SNP
2024 కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధించాలని, అచీవ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంటారు. అయితే.. భారత క్రికెట్ జట్టుకు కూడా కొత్త ఏడాదిలో ఒక టార్గెట్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
2024 కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధించాలని, అచీవ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంటారు. అయితే.. భారత క్రికెట్ జట్టుకు కూడా కొత్త ఏడాదిలో ఒక టార్గెట్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2023 ఏడాదికి గుడ్‌బై చెప్పి.. కొత్త సంవత్సరం 2024కు స్వాగతం పలుకుతున్నారు. అయితే.. ఇలా ఏడాది మారిన టైమ్‌లో చాలా మంది కొన్ని గోల్స్ పెట్టుకుంటారు. రివెల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవి ఎవరికి వారు వ్యక్తిగతంగా తీసుకునేవి. అయితే.. టీమిండియాకు కూడా 2024లో ఒక గోల్ ఉంది. ఒక కచ్చితమైన టార్గెట్ ఫిక్స్ అయింది ఉంది. దాని కోసమే ఒకరకంగా టీమిండియా 2024లోకి అడుగుపెడుతుందని చెప్పవచ్చు. మరి టీమిండియాకు 2024 కొత్త ఏడాదిలో ఫిక్స్ అయిన ఆ టార్గెట్ ఏంటి? దాన్ని టీమిండియా పూర్తి చేస్తుందా? లేదా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
2023లో జరిగిన బిగ్ టోర్నమెంట్ ఏంటంటే.. వన్డే వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులతో పాటు టీమిండియా క్రికెటర్లు వరల్డ్ కప్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. 2011 మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయాలని.. టీమ్‌ను అద్భుతంగా సెట్ చేసుకుని రోహిత్ శర్మ బరిలోకి దిగాడు. టీమ్‌కు కెప్టెన్ కాకపోయినా.. ఒక పెద్దన్నలా విరాట్ కోహ్లీ సైతం వరల్డ్ కప్ గెలవాలనే సంకల్పంతో ముందుడి నడిచాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, షమీ ఇలా సీనియర్లంతా ఎంతో అద్భుతంగా ఆడటం వారికి ఇతర ఆటగాళ్ల నుంచి కూడా మద్దుతు లభించడంతో టీమిండియా వరల్డ్ కప్ టోర్నీలో దూసుకెళ్లింది. తొలి మ్యాచ్‌లోనే పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా.. తర్వాత అడ్డొచ్చిన ప్రతి టీమ్‌ను అడ్డంగా ఓడించి మరీ ముందుకు కదిలింది.
వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో మనకు అడ్డు తగిలే న్యూజిలాండ్‌ను అయితే ఈ వరల్డ్ కప్‌లో ఏకంగా రెండు సార్లు ఓడించింది. ముఖ్యంగా సెమీ ఫైనల్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలై.. వరల్డ్ కప్‌ను చేజార్చుకుంది. ఆ ఓటమి క్రికెటర్లే కాదు, వంద కోట్లకు పైగా భారత క్రికెట్ అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. ఇంకా ఆ గాయం క్రికెట్ అభిమానుల్లో గుండెల్లో పచ్చిగానే ఉంది. అయితే.. 2024లో జరిగే టీ20 వరల్డ్ కప్‌ను గెలిచి.. ఈ వరల్డ్ కప్ ఓటమిని మర్చిపోయేలా చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. 2024లో టీమిండియాకు ఉన్న టార్గెట్ అదే.. టీ20 వరల్డ్ కప్ కొట్టడమే భారత జట్టు ముందున్న టార్గెట్. పైగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బహుషా అదే చివరి టీ20 వరల్డ్ కప్ కూడా కావచ్చు. అందుకే ఎలాగే పొట్టి ప్రపంచ కప్ గెలవాలని ఇప్పటి నుంచే టీమిండియా ప్లాన్లు వేస్తోంది. మరి కొత్త ఏడాదికి టీమిండియా సెట్ చేసుకున్న గోల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.