Tirupathi Rao
Team India Women Beat Pakistan By 7 wickets: మహిళల ఆసియా కప్పు టీ20 టోర్నమెంట్ లో భారత మహిళల జట్టు ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టును చిత్తుగా ఓడించింది. 7 వికెట్ల తేడాతో టీమిండియా జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Team India Women Beat Pakistan By 7 wickets: మహిళల ఆసియా కప్పు టీ20 టోర్నమెంట్ లో భారత మహిళల జట్టు ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టును చిత్తుగా ఓడించింది. 7 వికెట్ల తేడాతో టీమిండియా జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Tirupathi Rao
ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ మహిళల ఆసియా కప్ టీ20 2024 టోర్నమెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ టోర్నీలో భాగంగా భారత మహిళా క్రికెట్ జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది. పాకిస్థాన్ మహిళల జట్టును చిత్తు చేసి జయకేతనం ఎగురవేసింది. టీమిండియా తొలి మ్యాచ్ లో దాయాదులతో పోరు కావడంతో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అలాంటి ఉత్కంఠ మ్యాచ్ లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. అలాగే భారత బౌలర్ల దెబ్బకు పాక్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. కేవలం 108 పరుగులకే పాకిస్థాన్ మహిళల జట్టును పరిమితం చేశారు. అలాగే 5.5 ఓవర్లు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
ప్రస్తుతం టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే భారత మహిళల జట్టు పాకిస్థాన్ జట్టును చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు రెండో ఓవర్ నుంచి పెవిలియన్ క్యూ కట్టింది. పాక్ జట్టులో ఓ ఒక్క క్రికెటర్ కూడా 25కి మించి స్కోర్ చేయలేదు. 20 పరుగులు దాటి చేసింది కూడా కేవలం ముగ్గురు మాత్రమే కావడం విశేషం. అమీన్(25), తుబా హసన్(22), ఫాతిమా సనా(22), మునీబా అలి(11) మాత్రమే కాస్త పర్వాలేదు అనిపించారు. మిగిలిన వాళ్లు అంతా 10లోపు పరుగులకే పరిమితం అయ్యారు. అలాగే వీరిలో ఒకరు డకౌట్, ఇద్దరు గోల్డెన్ డక్ కావడం విశేషం.
ఇంక టీమిండియా బౌలింగ్ విభాగం చూస్తే.. దీప్తీ శర్మాకు 3 వికెట్లు దక్కాయి. రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్ లకు తలో 2 వికెట్లు దక్కాయి. రాధా యాదవ్ ఒకరిని రనౌట్ చేసింది. ఇంక టీమిండియా బ్యాటింగ్ చూస్తే.. షఫాలీ వర్మా(40), స్మృతి మందన్నా(45), దయాలన్ హేమలత(14) పరుగులు చేశారు. హర్మన్ ప్రీత్ కౌర్(5*), జెమీమా రోడ్రిగ్స్(3*) నాటౌట్ గా నిలిచారు. ఇంకా 5.5 ఓవర్లు మిగిలి ఉండగానే.. పాకిస్థాన్ నిర్దేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మహిళల జట్టు ఛేదించింది. అలాగే 7 వికటె్ల ఘన విజయాన్ని నమోదు చేసింది. పాయింట్స్ టేబులో గ్రూప్ ఏలో 2 పాయింట్లు, +2.294 నెట్ రన్ రేట్ తో ఖాతా తెరిచింది. ప్రస్తుతం ఫ్యాన్స్ అంతా టీమిండియా ఘన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి.. పాక్ జట్టును టీమిండియా చిత్తు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.