అంత గొప్ప ఆటగాడు అయ్యే ఛాన్స్‌ఉంది. మరి కోహ్లీ వన్‌డౌన్‌ ప్లేస్‌లో గైక్వాడ్‌ను ఆడించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments