iDreamPost
android-app
ios-app

Team India: వీడియో: రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడిన టీమిండియా! విన్నర్‌ను ప్రకటించిన ఫీల్డింగ్‌ కోచ్‌

  • Published Sep 17, 2024 | 6:47 PM Updated Updated Sep 17, 2024 | 6:47 PM

Team India practice video: బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా ఘోరంగా ప్రాక్టీస్ చేస్తోంది. తాజాగా రెండు గ్రూప్ లుగా విడిపోయి పోటీ పడ్డాయి. విరాట్ కోహ్లీ వర్సెస్ రోహిత్ శర్మ టీముల్లో ఏ జట్టు గెలిచిందంటే?

Team India practice video: బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా ఘోరంగా ప్రాక్టీస్ చేస్తోంది. తాజాగా రెండు గ్రూప్ లుగా విడిపోయి పోటీ పడ్డాయి. విరాట్ కోహ్లీ వర్సెస్ రోహిత్ శర్మ టీముల్లో ఏ జట్టు గెలిచిందంటే?

Team India: వీడియో: రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడిన టీమిండియా! విన్నర్‌ను ప్రకటించిన ఫీల్డింగ్‌ కోచ్‌

మండుటెండల్లో టీమిండియా ఆటగాళ్లు గ్రౌండ్ లో చమటోడుస్తున్నారు. చెన్నై చెపాక్ స్టేడియం ప్లేయర్ల ఉరుకులు, పరుగులు, అరుపులతో దద్దరిల్లుతోంది. బంగ్లాదేశ్ తో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ కోసం భారత ఆటగాళ్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. తొలి రెండు రోజులు ఎక్కువగా బ్యాటింగ్ పై దృష్టిపెట్టిన ప్లేయర్లు.. తర్వాత రోజు ఫీల్డింగ్ పై ఫోకస్ పెట్టారు. ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడ్డాయి. విరాట్ కోహ్లీ వర్సెస్ రోహిత్ శర్మ టీమ్స్ లో ఏ టీమ్ గెలిచిందో కోచ్ టి. దిలీప్ కుమార్ ప్రకటించాడు.

బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ ను టీమిండియా అంత ఈజీగా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇటీవలే బంగ్లా పాకిస్థాన్ ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేసి సంచలనం సృష్టించింది. పైగా ఇదే జోరును టీమిండియాపై కూడా చూపిస్తామని బంగ్లా కెప్టెన్ టీమిండియాకు వార్నింగ్ ఇవ్వడంతో.. జట్టు కూడా జాగ్రత్త పడుతోంది. అందులో భాగంగానే కఠోరమైన సాధన చేస్తోంది. చెపాక్ లో మండుటెండల్లో చెమటలు చిందిస్తున్నారు ప్లేయర్లు. ఈ క్రమంలోనే ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో భారత ఆటగాళ్లు రెండు గ్రూప్ లుగా విడిపోయి పోటీ పడ్డారు. రెండు సెషన్లుగా సాగిన ఈ ప్రాక్టీస్ లో రోహిత్ శర్మ టీమ్ పై విరాట్ కోహ్లీ జట్టు విజయం సాధించినట్లుగా కోచ్ దిలీప్ కుమార్ తెలిపాడు.

“కాంపీటిషన్ డ్రిల్ లో భాగంగా రెండు దశల్లో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. అందులో మెుదటిది చెన్నై పిచ్ పరిస్థితులు, ఇంటెన్సిటి, వాతావరణానికి తగ్గట్లుగా ఎలా ఆడాలో తెలుసుకున్నారు. ఇక ఈ రోజు టీమిండియా రెండు గ్రూప్ లుగా విడిపోయి ప్రాక్టీస్ చేశారు. హాట్ వెదర్ లో సైతం ఆటగాళ్లు అద్భుతంగా ప్రాక్టీస్ చేశారు. రెండు టీమ్స్ గా విడిపోయిన ప్లేయర్లు మెుదట ఇన్ అండ్ ఔట్ ఫీల్డ్ లో క్యాచ్ లు ఎలా పట్టాలో ప్రాక్టీస్ చేశారు. ఆ స్లిప్ క్యాచ్ లను చాకచక్యంగా ఎలా ఒడిసిపట్టాలో మెళకువలు నేర్చుకున్నారు. ఇక ఈ కాంపీషన్ లో విరాట్ టీమ్ విజయం సాధించింది. చాలా తక్కువ మంది మాత్రమే ఫీల్డింగ్ లో నిరాశపరిచారు”  అని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇక ఈ ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కాగా.. విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్, శుబ్ మన్ గిల్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు యాక్టీవ్ గా ప్రాక్టీస్ లో పాల్గొన్నారు. ఇక బంగ్లాదేశ్ ను ఓడించేందుకు అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ ఉండాలన్న ఉద్దేశంతోనే బ్యాటింగ్,  బౌలింగ్, ఫీల్డింగ్ లకు సానబెడుతోంది టీమిండియా. మరి బంగ్లాదేశ్ ను ఎదుర్కొనేందుకు టీమిండియా చేస్తున్న కఠోరమైన ప్రాక్టీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.