Nidhan
టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ డెబ్యూ సిరీస్‌లోనే అదరగొట్టాడు. తన బ్యాట్ సత్తా ఏంటో అందరికీ చూపించాడు. అలాంటోడు ఇప్పుడు మరో సవాల్‌కు సిద్ధమవుతున్నాడు.
టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ డెబ్యూ సిరీస్‌లోనే అదరగొట్టాడు. తన బ్యాట్ సత్తా ఏంటో అందరికీ చూపించాడు. అలాంటోడు ఇప్పుడు మరో సవాల్‌కు సిద్ధమవుతున్నాడు.
Nidhan
భారత క్రికెట్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఒక్కో స్పాట్ కోసం టీమ్‌లో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. డొమెస్టిక్ లెవల్‌తో పాటు ఐపీఎల్లో రాణించినా కూడా జట్టులో చోటు దక్కుతుందని గ్యారెంటీ లేదు. అందునా టెస్టుల్లో బెర్త్ సంపాదించడం అంటే తలకు మించిన పని అనే చెప్పాలి. యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఇలాగే ఎంతో ప్రయత్నించి ఆఖరికి తన కలను నెరవేర్చుకున్నాడు. ఏళ్ల పాటు దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించినా అతడికి ఛాన్స్ దక్కలేదు. బరువు అధికంగా ఉన్నాడనే కారణంతో సర్ఫరాజ్‌ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఇంగ్లండ్ సిరీస్‌తో అతడికి ఛాన్స్ వచ్చింది. దాన్ని అతడు రెండు చేతులా ఉపయోగించుకున్నాడు. మూడు టెస్టుల్లో 200 పరుగులతో సత్తా చాటాడు. అలాంటోడు తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది భారత్. దీనికి సెలెక్ట్ అవ్వాలంటే బుచ్చిబాబు టోర్నీ, దులీప్ ట్రోఫీ లాంటి దేశవాళీ టోర్నీల్లో తప్పక రాణించాల్సిన పరిస్థితి. టీమిండియా స్టార్లంతా ఇందులో ఆడుతున్నారు. బాగా ఆడితే టీమ్‌లోకి ఛాన్స్ పక్కాగా కనిపిస్తోంది. కానీ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం తనకు ఆశల్లేవని, భారత తుది జట్టులో చోటు కష్టమేనని అంటున్నాడు. గతంలోనూ డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టినా అవకాశాలు పెద్దగా రాలేదన్నాడు. ఈసారి దేశవాళీ టోర్నీల్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బరిలోకి దిగుతున్నానని అన్నాడు. ప్రతి ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకునేందుకు తన వంతుగా ప్రయత్నిస్తానని చెప్పాడు. ఇప్పటివరకు చేసినదే ఇక మీదటా కంటిన్యూ చేస్తానని సర్ఫరాజ్ పేర్కొన్నాడు.
‘నా కెరీర్లో తప్పకుండా బ్రేక్ వస్తుందని భావిస్తున్నా. అయితే అందుకు వేచి చూడాల్సి ఉంటుంది. ఒకరకంగా ఇది నాకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. అప్పుడే నేను డొమెస్టిక్ క్రికెట్ ఎక్కువగా ఆడతా. ఇక్కడ ఎక్కువ టైమ్ గడిపితే అత్యుత్తమ బ్యాటర్‌గా మారేందుకు ఛాన్స్ ఉంటుంది’ అని సర్ఫరాజ్ చెప్పుకొచ్చాడు. ఇక, బుచ్చిబాబు టోర్నమెంట్లో ఇషాన్ కిషన్‌తో పాటు మరో టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నాడు. దులీప్ ట్రోఫీలోనైతే దాదాపుగా అందరు భారత ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా తప్ప అందరు స్టార్లు ఆడనున్నారు. శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ దగ్గర నుంచి మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ వరకు దులీప్ ట్రోఫీలో సత్తా చాటేందుకు అంతా సిద్ధమవుతున్నారు. మరి.. బంగ్లా సిరీస్‌కు సర్ఫరాజ్ సెలెక్ట్ అవుతాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
Sarfaraz Khan “My father & I had a dream,It was to play for India & was able to achieve it against England.But it shouldn’t be the end. Now,I’ve to prolong that dream as long as I can and for that,I have to do a lot of hard work,there is no time for rest”pic.twitter.com/uAyARCIsVA
— Sujeet Suman (@sujeetsuman1991) August 16, 2024