iDreamPost
android-app
ios-app

T20 వరల్డ్ కప్​కు దగ్గర పడుతున్న టైమ్.. అతడ్ని మళ్లీ నిద్రలేపాలి!

  • Published Jan 06, 2024 | 9:35 PMUpdated Jan 06, 2024 | 9:35 PM

టీ20 వరల్డ్ కప్​కు టైమ్ దగ్గర పడుతోంది. మెగాటోర్నీకి ముందు ఆఫ్ఘానిస్థాన్​తో జరిగే మూడు టీ20ల సిరీసే పొట్టి ఫార్మాట్​లో భారత్​కు చివరిది కానుంది. ఆ తర్వాత ఐపీఎల్​ స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఒక ప్లేయర్​ను నిద్రలేపాల్సిన సమయం ఆసన్నమైంది.

టీ20 వరల్డ్ కప్​కు టైమ్ దగ్గర పడుతోంది. మెగాటోర్నీకి ముందు ఆఫ్ఘానిస్థాన్​తో జరిగే మూడు టీ20ల సిరీసే పొట్టి ఫార్మాట్​లో భారత్​కు చివరిది కానుంది. ఆ తర్వాత ఐపీఎల్​ స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఒక ప్లేయర్​ను నిద్రలేపాల్సిన సమయం ఆసన్నమైంది.

  • Published Jan 06, 2024 | 9:35 PMUpdated Jan 06, 2024 | 9:35 PM
T20 వరల్డ్ కప్​కు దగ్గర పడుతున్న టైమ్.. అతడ్ని మళ్లీ నిద్రలేపాలి!

వన్డే వరల్డ్ కప్ డ్రీమ్ చెదిరిపోయింది. మూడోమారు ప్రపంచ కప్​ను ఒడిసి పట్టుకుంటారని అనుకుంటే దాన్ని మిస్ చేసుకున్నారు. గతేడాది స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్​ ఫైనల్​లో ఓడింది భారత్. కప్పు సాధించాలనే కల తృటిలో చేజారింది. దీంతో టీమిండియా ప్లేయర్లతో పాటు కోట్లాది మంది భారతీయులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. చేతికి అందినట్లే అంది కప్పు మిస్సవడంతో ఆ బాధలో నుంచి బయటకు వచ్చేందుకు క్రికెటర్లు చాలా టైమ్ తీసుకున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్లయితే చాన్నాళ్ల వరకు పబ్లిక్​లో ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటకు వస్తున్నారు. సౌతాఫ్రికా టూర్ వాళ్లు మళ్లీ నార్మల్ అయ్యేందుకు ఎంతో ఉపయోగపడింది. అయితే రిలాక్స్ అయ్యేందుకు టైమ్ లేదు. వరల్డ్ కప్ డ్రీమ్​ను నెరవేర్చుకునేందుకు మరో మంచి ఛాన్స్. ఈ ఏడాది జూన్​లో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. అయితే ఇందులో నెగ్గాలాంటే నిద్రపోతున్న ఓ ప్లేయర్​ను మేల్కొల్పాల్సిన అవసరం ఉంది.

టీ20 వరల్డ్ కప్​కు టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక క్రికెటర్​ను నిద్రలేపాల్సిన తరుణం వచ్చేసింది. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. వాషింగ్టన్ సుందర్. ఇతడు పెద్ద స్టార్ కూడా కాదు.. అలాంటప్పుడు ఎందుకు హైప్ ఇవ్వడమని అనుకుంటున్నారా? స్టార్ ప్లేయర్ కాకపోయినా టీమ్​కు బ్యాలెన్స్ తీసుకురావడంలో సుందర్ ఎంతో కీలకం అవుతాడు. అతడి ఆల్​రౌండర్ ఎబిలిటీస్ జట్టుకు ఎంతో ఉపయోగపడతాయి. బ్యాటర్లతో నిండిన స్క్వాడ్​లో సమతూకం తీసుకురావాలంటే సుందర్ లాంటి ఆల్​రౌండర్ చాలా అవసరం. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ రూపంలో ఆల్రెడీ స్పిన్ ఆల్​రౌండర్లు ఉన్నారని అనుకోవచ్చు. కానీ వాళ్లిద్దరితో పోల్చుకుంటే బ్యాటింగ్​లో సుందర్ కన్​సిస్టెంట్​గా రాణించడం ప్లస్ పాయింట్. తన ఆఫ్ స్పిన్ బౌలింగ్​తో లెఫ్టాండ్ బ్యాటర్లను అతడు ముప్పుతిప్పలు పెట్టగలడు. బ్యాటింగ్​లో భారీ షాట్స్ ఆడటంతో పాటు అవసరాన్ని బట్టి డిఫెన్స్​ చేసే ఎబిలిటీస్​ సుందర్​కు ఉన్నాయి. అలాంటోడ్ని టీమిండియా సరిగ్గా వాడుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి.

టీమ్​ వెంటే ఉన్నా సుందర్​కు అవకాశాలు రావడం లేదు. అతడ్ని బెంచ్ మీదే కూర్చోబెడుతున్నారు. వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్​లకు సుందర్​ను సెలక్ట్ చేశారు. కానీ ఒక్క మ్యాచ్​లోనూ ఆడించలేదు. దీంతో అతడు డల్ అయిపోయాడు. లెఫ్టాండ్ బ్యాటర్​గా విలువైన రన్స్ చేయడంతో పాటు స్పిన్ బౌలింగ్​తో కీలక వికెట్లు తీయగలడు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇస్తే మన టీ20 స్క్వాడ్​లో టాప్-5లో అంతా బ్యాటర్లే ఉంటారు. వారిలో ఒక్కరు కూడా బౌలింగ్ చేయలేరు. కాబట్టి సుందర్​ను త్వరలో ఆఫ్ఘానిస్థాన్​తో జరిగే టీ20 సిరీస్​లో ఆడించాలి. టీ20 వరల్డ్ కప్​కు అతిథ్యం ఇస్తున్న కరీబియన్ పిచ్​ల మీద అలాంటి ఆల్​రౌండర్ అవసరం మనకు ఎంతగానో ఉంది. అతడికి వరుస అవకాశాలు ఇచ్చి జోష్ నింపాలి. టీమ్​లో ప్లేస్ పక్కా అనే భరోసా ఇవ్వాలి. వరల్డ్ కప్ కొట్టాలంటే ఇలాంటి కీలక ప్లేయర్లను నిద్రలేపాల్సిన టైమ్ వచ్చేసిందని సోషల్ మీడియలో నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. సుందర్​ను టీమ్ అవసరాలకు తగ్గట్లుగా వాడుకోవాలని సూచిస్తున్నారు. మరి.. సుందర్​ను వరల్డ్ కప్​ కోసం ప్రిపేర్ చేయాలనే డిమాండ్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: T20 World Cup 2024: కెప్టెన్ గా హార్దిక్ ఫొటో.. ఆ స్పోర్ట్స్ ఛానల్ పై ఫ్యాన్స్ ఫైర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి