iDreamPost
android-app
ios-app

IND vs SA: ఇండియా చెత్త బ్యాటింగ్.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి!

  • Published Jan 04, 2024 | 11:41 AM Updated Updated Jan 04, 2024 | 11:41 AM

భారత ఆటగాళ్ల చెత్త బ్యాటింగ్ తో 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత దారుణమైన రికార్డును మూటగట్టుకుంది టీమిండియా. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

భారత ఆటగాళ్ల చెత్త బ్యాటింగ్ తో 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత దారుణమైన రికార్డును మూటగట్టుకుంది టీమిండియా. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

IND vs SA: ఇండియా చెత్త బ్యాటింగ్.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి!

సౌతాఫ్రికా గడ్డపై తొలిటెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించాలనుకున్న టీమిండియాకు భారీ షాక్ ఇచ్చింది ఆతిథ్య జట్టు. ఫస్ట్ టెస్ట్ లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ ను ఓడించి.. రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో 1-0తో ముందంజలోకి దూసుకెళ్లింది. ఇక రెండో టెస్టు లో నెగ్గి సిరీస్ ను సమం చేయాలని భావించి.. గ్రౌండ్ లోకి దిగింది టీమిండియా. అనుకున్నట్లుగానే సఫారీ టీమ్ ను తొలి ఇన్నింగ్స్ లో కేవలం 55 రన్స్ కే కుప్పకూల్చింది. అయితే ఆ సంతోషాన్ని ఎంతోసేపు నిలపలేదు సఫారీ బౌలర్లు. భారత ఆటగాళ్ల చెత్త బ్యాటింగ్ తో 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత దారుణమైన రికార్డును మూటగట్టుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్ తో సఫారీ టీమ్ 55 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ 6 వికెట్లతో సంచలన సృష్టించాడు. ఇక అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా సైతం తక్కువ పరుగులకే ప్యాకప్ అయ్యింది. సఫారీ పేసర్లు సైతం చెలరేగడంతో.. టీమిండియా బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. తన పూర్ ఫామ్ ను కొనసాగిస్తూ.. యంగ్ బ్యాటర్ జైస్వాల్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ(39), శుబ్ మన్ గిల్(36), విరాట్ కోహ్లీ(46) పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రోటీస్ బౌలర్లు బర్గర్, ఎంగిడి, రబాడలు వారిని ఔట్ చేసి టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశారు. మిగతా బ్యాటర్లలో ఆరుగురు డకౌట్ గా వెనుదిరిగారు. చివరి బ్యారట్ అయిన ముకేశ్ కుమార్ 0* పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. దీంతో 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది భారత జట్టు. ఆ రికార్డు ఏంటంటే?

Worst record in 147 years of history

టీమిండియాలో 7 ప్లేయర్లు 0 పరుగులు(ముకేశ్ కుమార్ 0*) చేయడం ఇదే తొలిసారి. 2522 టెస్టు మ్యాచ్ ల్లో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ చెత్త రికార్డును అత్యంత వరస్ట్ బ్యాటింగ్ తో టీమిండియా బ్యాటర్లు లిఖించారు. జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, జడేజా, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణలు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులు చేయగా.. టీమిండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో 153 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీ టీమ్ ఆటముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసి.. 36 పరుగులతో వెనకబడి ఉంది. వరల్డ్ క్లాస్ బ్యాటింగ్ లైనప్ ఉందని భావించిన టీమిండియా జట్టు.. ఇలా దారుణంగా ఆలౌట్ కావడంతో, తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు మాజీ క్రికెటర్లు. మరి అత్యంత చెత్త రికార్డును టీమిండియా తనపేరిట లిఖించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.