iDreamPost

T20 World Cup 2024: కెప్టెన్ గా హార్దిక్ ఫొటో.. ఆ స్పోర్ట్స్ ఛానల్ పై ఫ్యాన్స్ ఫైర్

ప్రస్తుతం రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ హార్దిక్ పాండ్యా, ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లు ఎందుకు ఫైర్ అవుతున్నారో చూడండి.

ప్రస్తుతం రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ హార్దిక్ పాండ్యా, ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లు ఎందుకు ఫైర్ అవుతున్నారో చూడండి.

T20 World Cup 2024: కెప్టెన్ గా హార్దిక్ ఫొటో.. ఆ స్పోర్ట్స్ ఛానల్ పై ఫ్యాన్స్ ఫైర్

గత కొన్ని రోజులుగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ హార్దిక్ పాండ్యా మీద ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ నుంచి కెప్టెన్ చేస్తేనే వస్తాను అంటూ కండిషన్ పెట్టి ముంబయి ఇండియన్స్ లోకి వచ్చాడు. అలాగే హార్దిక్ పాండ్యాని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా కూడా ప్రకటించారు. అయితే హార్దిక్ పాండ్యా మాత్రం గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ కూడా కష్టం అంటూ చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓ స్పోర్ట్స్ ఛానల్ చూపించిన అత్యుత్సాహంతో హార్దిక్ పాండ్యాపై రోహిత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వచ్చే టీ20 వరల్డ్ కప్ మ్యాచులకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఫొటోను వాడుతున్నారు. పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు హార్దిక్ ఫొటో పెట్టి ప్రచారం స్టార్ట్ చేశారు.

ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఐపీఎల్ కూడా ఆడతాడో లేదో అనే కన్ఫ్యూజన్ అందరిలో ఉంది. అయితే స్పోర్ట్స్ ఛానల్ మాత్రం ఏకంగా కెప్టెన్ గా ఫొటో పెట్టేసి ఈ మ్యాచ్ కోసమే మేమంతా ఎదురుచూస్తున్నాం అంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే హిట్ మ్యాన్ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. వివిధ రకాల కామెంట్స్ తో వాళ్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. “అసలు హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఎవరు చెప్పారు? మీ ఇష్టమొచ్చినట్లు కెప్టెన్ ని డిసైడ్ చేసుకుంటారా? మాకు రోహిత్ శర్మానే కెప్టెన్ గా కావాలి. ముందు మీరు ఆ పిక్ మార్చండి” అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఈ విషయమై బీసీసీఐ స్పందించి ఆ ఫొటోలు మార్పించాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి వాళ్లు చేసిన ఈ పనితో పాకిస్తాన్ తో మ్యాచ్ కు అనుకున్న దానికంటే ఎక్కువే పబ్లిసిటీ దక్కినట్లు అయ్యింది.

రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఈ విషయంలో ఫైర్ అవుతున్నా కూడా వారికి సంబరాలు చేసుకునే వార్తలు అందుతూనే ఉన్నాయి. అవేంటంటే.. గత టీ20 వరల్డ్ కప్ తర్వా పొట్టి క్రికెట్ ఫార్మాట్ కు దూరమైన రోహిత్ శర్మ తిరిగి రీఎంట్రీ ఇస్తున్నాడని చెబుతున్నారు. రోహిత్- కోహ్లీ ఇద్దరూ తిరిగి టీ20 జట్టులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు కూడా వీళ్లు సుముఖత చూపిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మానే నియమించాలని భావిస్తున్నారట. అందుకే రోహిత్ ఫ్యాన్స్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఫొటో చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు ఆనందం కూడా ఉంది. ముంబయి ఇండియన్స్ జట్టు పగ్గాలను లాక్కున్న హార్దిక్ పాండ్యాకు బుద్ధి చెప్పడానికి రోహిత్ శర్మ సరైన నిర్ణయం తీసుకున్నాడు అంటున్నారు. అతను ముంబయి జట్టును లాక్కుంటే.. రోహిత్ మాత్రం ఏకంగా టీమిండియా టీ20 జట్టు పగ్గాలను లాక్కున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంక టీ20 వరల్డ్ కప్ 2024 విషయానికి వస్తే.. పొట్టి ప్రపంచ కప్ కు సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదలైంది. జూన్ 1 నుంచి 29 వరకు టోర్నమెంట్ జరగనుంది. జూన్ 1 నుంచి 18 వరకు గ్రూప్ మ్యాచులు జరుగుతాయి. ఈసారి టీమిండియా గ్రూపులో పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ జట్లు ఉన్నాయి. గ్రూప్ లెవల్లో టీమిండియా- పాకిస్తాన్ జట్లు న్యూయార్క్ వేదికగా జూన్ 9న తలపడనున్నాయి. అలాగే జూన్ 19 నుంచి 24 వరకు సూపర్ 8 మ్యాచులు జరుగుతాయి. జూన్ 26, 27 తేదీల్లో సెమీ ఫైనల్, జూన్ 29న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ పొట్టి ప్రపంచ కప్ టోర్నమెంట్ లో గ్రూప్ స్టేజ్ మ్యాచులన్నీ యూఎస్ఏలో, సూపర్ 8 మ్యాచులు మాత్రం వెస్టిండీస్ జరుగుతాయి. మరి.. కెప్టెన్ పాండ్యా ఫొటో వాడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి